ఏపీ విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ తన కుమారుడు నారా దేవాంశ్ చదువుతున్న పాఠశాలకు వెళ్లారు. అక్కడ జరిగిన పేరెంట్-టీచర్ మీటింగ్ (PTM)లో పాల్గొన్నారు. తన సతీమణి నారా బ్రాహ్మణితో కలిసి వెళ్లిన ఫొటోను ఆయన తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో పంచుకున్నారు.
తన అధికారిక విధులకు స్వల్ప విరామం ఇచ్చి మరీ ఈ సమావేశానికి హాజరయ్యారు. ఒక తండ్రిగా తన బాధ్యతను నెరవేర్చడంతో పాటు, పిల్లల విద్యలో తల్లిదండ్రుల భాగస్వామ్యం ఎంత ముఖ్యమో ఈ సందర్భంగా ఆయన చాటిచెప్పారు.
"ప్రజా జీవితంలో చాలా బిజీగా ఉన్నప్పుడు, ఇలాంటి మధుర క్షణాలు చాలా ప్రత్యేకమైనవి. దేవాంశ్, నువ్వు చెప్పే కబుర్లు తండ్రిగా నాకు చాలా సంతోషాన్నిస్తాయి. నిన్ను చూసి నేను గర్వపడుతున్నాను" అని లోకేశ్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ నెటిజన్లను ఆకట్టుకుంది. పీటీఎంకు హాజరైన లోకేశ్‌పై చాలామంది ప్రశంసలు కురిపించారు.