దేశంలో అత్యంత వేగంగా ప్రయాణించే చెన్నై-మైసూరు బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు చిత్తూరు జిల్లా గుండా దూసుకెళ్లనున్న విషయం జిల్లా ప్రజలకు గర్వకారణంగా మారింది. ఈ హైస్పీడ్ రూట్‌కి జిల్లాలో ప్రత్యేక స్థానం లభించనుండగా, పలమనేరు, బంగారుపాళెం, చిత్తూరు నియోజకవర్గాల మీదుగా మొత్తం 77 కి.మీ మేర ఈ మార్గం సాగనుంది. మైసూరు నుండి చెన్నై వరకు 463 కి.మీ దూరం ఉన్న ఈ మార్గానికి సంబంధించి ఫీల్డ్ వర్క్, సోషియల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ (SIA), రీ సెటిల్మెంట్ యాక్షన్ ప్లాన్ (RAP) పనులను త్వరితగతిన పూర్తిచేయాలని నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (NHSRCL) జీఎం నిషాంత్ సింఘాల్ సూచనలు పంపినట్టు సమాచారం.
ఇది కూడా చదవండి: మరో రైల్వే లైన్ కు గ్రీన్ సిగ్నల్! 3 గంటల్లో సికింద్రాబాద్! రూట్ ఇదే...!
ఈ ప్రాజెక్టులో జిల్లాలోని 41 గ్రామాలు భాగమవుతున్నాయి. కర్ణాటక సరిహద్దు నుంచి బైరెడ్డిపల్లి మండలంలోని కంభంపల్లి మొదలుకొని, ఆలపల్లి, జీసీపల్లి, లక్కనపల్లి, శెట్టిపల్లి, బెలుపల్లి, అంకింవారిపల్లి, అయ్యంరెడ్డిపల్లి, గుండ్లపల్లి, కొలమాసనపల్లి, మొరం, జల్లిపేట, కూర్మాయి, పలమనేరు, సముద్రపల్లి, పెంగరగుంట, మొగిలి, టేకుమంద, గొల్లపల్లి, రాగిమానుపెంట, బోడబండ్ల, బుడితిరెడ్డిపల్లి, యాదమరి, పెరియంబాడి, మాధవరం, కొత్తపల్లి, వసంతాపురం, బసవపల్లి, కుప్పిగానిపల్లి, రాగిమానుపట్టెడ వంటి గ్రామాల మీదుగా ఈ మార్గం తమిళనాడులోకి ప్రవేశించనుంది. ఇది జిల్లాకు సమగ్ర అభివృద్ధికి మార్గం సుగమం చేయనుంది.
ఈ గ్రామాల్లో 876 మంది రైతుల భూములను సేకరించనున్నారు. జిల్లాలో ఒక్కటే.. మైసూరు నుంచి చెన్నై దాకా మొత్తం తొమ్మిది చోట్ల స్టాపింగ్ లు ఉన్నాయి. ఇందులో కర్ణాటక రాష్ట్రంలో 5, తమిళనాడులో 3 చోట్ల బుల్లెట్ ట్రైన్ ఆగుతుంది. చిత్తూరు జిల్లాలో మాత్రం 190- రామాపురం వద్ద మాత్రమే చిత్తూరు జిల్లా స్టాపింగ్ పెట్టారు.
ఇది కూడా చదవండి: ఏపీలో కొత్తగా నాలుగు లైన్ల నేషనల్ హైవే! రూ.4,609 కోట్లతో, ఈ రూట్‌లోనే..
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
మంగళగిరి మీదుగా మరో రైల్వే లైన్! రూ.2,000 కోట్లతో.. రూట్ మ్యాప్ ఇదే!
ఏపీ ప్రజలకు శుభవార్త! ఆసియాలోనే తొలిసారిగా మన విశాఖలోనే.. భారీ ప్రాజెక్టు!
రేషన్ వ్యవస్థలో కీలక మార్పులు! ఇక నుంచి ఇలా!
ఏపీలో డ్వాక్రా మహిళలకు గుడ్‌న్యూస్.. 48 గంటల్లోనే.. ఒక్కొక్కరికి రూ.50వేల నుంచి రూ.లక్ష ఇస్తారు!
Tirumala Update: సెప్టెంబరు కోటా తిరుమల శ్రీవారి సేవల టికెట్ల విడుదల.. తేదీలు ఇవే!
Chandrababu warning Jagan: పులివెందుల రాజకీయం చేస్తే.. తోక కట్ చేస్తా! ఎవరు తప్పు చేసినా..
కేవలం రూ.16కే లావా స్మార్ట్ వాచ్! ఆఫర్ ఎప్పటివరకంటే?
ఇంకో 6 రోజుల్లో రైతుల అకౌంట్లలోకి డబ్బులు! లిస్టులో మీ పేరు వస్తుందో లేదో చెక్ చేసుకోండిలా!
తీవ్ర విషాదం! నదిలో కుప్పకూలిన వంతెన 25 మంది టూరిస్టులు గల్లంతు!
ఏపీలో డ్వాక్రా మహిళలకు గుడ్‌న్యూస్.. 48 గంటల్లోనే.. ఒక్కొక్కరికి రూ.50వేల నుంచి రూ.లక్ష ఇస్తారు!
ఏపీలో 18ఏళ్లు దాటిన ప్రతీ మహిళ అకౌంట్లో రూ.18వేలు! అర్హులు, అర్హతల వివరాలు ఇవే!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: