ఏపీ మంత్రి నారాయణ తన సింగపూర్ పర్యటనను ముగించుకుని మలేషియాకు చేరుకున్నారు. ఈ రోజు (శనివారం) ఆయన సీఆర్డీఏ కమిషనర్ కన్నబాబుతో కలిసి కౌలాలంపూర్‌లో పర్యటిస్తున్నారు. అమరావతి నిర్మాణం కోసం మలేషియాలో ఉన్న ఉత్తమ విధానాలను అధ్యయనం చేయడమే ఈ పర్యటన ముఖ్య ఉద్దేశ్యం.
ఉదయం మంత్రి నారాయణ కౌలాలంపూర్ అధికారులతో సమావేశమై, అక్కడి వరద నివారణ చర్యలు, అర్బన్ డెవలప్‌మెంట్, ఐకానిక్ స్కై స్క్రాపర్, పెట్రోనాస్ ట్విన్ టవర్స్, పిరమిడ్ మాల్, కన్వెన్షన్ సెంటర్ వంటి వాటిని పరిశీలించనున్నారు.
అనంతరం, మధ్యాహ్నం మలేషియా పరిపాలనా రాజధాని అయిన పుత్రజయ నిర్మాణ విధానంపై ప్రత్యేకంగా అధ్యయనం చేయనున్నారు. పుత్రజయలో ఉన్న ప్రభుత్వ పాలన భవనాలు, మౌలిక వసతులు, మరియు టెక్నాలజీ పార్కుల నిర్మాణంపై మంత్రి నారాయణ సమాచారం సేకరించనున్నారు. ఈ పర్యటన ద్వారా అమరావతి నిర్మాణానికి అవసరమైన మెరుగైన పద్ధతులను తెలుసుకునే అవకాశం ఉంది.