కృష్ణా కరకట్ట రోడ్డును నాలుగు వరసలుగా అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు పచ్చజెండా ఊపారు. ప్రకాశం బ్యారే జీ దిగువన కొండవీడు వాగు నుంచి రాయపూడి వరకు ఈ రహదారి విస్తరణకు అమరావతి అభివృద్ధి సంస్థ (ఏడీసీఎల్) ప్రతిపాదనకు ఆయన మొగ్గు చూపడంతో ఈ ప్రాజెక్టుపై పూర్తి స్పష్టత వచ్చింది. కృష్ణానది వరదను దృష్టిలో ఉంచుకుని భవిష్యత్తులో కరకట్ట రోడ్డు దుర్భేద్యంగా ఉండేలా ఇరువైపులా రిటైనింగ్ వాల్ నిర్మించాలన్న ప్రతిపాదనకు కూడా సీఎం అంగీకారం తెలిపారు. దీనికి సంబంధించి మున్సిపల్ మంత్రి నారాయణ, జలవనరుల శాఖ ఉన్నతాధికారులు చర్చించి, తుది నిర్ణయం తీసుకోవాలని సూచించారు. దీంతో రెండురోజుల్లో మంత్రి, అధికారులు భేటీ కాబోతున్నారు. ఈ ప్రాజెక్టుకు వారం రోజుల్లో టెండర్లు పిలిచేందుకు సన్నాహకాలు జరుగుతున్నాయి. సీఎంతో చర్చించి అనుమతులు తీసుకున్న మేరకు కరకట్ట రహదారి పొడవు 7 కి.మీ.. సెంట్రల్ డివైడర్‌తో నాలుగు వరసల విధానంలో ఉంటుంది. ముందుగా రిటెయినింగ్ వాల్ నిర్మాణం పూర్తయిన తర్వాత ఎర్త్‌వర్క్, వెట్‌మిక్స్, హాట్ మిక్స్ వంటి పనులు చేపట్టి బీటీ లేయర్ వేస్తారు. సెంట్రల్ మీడియం, సెంట్రల్ లైటింగ్‌తో ఫినిషింగ్ టచ్ ఇస్తారు. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి రూ.1,200 కోట్లు వ్యయం అవుతుందని ఏడీసీ అధికారులు అంచనా వేశారు.
ఇది కూడా చదవండి: వైసీపీకి దిమ్మతిరిగే షాక్! పార్టీని విడిచిపోతున్న కీలక నేత!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ఆ కీలక ప్రాజెక్టుకు వీడనున్న సంకెళ్లు! మంత్రి సంచలన నిర్ణయం!
వివేక హత్య వెనుక మర్మం! అసలు వ్యక్తి మొదట అక్కడే! ఆ తర్వాత ఏం జరిగిందంటే?
ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ.. తీసుకున్న కీలక నిర్ణయాలివే.! వారికి గుడ్ న్యూస్..
రూ.119 కోట్లు తప్పుదారిపట్టించిన రోజా.. ఆమె అరెస్టు పక్కా! ఎవ్వరూ ఆపలేరు..
రుషికొండ ప్యాలెస్‍పై మంత్రులతో సీఎం చర్చ! కీలక ఆదేశాలు.. సుమారు 400-500 కోట్ల రూపాయలుగా..
ఏపీ ప్రభుత్వానికి మరో శుభవార్త.. అమరావతికి వరల్డ్ బ్యాంక్ నిధులు.! రాజధాని నిర్మాణంలో దూసుకుపోవడమే..
తిరుమల వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్ - 100 శాతం ప్రక్షాళన.. టీటీడీ సమీక్షలో సీఎం కీలక ఆదేశాలు!
సీఐడీ కస్టడీకి రంగా!… వంశీ గుట్లన్నీ వీడినట్టే.? ఈ కేసులో కీలక పరిణామం..!
మాజీ మంత్రికి షాక్.. మరోసారి నోటీసు జారీ చేసిన పోలీసులు!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: