Bp Control: బీపీ కంట్రోల్‌కి బెస్ట్ వెజిటబుల్స్ ఇవే! మన రోజువారీ మెనూలో తప్పనిసరి..

వారణాసిలో జరిగిన కార్యక్రమంలో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి నిధులను విడుదల చేసిన అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగించారు. తన ప్రసంగంలో ఆయన ఇటీవల జరిగిన కొన్ని ఘటనలను ప్రస్తావించారు. 'ఆపరేషన్ సిందూర్' తర్వాత తాను మొదటిసారి కాశీకి వచ్చానని చెప్పారు. 

Chandrababu Tour: ప్రకాశం జిల్లా వీరాయపాలెంలో చంద్రబాబు పర్యటన! అన్నదాత సుఖీభవ, రూ.2,342 కోట్లు విడుదల!

పహల్గాంలో ఉగ్రవాదులు 26 మంది అమాయకులను కిరాతకంగా చంపేశారని, ఆ దాడిలో మహిళలు తమ సిందూరం కోల్పోయారని, వారి ఆక్రందనలు తనను కలచివేశాయని అన్నారు. ఆపరేషన్ సిందూర్‌తో పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకున్నామని, ఇది మన సైన్యం పరాక్రమానికి ప్రతీక అని మోదీ పేర్కొన్నారు.

Airport Lounges: ఎయిర్‌పోర్ట్ లౌంజ్‌లో ఉచిత సౌకర్యాలు! కానీ... అసలు ఖర్చు ఎవరిదో తెలుసా!

రైతులకు లబ్ధి చేకూరుస్తున్న ప్రభుత్వం.. అనంతరం, రైతు సంక్షేమం గురించి ప్రసంగిస్తూ, కాంగ్రెస్ మరియు సమాజ్‌వాదీ పార్టీ నేతలు అసత్యాలతో ప్రజలను పక్కదారి పట్టించాలని చూస్తున్నారని ఆరోపించారు. తమ ప్రభుత్వ పథకాలతో రైతులకు అత్యంత ప్రయోజనం చేకూరుస్తున్నామని, రైతుల కోసం రూ.21 వేల కోట్లు నిధులు విడుదల చేశామని చెప్పారు. 

Malaysia Tour: మలేషియా బాటలో అమరావతి.. పుత్రజయ మోడల్‌పై మంత్రి ప్రత్యేక దృష్టి!

రైతులను ఆదుకునేందుకు తమ ప్రభుత్వం అనేక పథకాలు తీసుకొచ్చిందని, రైతుల సంక్షేమం కోసం అహర్నిశలు పనిచేస్తున్నామని స్పష్టం చేశారు. గత ప్రభుత్వాలు రైతులకు ఎన్నో హామీలు ఇచ్చి ఒక్కటీ అమలు చేయలేదని, కానీ తాము ఇచ్చిన హామీల కంటే ఎక్కువే ఇస్తున్నామని అన్నారు. తమ ప్రభుత్వ దృఢ సంకల్పానికి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకమే నిదర్శనమని చెప్పారు.

Donald Trump: రష్యా వార్నింగ్.. భయంతో ట్రంప్ ఏం చేశాడంటే!

దుష్ప్రచారాలను నమ్మవద్దు.. సమాజ్‌వాదీ పార్టీ, కాంగ్రెస్ నేతలు చేసే అసత్య ప్రచారాలను నమ్మవద్దని మోదీ ప్రజలను కోరారు. ఎన్డీయే ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమాన్ని చూసి ఓర్వలేకే వారు దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. 

BSNL Plan: నెవ్వర్ బిఫోర్.. ఎవ్వర్ ఆఫ్టర్! బీఎస్‌ఎన్‌ఎల్‌ బంపర్ ఆఫర్.. కేవలం రూ.1 కే బోలెడన్ని బెనిఫిట్స్.. అస్సలు మిస్ చేసుకోకండి!

ఇప్పటి వరకు ఆపకుండా రైతుల ఖాతాల్లో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి డబ్బులు జమచేస్తున్నామని, ఈ పథకం కింద ఇప్పటి వరకు రైతుల ఖాతాల్లో రూ.3.75 లక్షల కోట్లు జమ చేశామని తెలిపారు. ఒక్క కాశీలోని రైతుల ఖాతాలకే రూ.900 కోట్లు నిధులు విడుదల చేశామని ప్రధానమంత్రి మోదీ వివరించారు.

RTC: ఉచిత బ‌స్సు పథకం పేరు వైర‌ల్.. బస్ టైమింగ్స్, ఏ బస్సులు ఫ్రీ అంటే.! ఆ కార్డు ఉండాల్సిందే.!

19వ విడత డబ్బు ఖాతాలో జమయ్యిందా? తెలుసుకోండిలా..
ముందుగా పీఎం కిసాన్ అధికారిక వెబ్సైట్ https://pmkisan gov.in/ కి వెళ్లాలి.
కుడి వైపున కనిపిస్తున్న ఆప్షన్లలో బెనిఫిషియరీ స్టేటస్ ఆప్షన్ ఉంటుంది.
సెలక్ట్ చేసుకున్న తర్వాత ఖాతా నెంబరును ఎంటర్ చేస్తే ఓటీపీ వస్తుంది. దాన్ని ఎంటర్ చేసిన తర్వాత 'గెట్ డేటా' పై క్లిక్ చేయాలి.
స్టేటస్ స్క్రీన్పై కనిపిస్తుంది. ఒకవేళ మీరు పీఎం కిసాన్కు రిజిస్టర్ చేసుకొని, ఈ-కేవైసీ పూర్తిచేసి ఉంటే ఖాతాలోకి డబ్బు జమవుతుంది.

Annadatha sukhibhava: అన్నదాత సుఖీభవ పథకం.. స్టేటస్‌ ఇలా చెక్ చేస్కోండి! ఒకవేళ డబ్బులు రాకపోతే ఇలా చేయండి!

అలాగే లబ్ధిదారుల జాబితాలో పేరు ఉందో.. లేదో.. కూడా చెక్ చేసుకోవచ్చు.
బెనిఫిషియరీ స్టేటస్ కింద బెనిఫిషియరీ లిస్ట్ ఆప్షన్ కనిపిస్తుంది.
ఈ ఆప్షన్పై క్లిక్ చేస్తే మరొక పేజీకి రీడైరెక్ట్ అవుతుంది.
ఇక్కడ లబ్ధిదారుడి రాష్ట్రం, జిల్లా, ఉప జిల్లా, బ్లాక్, గ్రామాలను ఎంచుకొని 'గెట్ రిపోర్ట్'పై క్లిక్ చేస్తే లబ్ధిదారుల జాబితా కనిపిస్తుంది.
పీఎం కిసాన్ హెల్ప్ లైన్ నెంబరు 155261 / 011-24300606 కు కాల్ చేసి కూడా సమాచారం తెలుసుకోవచ్చు.

USA Shooting: మరోసారి కాల్పులతో దద్దరిల్లిన అమెరికా.! ప్రజల్లో భయాందోళనలు - నలుగురు దుర్మరణం!
NH projects: నేడు రాష్ట్రానికి గడ్కరీ... 2 NHలు జాతికి అంకితం!