Header Banner

విద్యార్థులకు అదిరిపోయే న్యూస్! బస్ పాస్ లు ఉచితం! ఎవరెవరికంటే?

  Fri Jun 13, 2025 15:58        Politics

ఆంధ్రప్రదేశ్‌ ఆర్టీసీ 10వ తరగతి వరకు చదివే విద్యార్థులకు ఉచిత బస్ పాస్ సౌకర్యాన్ని కల్పిస్తోంది. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కావడంతో అధికారులు బస్ పాస్‌ల జారీ, పునర్నూతనం (రెన్యువల్‌) ప్రక్రియను ప్రారంభించారు. ఈ నెల 14వ తేదీ నుంచి విద్యార్థులు తమకు సమీపంలోని ఆర్టీసీ బస్టాండ్లలో ఉన్న బస్ పాస్ కౌంటర్లలో దరఖాస్తు చేసుకోవచ్చు. పాత పాస్ ఉన్నవారు రెన్యువల్ కోసం పాత పాస్‌ను సమర్పిస్తే, కొత్త పాస్ జారీ చేయబడుతుంది. బస్ పాస్ పొందేందుకు విద్యార్థులు పాఠశాల ప్రిన్సిపాల్ సంతకం మరియు ముద్రతో కూడిన అప్లికేషన్ ఫారం, ఆధార్ కార్డు జిరాక్స్ మరియు ఒక ఫోటో సమర్పించాలి. 12 సంవత్సరాలలోపు బాలురు, 18 సంవత్సరాల లోపు 10వ తరగతి చదివే బాలికలు ఉచితంగా బస్సు ప్రయాణం చేసేందుకు అర్హులు.

 

ఇది కూడా చదవండి:  మరో రైల్వే లైన్ కు గ్రీన్ సిగ్నల్! 3 గంటల్లో సికింద్రాబాద్! రూట్ ఇదే...!

 

ఇంకా ఇంటర్మీడియట్, డిగ్రీ వంటి ఉన్నత చదువులు చేసే విద్యార్థులకు ఒక నెల, మూడు నెలలు లేదా సంవత్సరానికి వర్తించే బస్ పాస్‌లు చెల్లుబాటు అయ్యే విధంగా అందుబాటులో ఉన్నాయి. వీటిని రాయితీ ధరలకు పొందవచ్చు. విద్యార్థులు తమ సొంత మొబైల్ ద్వారా కూడా APSRTC వెబ్‌సైట్ (apsrtcpass.in) ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రత్యేకంగా, విద్యార్థి ఏ డిపో పరిధిలో ఉన్నారో, అక్కడికే దరఖాస్తు చేయాలని అధికారులు సూచించారు. 20 కిలోమీటర్ల పరిధిలో ఉన్న పాఠశాలలకు “పల్లె వెలుగు” బస్సుల్లో విద్యార్థులు ఉచితంగా ప్రయాణించవచ్చు. ఇది విద్యార్థులకు మరింత సౌకర్యంగా మారుతోంది.

 

ఇది కూడా చదవండి: బుల్లెట్ ట్రైన్ వచ్చేస్తుందోచ్! ఆ ఒక్క జిల్లాలోనే 41 గ్రామాల్లో.. హాల్ట్ స్టేషన్లు ఇవే!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు

 

 తల్లికి వందనం లిస్ట్ లో మీ పేరు రాలేదా? వెంటనే ఈ పని చేయండి! ఆఖరి తేదీ..

 

మృతుల కుటుంబానికి ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన టాటా గ్రూప్! ఒక్కొక్కరికి...

 

వాకింగ్ ఎంత సేపు చేయాలి! అతిగా నడిస్తే ఏం జరుగుతుంది?

 

10 నిమిషాల ఆలస్యమే తన ప్రాణాలు కాపాడింది! లక్ అంటే ఇదే మరి!

 

అహ్మదాబాద్ విమాన ప్రమాదం! ప్రయాణికులే కాదు... చదువుకుంటున్న డాక్టర్లు కూడా.. తెలుగు వారు?

 

 ఆ ప్రాంతం ప్రజలకు శుభవార్త! రూ.550 కోట్లతో అధునాతన క్యాన్సర్ ఆస్పత్రి!

 

టాటా నానో రీఎంట్రీ! ఫీచర్లు చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

 

వైసీపీకి దిమ్మదిరిగే షాక్! సాక్షి ఛానల్ పై కేసు నమోదు!

 

లోకేష్ కి ప్రమోషన్ ఎప్పుడు! చంద్రబాబు ఏమన్నారంటే?

 

దుబాయ్ ప్రభుత్వం రిక్రూట్మెంట్ డ్రైవ్! నెలకు సుమారు రూ.10 లక్షలు! వెంటనే అప్లై చేసుకోండి!

 

తల్లికి వందనం నిధులు విడుదల! ఇలా దరఖాస్తు చేసుకోండి.. లేకపోతే అంతే!

 

 బ్రేకింగ్ న్యూస్! మూతపడనున్న దుబాయ్ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్! ఎందుకంటే?

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #APRTC #StudentBusPass #FreeBusPass #APStudents #RTCBusPass #APRTCUpdates #StudentWelfare #BusPassRenewal #APEducationSupport #PublicTransportAP #APSRTCOnline #BusPassAlert #StudentsTravelFree #FreeTransportForStudents #RTCScheme