ఓటీటీ వినియోగదారుల కోసం ఎయిర్టెల్ ఒక ప్రత్యేకమైన All-in-One ప్లాన్‌ను తీసుకువచ్చింది. ఈ ప్లాన్ ధర రూ.279 మాత్రమే. ఇందులో వినియోగదారులు నెల రోజుల పాటు 25కంటే ఎక్కువ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌ను యాక్సెస్ చేయవచ్చు. ఇందులో నెటిక్స్ బేసిక్, జియో హాట్‌గార్ సూపర్, జీ5 ప్రీమియం, సోనీలివ్, ఆహా, చౌపాల్, హోయిచోయ్ వంటి పాపులర్ సేవలు ఉన్నాయి.
ఈ ప్లాన్ Data-only కేటగిరీలోకి వస్తుంది. అంటే కాలింగ్, ఎస్ఎంఎస్ లాంటి ఫీచర్లు అందుబాటులో ఉండవు. కానీ ఇందులో వినియోగదారులకు 1 జీబీ అదనపు డేటా లభిస్తుంది. ఇది ఒక నెల పాటు చెల్లుబాటు అవుతుంది. ఎవరైతే ఇప్పటికే ఎయిర్టెల్ యాక్టివ్ ప్లాన్ వాడుతున్నారు, వారు అదనంగా ఈ ప్లాన్‌ను రీఛార్జ్ చేసుకొని తమ ఎంటర్టైన్‌మెంట్‌ను మరింత విస్తరించుకోవచ్చు.
ఈ ప్లాన్‌తో వినియోగదారులకు న్యూస్, మూవీస్, వెబ్ సిరీస్, లైవ్ టీవీ వంటి ఎన్నో రకాల కంటెంట్ ఓటీటీల్లో చూడటానికి అవకాశం ఉంది. ప్రీపెయిడ్ యూజర్లకు ఇది తక్కువ ఖర్చుతో మంచి బహుళ ఓటీటీ యాక్సెస్‌ను అందిస్తోంది.