Header Banner

లోకేశ్​కు పార్టీలో ఆ పదవి.. జోరుగా చర్చ! జీవీ, ఆనం కీలక వ్యాఖ్యలు!

  Mon May 26, 2025 21:53        Politics

తెలుగుదేశం పార్టీలో యువనేత నారా లోకేశ్ కు మరింత కీలకమైన బాధ్యతలు అప్పగించాలనే చర్చ జోరందుకుంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా లోకేశ్ ను నియమించాలనే డిమాండ్ పార్టీ శ్రేణుల నుంచి బలంగా వినిపిస్తోంది. త్వరలో జరగనున్న మహానాడు వేదికగా ఈ అంశాన్ని పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లేందుకు పలువురు నేతలు సిద్ధమవుతున్నారు. ప్రభుత్వ విప్, టీడీపీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ఈ విషయంపై మాట్లాడుతూ, కోట్లాదిమంది క్రియాశీల సభ్యులు, కార్యకర్తలు నారా లోకేశ్ ను పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారని తెలిపారు. "కార్యకర్తల హృదయాల్లోంచి వస్తున్న ఈ ఆకాంక్షను మహానాడులో మా అధినేత చంద్రబాబు గారి దృష్టికి కచ్చితంగా తీసుకెళతాం. పార్టీని మరో 40 సంవత్సరాల పాటు యువశక్తితో నింపి, 'విజన్ 2047' లక్ష్యాన్ని సాధించే దిశగా అడుగులు వేయాల్సిన అవసరం ఉంది. లోకేశ్ నాయకత్వంలో పార్టీ మరింత బలోపేతమై, నూటికి నూరు శాతం సీట్లు సాధించే దిశగా ఎన్డీయే కూటమి ముందుకు సాగుతుంది" అని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

 

ఇది కూడా చదవండి: చాయ్‌ తియ్యగుంది.. టీడీపీ కార్యకర్త టీ కొట్టులో లోకేశ్‌! తన వెంట నేనున్నానని భరోసా..

 

యువశక్తితో పార్టీకి కొత్త ఊపు తీసుకురావాలన్నదే అందరి లక్ష్యమని జీవీ ఆంజనేయులు పేర్కొన్నారు. మరోవైపు, టీడీపీ నేత ఆనం వెంకటరమణారెడ్డి కూడా ఇదే అంశంపై స్పందించారు. లోకేశ్ కు ఏ పదవి ఇవ్వాలనేది పూర్తిగా కార్యకర్తల నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని ఆయన అన్నారు. "మా పార్టీలో పైనుంచి రుద్దే సంస్కృతి లేదు. కార్యకర్తలు ఏది కోరుకుంటే అదే జరుగుతుంది. లోకేశ్ ని కీలక పదవిలో చూడాలని కార్యకర్తలు భావిస్తే, అదే జరుగుతుంది. దీనికోసం వేచి చూడాలి, తొందరపడాల్సిన అవసరం లేదు" అని ఆనం వివరించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత జరగబోయే తొలి మహానాడు చాలా ప్రత్యేకంగా, ఒక చరిత్ర సృష్టించేలా ఉంటుందని ఆనం వెంకటరమణారెడ్డి తెలిపారు. "తెలుగుదేశం పార్టీ మహానాడు ఎలా నిర్వహిస్తుందో ఇతర రాజకీయ పార్టీలు చూసి నేర్చుకోవాలి. ఇది ఒక కేస్ స్టడీ లాంటిది. ఒక క్రమశిక్షణ, ఒక ఆర్గనైజేషన్, ఒక విజన్ ఎలా ఉండాలో చంద్రబాబు చేసి చూపిస్తారు. ఈసారి మహానాడులో కార్యకర్తల ఉత్సాహం రెట్టింపు స్థాయిలో ఉంటుంది" అని ఆయన అన్నారు. వైసీపీ గురించి మాట్లాడుతూ, "అది చచ్చిన పాము, దాని గురించి ఇప్పుడు మాట్లాడటం అనవసరం. రాష్ట్రానికి మంచి రోజులు వచ్చాయి" అని వ్యాఖ్యానించారు.

 

ఇది కూడా చదవండి: విజయవాడ విమానాశ్రయానికి మహర్దశ! ఇక నుండి అక్కడికి డైరెక్ట్ సర్వీసులు!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

వల్లభనేని వంశీకి దెబ్బపై దెబ్బ.. బెయిల్ పిటిషన్ కొట్టివేత!

        

అక్రమ మైనింగ్ కేసులో మాజీ మంత్రి షాక్! 14 రోజుల రిమాండ్..

 

రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ జిల్లా పేరు మారుస్తూ జీవో జారీ!

 

వైసీపీకి మరో భారీ షాక్! ఏపీ పోలీసుల అదుపులో మాజీ మంత్రి!

 

కేంద్రం నుంచి గ్రీన్‌ సిగ్నల్‌! రాష్ట్రానికి మరో 2 లక్షల కనెక్షన్లు!

 

ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. జూన్ 2న కీలక ప్రకటనలు! కొత్త ఆరోగ్య పథకం..

 

ఏపీ పంట పండింది... కొత్తగా 2 రైల్వే లైన్లు! ఆ రూట్లోనే..!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #NaraLokesh #AndhraPradesh #Appolitics #Jagan #APNews #LokeshMeeting