ఆంధ్రప్రదేశ్‌లో రేషన్ దుకాణాల నిత్యావసరాల పంపిణీ మొదలైంది. జూన్ ఒకటో తేదీ నుంచి రేషన్ షాపుల ద్వారా రేషన్ సరుకులు పంపిణీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ నిర్ణయం మేరకు ఆదివారం (జూన్ 1) నుంచి రేషన్ దుకాణాల ద్వారా రేషన్ సరుకుల పంపిణీ మొదలైంది. రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమంలో పాల్గొని రేషన్ కార్డుదారులకు రేషన్ పంపిణీ చేశారు. ఈ క్రమంలోనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గం పిఠాపురంలో రేషన్ సరుకుల పంపిణీ కార్యక్రమంలో ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. రేషన్ షాపు ద్వారా సరుకుల పంపిణీని నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు.
అనంతరం మాట్లాడిన మంత్రి నాదెండ్ల మనోహర్.. రేషన్ కార్డుదారులకు శుభవార్త వినిపించారు. రేషన్ కార్డుదారులు రాష్ట్రంలో ఎక్కడినుంచైనా రేషన్ సరుకులు తీసుకోవచ్చని వెల్లడించారు. రేషన్ దుకాణాల మూలంగా ప్రజా పంపిణీ పారదర్శకంగా సాగుతుందని తెలిపారు. రాష్ట్రంలోని 29,761 రేషన్ షాపుల ద్వారా 1.46 కోట్ల కుటుంబాలకు రేషన్ సరుకులను పంపిణీ చేస్తున్నట్లు నాదెండ్ల మనోహర్ వివరించారు. దివ్యాంగులు, 65 ఏళ్లు పైబడిన వృద్ధులకి రేషన్ డీలర్లు.. రేషన్ సరుకులు ఇళ్ల వద్దకే తీసుకువచ్చి అందిస్తారని వెల్లడించారు. రేషన్ డీలర్లు తమ పరిధిలోని వృద్ధులు, దివ్యాంగుల కోసం ప్రత్యేకమైన వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయాలని.. నేరుగా వాళ్ల ఇళ్లకు వెళ్లి సరుకులు ఇవ్వాలని సూచించారు. ఆ ఫొటోలను వాట్సాప్ గ్రూప్‌లో పోస్ట్ చేయాలని మంత్రి నాదెండ్ల మనోహర్ సూచించారు.
ఇది కూడా చదవండి: టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలుకు కీలక బాధ్యతలు అప్పగించిన కేంద్రం! ఎన్డీఏ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ..!
రాబోయే రోజుల్లో రేషన్ దుకాణాలను మరింత అభివృద్ధి చేస్తామని.. రేషన్ దుకాణాల వద్ద సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేస్తామని నాదెండ్ల మనోహర్ వివరించారు. రేషన్ షాపుల వద్ద వినియోగదారులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని.. క్యూఆర్ కోడ్‌లను సైతం రేషన్ షాపుల వద్ద ఏర్పాటు చేశామని అన్నారు. రాష్ట్రంలోని అన్ని రేషన్ దుకాణాల వద్ద క్యూఆర్ కోడ్ పెట్టామని.. రేషన్ కార్డుదారులు తమకు ఏమైనా ఫిర్యాదులు ఉంటే.. ఆ కోడ్‌ను స్కాన్ చేసి ఫిర్యాదు చేయవచ్చన్నారు. సరైన సమయానికి రేషన్ దుకాణం తెరవకపోయినా.. నిత్యావసర సరుకుల నాణ్యత, తూకంలో ఎలాంటి తేడాలు ఉన్నా ఫిర్యాదు చేయాలని సూచించారు. ప్రజల ఫిర్యాదులను పరిశీలించి తప్పు ఉందని తేలితే డీలర్లపై చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
మరోవైపు ప్రతి నెలా ఒకటో తేదీ నుంచి 15వ తేదీ వరకూ రేషన్ షాపుల వద్ద సరుకులు పంపిణీ చేస్తారు. రేషన్ దుకాణాలు ఉదయం 8 గంటల నుంచి 12 గంటల వరకూ, అలాగే సాయంత్రం 4 నుంచి 8 గంటల వరకూ పనిచేస్తాయి. ఈ 15 రోజులలో ఆదివారం కూడా రేషన్ దుకాణాలు తెరిచే ఉంటాయి. రేషన్ కార్డుదారులు తమకు వీలైన సమయంలో ఈ 15 రోజుల్లో రేషన్ తీసుకునే వెసులుబాటు ఉంది. అలాగే రేషన్ కార్డుదారులు.. తమ రేషన్ కార్డు ఎక్కడ ఉంటే అక్కడికే వెళ్లి రేషన్ సరుకులు తీసుకోవాల్సిన అవసరం లేదు. సమీపంలోని రేషన్ షాపుల్లోనే వారికి రేషన్ సరుకులు అందిస్తారు.
ఇది కూడా చదవండి: మెగా డీఎస్సీ పరీక్షల షెడ్యూల్‌లో ఈ మార్పులు గమనించారా..? వారికి నో ఛాన్స్..!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
రేషన్ కార్డు దారులకు అలర్ట్! రేషన్ కొత్త టైమింగ్స్, తేదీలు ఇవే..!
ఏపీ ప్రభుత్వం మరో అలర్ట్..! వీళ్లు ఇళ్లలో నుంచి అస్సలు రావొద్దు..!
ఏపీలో మళ్లీ మొదలైన రేషన్ షాపులు! క్యూ కట్టిన జనం!
ఏపీ ప్రజలకు ప్రభుత్వం బంపరాఫర్..! ఆ ప్లాట్లు వేలంలో దక్కించుకునే మంచి ఛాన్స్!
రేషన్ వద్దనుకుంటే డీబీటీ పద్ధతిలో డబ్బులు! సీఎం చంద్రబాబు!
ఏపీలో టీచర్ ఉద్యోగాలకు తీవ్ర పోటీ! ఒక్కో పోస్టుకు సగటున 35 మంది!
ఏపీలో వారందరికీ గుడ్‌న్యూస్..! ఒక్కొక్కరికీ రూ.15 వేలు అకౌంట్లలోకి డబ్బులు!
పేదలకు శుభవార్త..! ఫించన్ల పెంపుపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు!
తల్లులు, విద్యార్థులకు భారీ శుభవార్త..! ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం!
ఈ 100 రూపాయలు మీ దగ్గర ఉన్నాయా..! అరెస్ట్ అవుతారు జాగ్రత్త!
ఇంజినీరింగ్ విద్యార్థులకు గోల్డెన్ ఛాన్స్..! BEL నోటిఫికేషన్ రిలీజ్!
ఏపీలో 10 అద్భుతమైన బీచ్‌లు.. ఈ హిడన్ జెమ్స్ లాంటి బీచ్‌లను మిస్ అవ్వకండి..
ఏపీలో కొత్తగా ఐకానిక్ కేబుల్ బ్రిడ్జ్.. నేషనల్ హైవేకు కనెక్ట్! ఈ రూట్‌లోనే, డీపీఆర్ పనులు..!
వైసీపీకి దిమ్మ తిరిగే షాక్! టీడీపీ కార్యకర్తపై దాడి కేసులో కీలక నిందితుడు అరెస్ట్!
రూ.500 కోట్ల కుంభకోణంలో కిరణ్ అరెస్ట్! దర్యాప్తులో వారి వివరాలు వెల్లడి!
కవిత కు కేసీఆర్ మార్క్ ట్రీట్మెంట్..! హరీష్ కు కీలక బాధ్యతలు..!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: