AP Workers: ఏపీలో వారికి శుభవార్త! మీ అకౌంట్ లో డబ్బులు జమ! చెక్ చేసుకోండి!

ఆంధ్రప్రదేశ్ బీసీ కార్పొరేషన్ మహిళలకు శుభవార్తను తెలిపింది. ఉచిత టైలరింగ్ శిక్షణ పూర్తిచేసుకున్న మహిళలకు కుట్టుమిషన్లు ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించింది. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 46,994 మంది మహిళలు ఈ శిక్షణను పూర్తిచేసుకున్నారు. వీరందరికీ త్వరలోనే ఫ్రీగా కుట్టుమిషన్లు పంపిణీ చేయనున్నట్లు బీసీ కార్పొరేషన్ చైర్‌పర్సన్ అనంతకుమారి వెల్లడించారు.

Free Gas Cylinders: ఏపీలో వారందరికి పండగే..! ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు, సిలిండర్లు ఫ్రీ!

మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. మహిళలు స్వయం ఉపాధి పొందేలా, సొంత కాళ్లపై నిలబడేలా కొత్త పథకాలు ప్రవేశపెడుతోంది. కుట్టుమిషన్లు అందించడం ద్వారా మహిళలు ఇంటివద్దే ఆదాయం పొందే అవకాశం కలుగుతుందని అధికారులు తెలిపారు.

SCCL: టర్మినేట్ అయిన వారికి.. ఆ సంస్థలో మళ్లీ ప్రభుత్వ ఉద్యోగాలు! ఉత్తర్వులు జారీ!

మరోవైపు, ఆదరణ పథకాన్ని రూ.1,000 కోట్ల నిధులతో తిరిగి ప్రారంభించనున్నారు. ఈ పథకం కింద కులవృత్తుల వారికి పనిముట్లు అందజేయనున్నారు. అదనంగా వెనుకబడిన వర్గాలకు చెందిన చిన్న వ్యాపారులకు రూ.200 కోట్ల సబ్సిడీ రుణాలు ఇవ్వాలని నిర్ణయించారు. ఈ చర్యలు బీసీ వర్గాల ఆర్థికాభివృద్ధికి దోహదం చేయనున్నాయి.

AP Government: ఏపీ ప్రజలకు ఆ డాక్యుమెంట్ ఇంటికే ఉచితంగా అందిస్తారు! ప్రభుత్వ ఆఫీసులకు వెళ్లాల్సిన పని లేదు!

బీసీ కార్పొరేషన్ ప్రస్తుతం 13 జిల్లాల్లో కార్యాలయాలు నిర్వహిస్తోంది. త్వరలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కూడా కార్యాలయాలు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో 54 కుల కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తోంది. అలాగే పేద బీసీ విద్యార్థులకు ఉపకారవేతనాలతో పాటు విదేశీ విద్యా రుణాలు కూడా అందించనున్నారు.

Schools Holiday: అలర్ట్‌! రేపు అన్నీ స్కూల్స్, కాలేజీలకు సెలవు.. ఎందుకో తెలుసా?

ఈ ఆర్థిక సంవత్సరానికి లక్షమంది మహిళలకు ఉచిత టైలరింగ్ శిక్షణ ఇచ్చి, అనంతరం కుట్టుమిషన్లు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 20 నుంచి 40 ఏళ్ల వయసు మధ్య ఉన్న మహిళలు, వార్షిక ఆదాయం గ్రామాల్లో రూ.1.5 లక్షలు, పట్టణాల్లో రూ.2 లక్షలు మించనివారు ఈ పథకానికి అర్హులు. ప్రస్తుతం ఇది BC మరియు EWS వర్గాలకు మాత్రమే వర్తిస్తుంది. ఇప్పటివరకు 46 వేల మందికి పైగా మహిళలు శిక్షణ పూర్తి చేశారని అధికారులు తెలిపారు.

New Flyover : విజయవాడలో కొత్తగా మరో భారీ ఫ్లై ఓవర్.. ఈ రూట్‌లో ఆరులైన్లుగా, ట్రాఫిక్ సమస్యలకు చెక్!
Self Employment: యువతీ, యువకులకు బంపరాఫర్! రేషన్ కార్డు ఉంటే చాలు, ఉచిత నైపుణ్య శిక్షణ, భోజనం, వసతి!
IRCTC Offer: శివభక్తులకు ప్రత్యేక ఆధ్యాత్మిక యాత్ర! కేవలం రూ.24 వేలకే.. పూర్తి వివరాలు!
Banana Coffee: బనానా కాఫీ.. రుచితో ఆరోగ్యం.! కొత్త ట్రెండ్‌కి వెల్‌కమ్! రెండు నిమిషాల్లో ఇంట్లోనే.!
IRCTC: ఐఆర్సీటీసీ తీపి కబురు.. 12 రోజుల్లో 8 జ్యోతిర్లింగాల దర్శనం! అతి తక్కువ ధరకే - పూర్తి వివరాలివే.!
Road Extension: ఈ 5 జిల్లాలకు మహర్దశ! రూ.400 కోట్లతో... నాలుగు లైన్లు ఎనిమిది లైన్లుగా విస్తరణ!