ఎయిర్‌పోర్ట్ లౌంజ్ అనేది చాలామందికి లగ్జరీ అనిపిస్తుంది – అక్కడ ఉచితంగా ఫుడ్, డ్రింక్స్, AC, Wi-Fi, ఛార్జింగ్ పాయింట్స్ వంటి సౌకర్యాలు ఉంటాయి. కానీ ప్రయాణికులు నిజంగా డబ్బు చెల్లించకుండా ఎలా ఉపయోగిస్తున్నారు అనే ప్రశ్న చాలా మందిలో ఉంటుంది. ఈ విషయంలో డేటా అనలిస్ట్ సూరజ్ కుమార్ తల్రేజా ఇచ్చిన వివరణ చాలా ఆసక్తికరంగా ఉంది. ఆయన చెప్పినట్టు, మనం లౌంజ్‌కి ప్రవేశించేటప్పుడు క్రెడిట్ లేదా డెబిట్ కార్డు స్వైప్ చేస్తే, మనకు అది ఉచితంగా అనిపించినా, వాస్తవానికి బ్యాంకులే లేదా కార్డ్ నెట్‌వర్క్‌లు (వీసా, మాస్టర్‌కార్డ్, రూపే) లౌంజ్ యాజమాన్యానికి డబ్బు చెల్లిస్తున్నాయి.
ఇది బ్యాంకుల లాయల్టీ, కస్టమర్ అక్విజిషన్ వ్యూహంలో భాగం. ఇండియాలో ఒక లౌంజ్ సందర్శనకు బ్యాంకులు సాధారణంగా రూ.600 నుండి రూ.1200 వరకు చెల్లిస్తాయి. ఇంటర్నేషనల్ లౌంజ్‌లలో అయితే ఇది 25–35 డాలర్ల (రూ.2,180 - రూ.3,050) వరకు ఉంటుంది. లౌంజ్ యాజమానులు ఎక్కువ మంది కార్డ్ హోల్డర్లను ఆకర్షించడమే కాకుండా, ఫుడ్ సర్వీస్‌ల కోసం తక్కువ ఖర్చుతో క్యాటరింగ్ భాగస్వామ్యాలు చేసుకుని లాభాలు పొందుతారు. కొంతమంది ప్రయాణికులకు డే పాస్‌లు అమ్మడం ద్వారా కూడా కొంత ఆదాయం వస్తుంది.
ప్రయాణ సమయంలో బహిరంగ ఫుడ్ కోర్ట్‌లో ఖర్చు చేసే బదులు, లౌంజ్ ఉపయోగించడం ద్వారా మనకు రూ.500–రూ.1000 వరకు సేవింగ్ అవుతుంది. పైగా Wi-Fi, క్లిన్ టాయిలెట్లు, స్పేస్ ఫర్ వర్క్, బెడ్‌లు, షవర్‌లు వంటి అదనపు సౌకర్యాలు కూడా అందుబాటులో ఉంటాయి. అందుకే చాలామంది ప్రయాణికులు ముందుగానే ఎయిర్‌పోర్ట్‌కి వెళ్లి లౌంజ్‌లో టైం గడపడం ఇష్టపడుతున్నారు.