Header Banner

సిరిసిల్లలో ముదిరిన ప్రోటోకాల్ వివాదం..! నేతల అరెస్టుతో ఉద్రిక్తత!

  Tue May 27, 2025 07:42        Politics

సిరిసిల్ల నియోజకవర్గంలోని అధికారిక కార్యక్రమాల్లో ప్రోటోకాల్ పాటించకపోవడం రాజకీయ రగడకు దారితీసింది. స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ ఫోటోను ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రదర్శించకపోవడంపై బిఆర్ఎస్ నాయకులు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం జరిగిన ఇందిరమ్మ ఇండ్ల పట్టాల పంపిణి కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు యత్నించిన బిఆర్ఎస్ యూత్ నేతలను పోలీసులు అరెస్టు చేశారు.

సిరిసిల్ల పట్టణంలోని ప్రభుత్వ కళాశాల మైదానంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో కేటీఆర్ చిత్రపటాన్ని ప్రదర్శించకపోవడంపై మండిపడిన బిఆర్ఎస్ కార్యకర్తలు, మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించారు. మాజీ సర్పంచుల ఫోరం అధ్యక్షుడు మాట్ల మధు నేతృత్వంలో కార్యకర్తలు నిరసనకు దిగగా, పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. శనివారం రోజున కొందరు బిఆర్ఎస్ నాయకులు జిల్లా అధికారులు ప్రస్తుతం జరుగుతున్న నియోజకవర్గంలో అభివృద్ధి పనులలో ప్రోటోకాల్ ప్రాకారం కేటీఆర్ ఫోటో పెట్టడం లేదని కలెక్టర్ పై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు.

ప్రతీ అధికారిక కార్యక్రమంలో ఎమ్మెల్యే కేటీఆర్ ఫోటో పెట్టాల్సిందే అంటూ బిఆర్ఎస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ వివాదం సోమవారం మరింత ముదిరింది. సీఎం క్యాంపు కార్యాలయం ఎదుట కాంగ్రెస్, బిఆర్ఎస్ నేతలు భారీగా గుమిగూడడంతో ఉద్రిక్తత నెలకొంది. బిఆర్ఎస్ నేతలు, ఎమ్మెల్యే ఫోటో లేకుంటే కార్యక్రమం లేదు అనే అభిప్రాయంతో బహిరంగంగా సవాలు విసరగా, కాంగ్రెస్ నేతలు సిరిసిల్ల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో”సీఎం రేవంత్ రెడ్డి ఫోటో పెడతాం” అంటూ ర్యాలీ తో వచ్చారు. ఇరు వర్గాల మధ్య తోపులాట చోటు చేసుకోగా, పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేయాల్సి వచ్చింది. పలువురు నేతలు గాయపడ్డారు. ఇరుపక్షాల కీలక నేతలను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు.

సిరిసిల్లలో ప్రస్తుతం హై టెన్షన్ వాతావరణం నెలకొంది. అధికారిక కార్యక్రమాల్లో ప్రోటోకాల్ పాటించకపోవడమే ఈ ఉద్రిక్తతలకు కారణమవుతోంది. పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారే అవకాశముండటంతో క్యాంపు కార్యాలయం వద్ద బందోబస్తు ఏర్పాటు చేసి, పోలీసులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. రెండు పార్టీల నేతలపై, కార్యకర్తలపై కేసులు పెట్టే ఆలోచన ఉన్నట్లు తెలుస్తుంది.. ఇప్పటికి.. సిరిసిల్ల లో తరుచు ఉద్రి క్త త పరిస్థితి లు నెలకొన్నాయి.

ఇది కూడా చదవండి: ఏపీ పోలీసు బాస్‌గా అయన నియమకం! ఇక పూర్తిస్థాయి డీజీపీ!


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:


లోకేశ్​కు పార్టీలో ఆ పదవి.. జోరుగా చర్చ! జీవీ, ఆనం కీలక వ్యాఖ్యలు!


ప్రపంచంలో టాప్-10 వైమానిక దళాలు ఇవే! భారత్ స్థానం ఎక్కడంటే?


కేసీఆర్ కు కవితకు మధ్య గ్యాప్ వెనుక కారణం ఇదే! చేసింది అంతా ఆయనే!


ప్రధాని మోదీ అధ్యక్షతన ఎన్డీయే సీఎంలు, డిప్యూటీ సీఎంల భేటీ.. చేసిన తీర్మానాలు ఇవే!


జంట హత్యల కేసులో ఊహించని ట్విస్ట్.. వైసీపీ మాజీ ఎమ్మెల్యే బ్రదర్స్ పై కేసు నమోదు!


రెండు రోజుల పోలీస్‌ కస్టడీకి పీఎస్ఆర్‌, మధు! ఆంజనేయులపై ప్రశ్నల వర్షం..


ప్రధానికి కృతజ్ఞతలు తెలియజేసిన ఏపీ సీఎం చంద్రబాబు.. ఇవాళ మన్ కీ బాత్ కార్యక్రమం!


వైసీపీకి మరో భారీ షాక్! ఏపీ పోలీసుల అదుపులో మాజీ మంత్రి!

ఇలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదు.. ఆస్తి అడిగామా?
నిరూపించండి.. మనోజ్ ఎమోషనల్!


నిరుద్యోగులకు గుడ్ న్యూస్! నెలకు 2 లక్షల జీతంతో.. భారీ నోటిఫికేషన్!


ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group




   #andhrapravasi #Sircilla #ProtocolRow #PoliticalTension #LeadersArrested #TelanganaPolitics #BreakingNews #ProtestDrama