Header Banner

కేసీఆర్ కు కవితకు మధ్య గ్యాప్ వెనుక కారణం ఇదే! చేసింది అంతా ఆయనే!

  Mon May 26, 2025 08:54        Politics

కవిత ను కేసీఆర్ కూడా దూరం పెట్టారా ? కవితకు తండ్రి కెసిఆర్ కు గ్యాప్ ఎందుకు వచ్చింది? కవితను దగ్గరికి తీసుకోవద్దని కెసిఆర్ అనుకుంటున్నారా అంటే అవుననే ప్రచారం జరుగుతోంది. కెసిఆర్ కు కవిత అంటే చాలా ప్రేమ. ఇది ప్రపంచానికి తెలిసిన విషయమే. అయినప్పటికీ కెసిఆర్ కవితను దూరం పెట్టారు అన్నది ప్రతి ఒక్కరు అంగీకరించాల్సిన అంశం.


కేసీఆర్ కు కవితకు మధ్య గ్యాప్

ఒకవేళ కెసిఆర్ కవితకు దగ్గరగా ఉంటే, తాను చెప్పదలుచుకున్న విషయాలు కెసిఆర్ కు లేఖ రాసేది కాదు. నేరుగా వెళ్లి ఆయనతోనే సంభాషించేది. కానీ అటువంటి పరిస్థితి లేకపోవడం వల్లనే కవిత కెసిఆర్ కు లేఖ రాసింది అని పార్టీవర్గాల భోగట్టా. అయితే కెసిఆర్ కు కవితకు మధ్య గ్యాప్ రావడానికి కేటీఆర్ కారణమని కవిత చాలా బలంగా నమ్ముతున్నారు. ఈ కారణంగానే కవిత కేటీఆర్ పైన పోరాటానికి దిగారు.


జైలు నుండి వచ్చాక కవితపై ఆంక్షలు

అందరూ అనుకున్నట్లుగా కేటీఆర్, కవిత మధ్య అభిప్రాయ భేదాలు రావడంతోనే కవిత రాసిన లేఖ బయటకు వచ్చిందని అంటున్నారు. కెసిఆర్ సైతం కవిత వ్యవహార శైలితో తీవ్ర అసహనంతో ఉన్నారని పొలిటికల్ సర్కిల్స్ లో ప్రచారం జరుగుతోంది. కవితను ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో అరెస్టయి, జైలు జీవితం అనుభవించి వచ్చిన తర్వాత రాజకీయాలకు దూరంగా ఉండాలని కేటీఆర్ ప్రతిపాదన చేసినట్టు చెబుతున్నారు.


తెలంగాణ జాగృతి తరఫున కార్యక్రమాలకు కారణం ఇదే

కెసిఆర్ కూడా కేటీఆర్ ప్రతిపాదనను సమర్ధించి కవితను కొంతకాలం పార్టీ కార్యక్రమాలకు, రాజకీయాలకు దూరంగా ఉండాలని సూచించారు. అయితే కొంతకాలం పాటు సైలెంట్ గా ఉన్న కవిత మళ్ళీ రాజకీయంగా యాక్టివ్ కావడానికి తెలంగాణ జాగృతి తరఫున కార్యక్రమాలు చేపట్టాల్సి వచ్చిందని బీఆర్ఎస్ లో చర్చ జరుగుతోంది.

ఇది కూడా చదవండి: ఐదు అసెంబ్లీలకు ఉపఎన్నికలు! షెడ్యూల్ రిలీజ్ చేసిన ఈసీ!

 

ఆ చర్యతో కవితను దూరం పెట్టిన కేసీఆర్

రాజకీయాల్లో కవిత ఫుల్ యాక్టివ్ కావటం నచ్చని కేటీఆర్ ఇదే విషయాన్ని కేసీఆర్ దృష్టికి తీసుకు వెళ్లడం, ఇదే కవితను కేసీఆర్ దూరం పెట్టేందుకు కారణం కావడం జరిగాయని చెప్పుకుంటున్నారు. కవితపై కేసీఆర్ ఎంత ఆగ్రహంగా ఉన్న ఆమెపై అంతే ప్రేమ ఉంటుందనేది ఓపెన్ సీక్రెట్. అయితే అటువంటి కెసిఆర్ కవితకు అపాయింట్మెంట్ ఇవ్వనంత దూరం పెట్టారంటే అందుకు కేటీఆర్ కారణంగా కవిత భావిస్తున్నారని పార్టీ వర్గాలలో చర్చ జరుగుతుంది.

 

కేసీఆర్ తోనే తాడోపేడో తేల్చుకోవాలని భావిస్తున్న కవిత

కవితపై ఢిల్లీ లిక్కర్ స్కామ్ మరకలు ఉండటంతో కవిత కంటే కేటీఆర్ ను ప్రమోట్ చేయాలని కెసిఆర్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. అందుకే పార్టీ పగ్గాలు కేటీఆర్ కు అప్పగించాలని కెసిఆర్ భావిస్తున్నారని, ఈ క్రమంలోనే రాజకీయంగా ఉనికిని కోల్పోతున్న కవిత కొత్తపార్టీ పెట్టేందుకు సమాలోచనలు జరుపుతున్నారని తెలుస్తుంది. కవిత తన రాజకీయ భవిష్యత్తుపై కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తూ అందుకోసం తండ్రితోనే తేల్చుకోవాలని నిర్ణయం తీసుకున్నారు.


రెండు అంశాలపై కవిత పట్టు, కేసీఆర్ ఏమంటారు?

కేసీఆర్ పిలుపు కోసం కవిత ఎదురు చూస్తున్నారు. ఆయనతోనే నేరుగా అన్ని విషయాలు చర్చించాలని భావిస్తున్నారు. ప్రధానంగా రెండు అంశాలపై కవిత పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. పార్టీలో ప్రాధాన్యత, తన రాజకీయ భవిష్యత్తు గురించి అధినేత కెసిఆర్ తో తేల్చుకోవాలని కవిత భావిస్తున్నారు. కేసీఆర్ స్పందనకు అనుగుణంగా తన భవిష్యత్తు కార్యాచరణ ఖరారు చేసి ప్రకటించేందుకు అవసరమైతే బి ఆర్ ఎస్ నుంచి బయటకు వెళ్లి కొత్త పార్టీ దిశగా అడుగులు వేసే అవకాశం ఉందని తెలుస్తోంది.


మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

కరోనా కొత్త వేరియంట్లు భారత్‌లోకి.. ! చిన్నారులు, వృద్ధులు రిస్క్‌లో..!

 

తిరుమల అలిపిరి కాలిబాట మార్గంలో చిరుత హల్‌చల్‌.. 12 ఏళ్లలోపు చిన్నారులను.!

 

జంట హత్యల కేసులో ఊహించని ట్విస్ట్.. వైసీపీ మాజీ ఎమ్మెల్యే బ్రదర్స్ పై కేసు నమోదు!

 

వాట్సాప్‌లో రేషన్ కార్డు సేవలు..! ఈ నంబర్‌కు మెసేజ్ చేస్తే చాలు..!

 

మాచర్లలో తీవ్ర ఉద్రిక్తత! టీడీపీ కార్యకర్తల జంట హత్యలు! గొడ్డలితో వెంటాడి...

 

ఏపీ పంట పండింది... కొత్తగా 2 రైల్వే లైన్లు! ఆ రూట్లోనే..!

 

మహిళలకు గుడ్ న్యూస్! ఇక ఇంటి దగ్గరే సంపాదించుకునే ఛాన్స్!

 

భారతీయులకు షెంజెన్ వీసాల తిరస్కరణ! 17 లక్షల దరఖాస్తులు..!

 

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్! రేషన్ హోమ్ డెలివరీ.. ఎవరెవరికంటే!

 
ఇసుక స్కాం బట్టబయలు.. SIT దృష్టిలో ఆ నలుగురు! ఒక్కటైపోయిన..

 

జూన్ 1 నుండి రేషన్ పంపిణీలో కీలక మార్పులు! ప్రభుత్వం ఉత్తర్వులు జారీ!



వైసీపీ మాజీ ఎమ్మెల్యేకు సీఐ రాచమర్యాదలు! ప్రజల ఆగ్రహం..!


ఏపీలో మెగా డీఎస్సీ వాయిదా పిటిషన్లు! సుప్రీంకోర్టు కీలక నిర్ణయం!


భారత్ లో కొత్త బైక్ లాంచ్ చేసిన హోండా! ఆధునిక ఫీచర్లు, ఆకట్టుకునే డిజైన్‌తో...


విజ్ఞానశాస్త్రంలో మరో ముందడుగు! యాంటీమ్యాటర్ రవాణాకు ప్రత్యేక కంటైనర్!


కేంద్రమంత్రి జితేంద్ర సింగ్‌తో సీఎం చంద్రబాబు భేటీ..! ఏం చర్చించారంటే?



ఎంపీ డీకే అరుణకు కీలక బాధ్యత అప్పగించిన కేంద్రం! ధాన్యం సేకరణపై ప్రత్యేక ఫోకస్!



ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group




   #AndhraPravasi #KCR #Kavitha #TRS #PoliticalDrama #TelanganaPolitics #FamilyPolitics