విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రముఖుల తాకిడి విపరీతంగా పెరుగుతోంది. దీంతో మరో మూడు నెలల్లోనే నూతన ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ భవనాన్ని పూర్తి చేయాలని ఎయిర్ పోర్టు అభివృద్ధి కమిటీ ఛైర్మన్, ఎంపీ వల్లభనేని బాలశౌరి తెలిపారు. అంతేకాకుండా 2028 నాటికి విమానాశ్రయం నుంచి నేరుగా అమెరికాలోని న్యూయార్క్ పట్టణానికి విమాన సేవలను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించుకున్నట్లు వివరించారు. అలాగే ఇతర దేశాలకు చెందిన ఎమిరేట్స్ విమానాలను కూడా ఇక్కడి నుంచి నడిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. 

ఇది కూడా చదవండి: ఏపీలో కొత్తగా ఐకానిక్ కేబుల్ బ్రిడ్జ్.. నేషనల్ హైవేకు కనెక్ట్! ఈ రూట్‌లోనే, డీపీఆర్ పనులు..!

విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం అభివృద్ధి కమిటీ గురువారం రోజు సమావేశం నిర్వహించింది. ఇందులో ఎయిర్ పోర్టు అభివృద్ధి కమిటీ ఛైర్మన్, ఎంపీ వల్లభనేని బాలశౌరి, వైస్ చైర్మన్ ఎంపీ కేశినేని శివనాథ్, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ, ఇంఛార్జీ కలెక్టర్ గీతాంజలి శర్మ, డైరెక్టర్ లక్ష్మీకాంత రెడ్డి, జీఎం రామాచారి, ఎస్పీ గాంగాధర రావు, అధికారులతో కలిసి పాల్గొని.. విమానాశ్రయ అభివృద్ధితో పాటు ప్రయాణికుల సమస్యలపై చర్చించారు. ముఖ్యంగా ప్రతి రాష్ట్రానికి అనుసంధానం అయ్యేలా విమాన సర్వీసులు నడిపేందుకు వివిధ విమానయాన సంస్థలతో సంప్రదించినట్లు చెప్పారు.

ఇది కూడా చదవండి: ఏపీలో మరో గ్రీన్‌ఫీల్డ్ నేషనల్ హైవే.. రూ.1400 కోట్లతో..! ఆ రూట్లోనే, కేంద్రం గ్రీన్ సిగ్నల్!

ఇవి మాత్రమే కాకుండా విజయవాడ నుంచి శ్రీలంక, సింగపూర్, థాయ్ లాండ్, దుబాయ్ లకు ఎమిరేట్స్ విమానాలు అందుబాటులోకి తీసుకురావాలని ప్రయత్నిస్తున్నామన్నారు. అలాగే ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ పనులు 70 శాతం పూర్తి అయ్యాయని మంత్రి బాలశౌరి వివరించారు. అలాగే ప్రతి నెలా ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా సమీక్షిస్తున్నట్లు తెలిపారు. అలాగే విమానాశ్రయంలో తెలుగు సంస్కృతి, సంప్రదాయం ఉట్టిపడేలా టెర్మినల్స్ నిర్మించేందుకు ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. అందులో ప్రాచీన సంస్కృతి, కూచిపూడి భంగిమలు ఉంటాయన్నారు.

ఇది కూడా చదవండి: రేషన్ కార్డు దారులకు అలర్ట్! రేషన్‌ కొత్త టైమింగ్స్‌, తేదీలు ఇవే..!

సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, మంత్రి లోకేశ్ ల ఆదేశాలతోనే.. 12 డిజెన్లను మార్పు చేసేందుకు నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి కేశినేని చిన్నా చెప్పారు. వారణాసి, కొచ్చి, అహ్మదాబాద్ లకు కొత్త సర్వీసులు నడిపేందుకు సమాలోచనలు చేస్తున్నట్లు వివరించారు. ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ పనులు కూటమి ప్రభుత్వం వచ్చాక వేగవంతం అయ్యాయని అన్నారు.

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు

ఏపీ వాసులకు గుడ్ న్యూస్! రేషన్ అందదనే బెంగే అక్కర్లేదు! మంత్రి కొత్త ఆలోచన!

ఖరీఫ్ రైతులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్..! ఆ నిధుల విడుదల..!

ఏపీలో డ్వాక్రా మహిళలకు గుడ్‌న్యూస్.. రూ.2లక్షలకు పైగా..! మంత్రి కీలక ఆదేశాలు!

డీఎస్సీ అభ్యర్థుల విజ్ఞప్తులపై ఏపీ సర్కారు సానుకూల స్పందన...! డీటెయిల్స్ ఇవిగో!


స్కూళ్లకు ఏపీ విద్యాశాఖ కీలక ఆదేశాలు.. ఎన్నడూ లేని విధంగా ఈసారి!


హైదరాబాదులో ఘనంగా ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డుల ప్రదానోత్సవం! తొలిసారిగా త్రివిధ దళాల సైనికాధికారులకు..


ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం! ఉచితంగా రూ.8000.. ఎవరెవరికంటే?



లిక్కర్ కేసులో వేగం పెంచిన సిట్! మొదటి రోజు విచారణలో..



వంశీ ఆస్పత్రి తరలింపుపై సస్పెన్స్ కొనసాగింపు..! హైకోర్టు ఆదేశాల కోసం..!


నిరుద్యోగులకు అలర్ట్..! హైకోర్టులో 245 పోస్టుల భ‌ర్తీకి సర్కార్‌ ఉత్తర్వులు జారీ!

భార‌త్‌లో యాపిల్ మూడో స్టోర్..! ఎక్క‌డో తెలుసా?

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group