కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తోందని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. 'అన్నదాత సుఖీభవ' పథకం ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలుపుతూ ఆయన పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో మంత్రి స్వయంగా ట్రాక్టర్ నడిపారు, వందలాది మంది రైతులు కూడా తమ ట్రాక్టర్లతో పాల్గొన్నారు.
పార్టీ జిల్లా అధ్యక్షుడు మంతెన రామరాజుతో కలిసి స్థానిక మార్కెట్ యార్డులో జరిగిన బహిరంగ సభలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాలకొల్లు నియోజకవర్గంలోని రైతులకు రూ.9.85 కోట్ల విలువైన 'అన్నదాత సుఖీభవ' చెక్కులను అందజేశారు. ఈ పథకం అర్హులైన ప్రతి రైతుకు వర్తిస్తుందని ఆయన హామీ ఇచ్చారు.