ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ రాక్షస పాలనకు సరిగ్గా ఏడాది క్రితం ప్రజలు చరమగీతం పాడారని రాష్ట్ర మంత్రి అనగాని సత్యప్రసాద్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రజలను తీవ్రంగా వేధించిన నాటి పాలకులకు ఎన్నికల ఫలితాల ద్వారా ప్రజలు చాచి కొట్టినట్లు బుద్ధి చెప్పారని ఆయన అన్నారు. అమరావతిలో మీడియాతో మాట్లాడిన మంత్రి... మాజీ ముఖ్యమంత్రి జగన్, వైసీపీ నేతలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
గత ఐదేళ్లలో ప్రజలకు చేసిన మోసానికి జగన్ నిజానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలని, కానీ అందుకు భిన్నంగా 'వెన్నుపోటు దినం' అంటూ కొత్త నాటకాలకు తెరలేపారని అనగాని ఎద్దేవా చేశారు. ప్రజలు చారిత్రక తీర్పు ఇచ్చిన జూన్ నాలుగో తేదీని వైసీపీ నాయకులు 'పశ్చాత్తాప దినం'గా జరుపుకోవాలని ఆయన హితవు పలికారు. ప్రస్తుతం రాష్ట్రంలో కొనసాగుతున్న కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజలకు మేలు జరుగుతుండటాన్ని చూసి వైసీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని, అందుకే వారికి అలవాటైన రీతిలో అబద్ధాలను ప్రచారం చేస్తున్నారని మంత్రి మండిపడ్డారు.
ఇది కూడా చదవండి: టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలుకు కీలక బాధ్యతలు అప్పగించిన కేంద్రం! ఎన్డీఏ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ..!
తల్లికి, సొంత చెల్లెళ్లకే వెన్నుపోటు పొడిచిన చరిత్ర ఉన్న జగన్‌ను ప్రజలు ఎలా విశ్వసిస్తారని అనగాని సత్యప్రసాద్ ప్రశ్నించారు. ఆయన ఇదే రకమైన వైఖరితో ముందుకు సాగితే, రాష్ట్రంలో వైసీపీ పరిస్థితి పూర్తిగా దిగజారి, చివరికి సున్నాకు చేరుకుంటుందని ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ సుపరిపాలన అందిస్తోందని, దీనిని చూసి ఓర్వలేని వైసీపీ నేతలు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని దుయ్యబట్టారు.
ఇది కూడా చదవండి: మెగా డీఎస్సీ పరీక్షల షెడ్యూల్‌లో ఈ మార్పులు గమనించారా..? వారికి నో ఛాన్స్..!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
రేషన్ కార్డు దారులకు అలర్ట్! రేషన్ కొత్త టైమింగ్స్, తేదీలు ఇవే..!
ఏపీ ప్రభుత్వం మరో అలర్ట్..! వీళ్లు ఇళ్లలో నుంచి అస్సలు రావొద్దు..!
ఏపీలో మళ్లీ మొదలైన రేషన్ షాపులు! క్యూ కట్టిన జనం!
ఏపీ ప్రజలకు ప్రభుత్వం బంపరాఫర్..! ఆ ప్లాట్లు వేలంలో దక్కించుకునే మంచి ఛాన్స్!
రేషన్ వద్దనుకుంటే డీబీటీ పద్ధతిలో డబ్బులు! సీఎం చంద్రబాబు!
ఏపీలో టీచర్ ఉద్యోగాలకు తీవ్ర పోటీ! ఒక్కో పోస్టుకు సగటున 35 మంది!
ఏపీలో వారందరికీ గుడ్‌న్యూస్..! ఒక్కొక్కరికీ రూ.15 వేలు అకౌంట్లలోకి డబ్బులు!
పేదలకు శుభవార్త..! ఫించన్ల పెంపుపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు!
తల్లులు, విద్యార్థులకు భారీ శుభవార్త..! ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం!
ఈ 100 రూపాయలు మీ దగ్గర ఉన్నాయా..! అరెస్ట్ అవుతారు జాగ్రత్త!
ఇంజినీరింగ్ విద్యార్థులకు గోల్డెన్ ఛాన్స్..! BEL నోటిఫికేషన్ రిలీజ్!
ఏపీలో 10 అద్భుతమైన బీచ్‌లు.. ఈ హిడన్ జెమ్స్ లాంటి బీచ్‌లను మిస్ అవ్వకండి..
ఏపీలో కొత్తగా ఐకానిక్ కేబుల్ బ్రిడ్జ్.. నేషనల్ హైవేకు కనెక్ట్! ఈ రూట్‌లోనే, డీపీఆర్ పనులు..!
వైసీపీకి దిమ్మ తిరిగే షాక్! టీడీపీ కార్యకర్తపై దాడి కేసులో కీలక నిందితుడు అరెస్ట్!
రూ.500 కోట్ల కుంభకోణంలో కిరణ్ అరెస్ట్! దర్యాప్తులో వారి వివరాలు వెల్లడి!
కవిత కు కేసీఆర్ మార్క్ ట్రీట్మెంట్..! హరీష్ కు కీలక బాధ్యతలు..!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: