కృష్ణా జిల్లా గుడివాడకు చెందిన అట్లూరి మౌనిక బహుముఖ ప్రజ్ఞతో అమెరికాలోనూ రాణిస్తున్నారు. ఇటీవల డాలస్‌లో జరిగిన మిస్ అండ్ మిసెస్ తెలుగు యూఎస్‌ఏ అందాల పోటీల్లో ఆమె ద్వితీయ స్థానాన్ని కైవసం చేసుకుని తెలుగువారి ఖ్యాతిని ఇనుమడింపజేశారు. కేవలం అందంలోనే కాకుండా, సేవా కార్యక్రమాల్లోనూ మౌనిక తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు.
గుడివాడకు చెందిన అట్లూరి కృష్ణప్రసాద్, శైలజ దంపతుల కుమార్తె మౌనిక. బెంగళూరులో సివిల్ ఇంజినీరింగ్ పూర్తిచేసిన ఆమె 2013లో ఏపీపీఎస్సీ ద్వారా ప్రభుత్వ ఉద్యోగం సాధించారు. వరంగల్‌లో ఇరిగేషన్ ఏఈగా, ఆ తర్వాత ఆపరేషన్ భగీరథలో ఇంజినీర్‌గా సమర్థవంతంగా విధులు నిర్వర్తించారు. 2014లో చెన్నైకు చెందిన పరుచూరి జితేంద్ర కుమార్‌తో ఆమె వివాహం జరిగింది.
ఇది కూడా చదవండి: టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలుకు కీలక బాధ్యతలు అప్పగించిన కేంద్రం! ఎన్డీఏ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ..!
వివాహానంతరం 2017లో భర్తతో కలిసి అమెరికా వెళ్లిన మౌనిక అక్కడితో ఆగిపోలేదు. తన ప్రతిభతో ప్రఖ్యాత సేల్స్‌ఫోర్స్ కంపెనీలో ఉన్నత స్థాయి ఉద్యోగం సంపాదించారు. వృత్తి జీవితంలో రాణిస్తూనే తనలోని ఇతర నైపుణ్యాలకు కూడా పదునుపెట్టారు. దీనికి నిదర్శనమే మే 26న డాలస్‌లోని ఇర్వింగ్ ఆర్ట్ సెంటర్‌లో జరిగిన మిస్ అండ్ మిసెస్ తెలుగు యూఎస్‌ఏ పోటీల్లో ఆమె విజయం. వేలాది మంది పోటీపడగా తుది జాబితాలోని 25 మందిలో ఒకరిగా నిలిచి, చివరికి ద్వితీయ స్థానాన్ని సొంతం చేసుకున్నారు.
మౌనిక కేవలం వృత్తి, వ్యక్తిగత విజయాలకే పరిమితం కాలేదు. ఆమెలో సేవా దృక్పథం కూడా ఎక్కువే. అమెరికాలో ఉన్నప్పటికీ నూజివీడులోని స్నేహ రైడ్స్ సంస్థ నిర్వహిస్తున్న అనాథ పిల్లల ఆశ్రమానికి తనవంతు ఆర్థిక సహాయం అందిస్తూ మానవత్వాన్ని చాటుకుంటున్నారు. మౌనిక విజయం పట్ల గుడివాడలోని ఆమె తల్లిదండ్రులు కృష్ణప్రసాద్, శైలజ ఆనందం వ్యక్తం చేశారు. "మహిళలు దేనిలోనూ తక్కువ కాదని మౌనిక నిరూపించింది. తన ఆత్మవిశ్వాసమే ఈ విజయానికి కారణం" అని వారు సంతోషంగా తెలిపారు. పట్టుదల, ఆత్మవిశ్వాసం ఉంటే మహిళలు ఏ రంగంలోనైనా రాణించగలరనడానికి మౌనిక నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నారు.
ఇది కూడా చదవండి: మెగా డీఎస్సీ పరీక్షల షెడ్యూల్‌లో ఈ మార్పులు గమనించారా..? వారికి నో ఛాన్స్..!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
రేషన్ కార్డు దారులకు అలర్ట్! రేషన్ కొత్త టైమింగ్స్, తేదీలు ఇవే..!
ఏపీ ప్రభుత్వం మరో అలర్ట్..! వీళ్లు ఇళ్లలో నుంచి అస్సలు రావొద్దు..!
ఏపీలో మళ్లీ మొదలైన రేషన్ షాపులు! క్యూ కట్టిన జనం!
ఏపీ ప్రజలకు ప్రభుత్వం బంపరాఫర్..! ఆ ప్లాట్లు వేలంలో దక్కించుకునే మంచి ఛాన్స్!
రేషన్ వద్దనుకుంటే డీబీటీ పద్ధతిలో డబ్బులు! సీఎం చంద్రబాబు!
ఏపీలో టీచర్ ఉద్యోగాలకు తీవ్ర పోటీ! ఒక్కో పోస్టుకు సగటున 35 మంది!
ఏపీలో వారందరికీ గుడ్‌న్యూస్..! ఒక్కొక్కరికీ రూ.15 వేలు అకౌంట్లలోకి డబ్బులు!
పేదలకు శుభవార్త..! ఫించన్ల పెంపుపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు!
తల్లులు, విద్యార్థులకు భారీ శుభవార్త..! ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం!
ఈ 100 రూపాయలు మీ దగ్గర ఉన్నాయా..! అరెస్ట్ అవుతారు జాగ్రత్త!
ఇంజినీరింగ్ విద్యార్థులకు గోల్డెన్ ఛాన్స్..! BEL నోటిఫికేషన్ రిలీజ్!
ఏపీలో 10 అద్భుతమైన బీచ్‌లు.. ఈ హిడన్ జెమ్స్ లాంటి బీచ్‌లను మిస్ అవ్వకండి..
ఏపీలో కొత్తగా ఐకానిక్ కేబుల్ బ్రిడ్జ్.. నేషనల్ హైవేకు కనెక్ట్! ఈ రూట్‌లోనే, డీపీఆర్ పనులు..!
వైసీపీకి దిమ్మ తిరిగే షాక్! టీడీపీ కార్యకర్తపై దాడి కేసులో కీలక నిందితుడు అరెస్ట్!
రూ.500 కోట్ల కుంభకోణంలో కిరణ్ అరెస్ట్! దర్యాప్తులో వారి వివరాలు వెల్లడి!
కవిత కు కేసీఆర్ మార్క్ ట్రీట్మెంట్..! హరీష్ కు కీలక బాధ్యతలు..!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: