తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంపై దాడి కేసులో మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిపై సీఐడీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ దాడి కేసులో ఆయన పేరును 127వ ముద్దాయిగా సీఐడీ పోలీసులు చేర్చారు.
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అంటే.. 2021, అక్టోబర్ 19వ తేదీన మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంపై వైసీపీ అరాచక మూకలు దాడికి తెగబడ్డాయి. అయితే కూటమి ప్రభుత్వం కొలువు తీరిన అనంతరం ఈ దాడి కేసును సీఐడీకి అప్పగించింది.
అయితే ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురాం, నాటి బాపట్ల ఎంపీ నందిగం సురేష్, విజయవాడ తూర్పు వైసీపీ ఇన్‌చార్జి దేవినేని అవినాశ్ ఆధ్వర్యంలోని వైసీపీ ముఖ్యనేతల ఆదేశాలతో ఈ దాడికి పథక రచన జరిగినట్లు సమాచారం. వందలాది మంది వైసీపీ నాయకులతో పాటు రౌడీషీటర్లు, పలువురు మహిళలు ఈ దాడిలో పాల్గొన్నారు. టీడీపీ కార్యాలయం ప్రధాన గేటును కూల్చి లోపలకి ప్రవేశించిన అల్లరి మూకలు కార్యాలయ సిబ్బందిపై విచక్షణారహితంగా దాడి చేసి హత్యాయత్నం చేశారు.
ఇది కూడా చదవండి: అక్రమ మైనింగ్ కేసు.. గాలి జనార్దనరెడ్డిని బెంగళూరుకు తరలించిన పోలీసులు!
కర్రలు, రాడ్లు, రాళ్లతో అద్దాలు, కార్లను, సామగ్రిని ధ్వంసం చేశారు. అరగంటకు పైగా పార్టీ కార్యాలయంలో బీభత్సం సృష్టించారు. అనంతరం వారంతా పరారయ్యారు. ఈ దాడి ఘటనపై మంగళగిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ అధికారంలో వైసీపీ ప్రభుత్వం ఉండడంతో.. ఈ కేసును పక్కన పెట్టేశారు. అంతేకాకుండా..టీడీపీ ముఖ్య నేతలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు సైతం పోలీసులు నమోదు చేశారు.
ఇక అసెంబ్లీ ఎన్నికల్లో కూటమిలోని పార్టీకి ఓటరు పట్టం కట్టాడు. దీంతో చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం కొలువు తీరింది. ఆ క్రమంలో గతేడాది జూన్ చివర్లో ఈ దాడికి సంబంధించిన కేసు ఫైళ్లను బయటకు తీశారు.అయితే ఈ కేసు నమోదుతోపాటు.. దర్యాప్తులోనూ ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యంగా వ్యవహరించారనే కారణంగా అప్పటి సీఐతో పాటు ఇద్దరు ఎస్‌ఐలను ప్రభుత్వం సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ కేసులో నందిగం సురేష్ అరెస్టయిన సంగతి తెలిసిందే.
మరోవైపు ప్రతిపక్షనేతగా చంద్రబాబు నాయుడు ఉన్న సమయంలో.. ఆయన నివాసంపై మాజీ మంత్రి జోగి రమేశ్ దాడికి యత్నించారు. దీంతో టీడీపీ కార్యాలయంపై దాడితోపాటు చంద్రబాబు నివాసంపై దాడి కేసులను ప్రభుత్వం సీఐడీకి అప్పగించిన విషయం తెలిసిందే.
ఇది కూడా చదవండి: విజయవాడ విమానాశ్రయానికి మహర్దశ! ఇక నుండి అక్కడికి డైరెక్ట్ సర్వీసులు!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
భారతీయ విద్యార్థులపై అమెరికా మరో బాంబ్! అలా చేసినా వీసా రద్దు!
ఏపీ పోలీసు బాస్‌గా అయన నియమకం! ఇక పూర్తిస్థాయి డీజీపీ!
సిరిసిల్లలో ముదిరిన ప్రోటోకాల్ వివాదం..! నేతల అరెస్టుతో ఉద్రిక్తత!
అవును ఆ ఇంటికి వెళ్లాను..! వైసీపీ వీడియోపై విజయసాయి రెడ్డి సంచలన ట్వీట్!
లోకేశ్‌కు పార్టీలో ఆ పదవి.. జోరుగా చర్చ! జీవీ, ఆనం కీలక వ్యాఖ్యలు!
ప్రపంచంలో టాప్-10 వైమానిక దళాలు ఇవే! భారత్ స్థానం ఎక్కడంటే?
కేసీఆర్ కు కవితకు మధ్య గ్యాప్ వెనుక కారణం ఇదే! చేసింది అంతా ఆయనే!
ప్రధాని మోదీ అధ్యక్షతన ఎన్డీయే సీఎంలు, డిప్యూటీ సీఎంల భేటీ.. చేసిన తీర్మానాలు ఇవే!
జంట హత్యల కేసులో ఊహించని ట్విస్ట్.. వైసీపీ మాజీ ఎమ్మెల్యే బ్రదర్స్ పై కేసు నమోదు!
రెండు రోజుల పోలీస్ కస్టడీకి పీఎస్ఆర్, మధు! ఆంజనేయులపై ప్రశ్నల వర్షం..
ప్రధానికి కృతజ్ఞతలు తెలియజేసిన ఏపీ సీఎం చంద్రబాబు.. ఇవాళ మన్ కీ బాత్ కార్యక్రమం!
వైసీపీకి మరో భారీ షాక్! ఏపీ పోలీసుల అదుపులో మాజీ మంత్రి!
నిరుద్యోగులకు గుడ్ న్యూస్! నెలకు 2 లక్షల జీతంతో.. భారీ నోటిఫికేషన్!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: