నిరుద్యోగులకు మరో గుడ్‌న్యూస్. ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ ఖాళీగా ఉన్న 245 పోస్టుల భర్తీకి ఉత్తర్వులు జారీ అయ్యాయి. వివిధ కేటగిరీల్లో రెగ్యులర్ బేస్‌లో 242, అలాగే కాంట్రాక్ట్ పద్ధతిలో 3 పోస్టులు భర్తీ చేయనున్నారు. ఈ మేరకు న్యాయశాఖ కార్యదర్శి జి.ప్రతిభాదేవి ఉత్తర్వులు జారీ చేశారు. ఇందుకు సంబంధించి త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని హైకోర్టు, ప్రభుత్వ అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు భర్తీకి రంగం సిద్ధం చేశారు.
పోస్టుల పేర్లు, వివరాలు, అర్హత, వయోపరిమితి, జీతం, దరఖాస్తు ప్రక్రియ, ప్రారంభ, చివరి తేదీ, ఫీజు, ఎంపిక ప్రక్రియ వంటి వివరాలను అధికారక నోటిఫికేషన్‌లో పొందుపరుస్తామన్నారు. కాగా ఇప్పటికే 1620 పోస్టుల భర్తీకి రాష్ట్ర హైకోర్టు నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే.
ఇది కూడా చదవండి: రేషన్ కార్డు దారులకు అలర్ట్! రేషన్ కొత్త టైమింగ్స్, తేదీలు ఇవే..!
దరఖాస్తుల సమర్పణ ప్రక్రియ కొనసాగుతోంది. జూన్ 2తో ఆన్‌లైన్ దరఖాస్తు గడువు ముగియనుంది. ఈ క్రమంలో త్వరలోనే మరో నోటిఫికేషన్ కూడా విడుదల చేసేందుకు హైకోర్టు అనుమతి తెలిపింది. అర్హతలు కలిగిన నిరుద్యోగులంతా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అధికారులు తెలిపారు.
మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగ నియామక ప్రకటనలు నెమ్మదిగా ఒకదాని తర్వాత ఒకటిగా వస్తున్నాయి. ఇప్పటికే 16,347 పోస్టులతో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ 2025 విడుదల చేయగా.. త్వరలోనే నియామక రాత పరీక్షలు కూడా నిర్వహించనుంది. అలాగే రాష్ట్రంలోని పలు జిల్లా కోర్టుల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి ప్రస్తుతం ఆన్‌లైన్ దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. త్వరలోనే మరో నోటిఫికేషన్ రానుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అధికారిక వెబ్‌సైట్ లో చెక్ చేసుకోవచ్చు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ఆలస్యంగా ఓటీటీ ట్రాక్ పైకి.. ఫారిన్ కష్టాలు పడితేనే గాని తెలియదు..!
ఏపీ మద్యం కేసులో నలుగురు నిందితులకు కస్టడీ! న్యాయవాది సమక్షంలో..
బెయిల్.. అయినా తప్పదు జైలు అన్నట్టుగా వల్లభనేని వంశీ పరిస్థితి! కీలక ఆదేశాలు జారీ.!
చిక్కుల్లో కమల్ హాసన్.. బెంగళూరులో కేసు నమోదు! ఆయన వ్యాఖ్యలపై కన్నడిగుల ఆగ్రహం..
ఈ సంప్రదాయం కళాకారులకు గొప్ప.. సీఎంకి కృతజ్ఞతలు తెలిపిన చిరంజీవి!
కన్నీటి గాధ! ఉద్యోగాల కోసం వెళ్లి మయన్మార్ లో చిక్కుకున్న భారతీయులకు చిత్రహింసలు!
ఉద్యోగులకు గుడ్ న్యూస్! భారీగా పెరగనున్న జీతాలు! ఎంతంటే?
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: