కుప్పం గంగమ్మ టెంపుల్ పాలకమండలి కమిటీని సీఎం చంద్రబాబు నియమించారు. చైర్మన్‌తో కలిపి 11 మందితో కమిటీని ఏర్పాటు చేశారు. బీఎంకే రవిచంద్ర బాబు చైర్మన్‌గా, మరో 10 మందిని సభ్యులుగా నియమించారు. టీడీపీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో రెండేళ్ల పాటు కుప్పంలో రవిచంద్ర అన్నా క్యాంటీన్‌ను నిర్వహించారు. గత జగన్ ప్రభుత్వ దాష్టీకాలను ఎదిరించి అన్నా క్యాంటీన్‌ను రవిచంద్ర నిర్వహించారు.
చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో ముఖ్యమైన టెంపుల్ కావడంతో స్వయంగా కమిటీని ఎంపిక చేశారు. గత వైసీపీ ప్రభుత్వం గంగమ్మ టెంపుల్ కమిటీ పదవులనూ వివాదంలోకి నెట్టింది. దేవాలయం పవిత్రత, ప్రతిష్టత పెంచేలా కమిటీ ఉండాలని సీఎం చంద్రబాబు ఆలోచన చేశారు. దీనిలో భాగంగా స్వయంగా కమిటీని ఎంపిక చేశారు. ఒకటి రెండు రోజుల్లో అధికారికంగా ఉత్తర్వులు వెలువడనున్నాయి. కొత్త కమిటీలో పదిమంది సభ్యుల్లో సామాజిక సమతుల్యతకు సీఎం చంద్రబాబు ప్రాధాన్యం ఇచ్చారు. సభ్యులుగా శారదమ్మ, నరేష్, సింధూ రాజకుమార్, మంజుల మణి, సంతోషమ్మ జయరామ నాయుడు, ఎస్ .మహేష్ ,ఎన్. వినాయకన్, వీణల శరవణన, వి ఏ.లక్ష్మి, జ్యోతిష్‌లను నియమించారు.
ఇది కూడా చదవండి: ప్రధాని మోదీ, పవన్ కల్యాణ్, నేను కోరుకుంది ఇదే.. చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
అయ్య బాబోయ్.. చికెన్, మటన్ తినే వారికి బిగ్ షాక్.. తింటే ఇక అంతే - ఏంటని అనుకుంటున్నారా..
ప్రజలకు మరో శుభవార్త.. ఈ ప్రాంతాల్లో భారీగా రోడ్ల విస్తరణ - ఇక దూసుకెళ్లిపోవచ్చు!
ప్రజలకు అప్డేట్.. బైక్ ఉన్నవారు ఇలా చేయాల్సిందే.! కేంద్రం కీలక నిర్ణయం!
కేంద్ర మంత్రి నిర్మలతో భేటీ.. ఏపీ అభివృద్ధికి సరికొత్త ప్రణాళికలు! రూ.259 కోట్ల అదనపు నిధులు..
నేడు చెన్నైకి సీఎం చంద్రబాబు! మద్రాస్ ఐఐటీలో జరిగే..
మహిళలకు గుడ్ న్యూస్! ఉచితంగా పొందే అవకాశం మిస్ అవొద్దు.. వెంటనే అప్లై చేయండి!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: