Header Banner

శ్రీవారి సేవల్లో భారీ మార్పులు! ఎన్నారైలకు ప్రత్యేక ప్రణాళికలు!

  Sun May 25, 2025 07:01        Devotional

తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. శ్రీవారిని దర్శించుకోవడానికి దేశం నలుమూలల నుంచి వచ్చే భక్తులతో క్రిక్కిరిసిపోతోంది. శుక్రవారం నాడు 74,374 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 37,477 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు.

 

ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 3.02 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో అన్ని కంపార్టుమెంట్లు నిండిపోయాయి. శిలాతోరణం వరకు క్యూలైన్ ఏర్పడింది. టోకెన్‌ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పట్టింది. కంపార్ట్‌మెంట్లు, క్యూ లైన్‌లల్లో ఉన్న వారికి టీటీడీ సిబ్బంది, శ్రీవారి సేవకులు అన్నప్రసాదాలు, మంచినీరు, అల్పాహారాన్ని పంపిణీ చేశారు.

 

ఇది కూడా చదవండి: విజయవాడ విమానాశ్రయానికి మహర్దశ! ఇక నుండి అక్కడికి డైరెక్ట్ సర్వీసులు!

 

శ్రీవారి సేవలను విశ్వవ్యాప్తం చేయాలని టీటీడీ నిర్ణయించింది. దీనికి అవసరమైన కార్యాచరణ సిద్ధం చేయాలని కార్యనిర్వహణాధికారి జే శ్యామలరావు అధికారులను ఆదేశించారు. టీటీడీ పరిపాలనా భవనంలో శనివారం 14 దేశాలకు చెందిన వివిధ రంగాల ఎన్నారై ప్రతినిధులతో వర్చువల్ సమావేశాన్ని నిర్వహించారు. 

 

ఈ వర్చువల్ సమావేశంలో జర్మనీ- సూర్యప్రకాశ్, ఐర్లాండ్- డాక్టర్ శివశంకర్, సంతోష్ పల్లె, రమేశ్ గుమ్మడవల్లి, యూకే- లోకనాథం, విజయ్ కుమార్, అరుణ్ ముమ్మలనేని, శివరాం రెడ్డి, విజయ్ కుమార్, డాక్టర్ అనిల్ కుమార్, రీతు, నెదర్లాండ్- శివరాం, ఫ్రాన్స్- కన్నెవిరనె పాల్గొన్నారు. 

 

పోలెండ్- సంతోష్, చంద్ర అక్కల, స్వీడన్- రమణ కుమార్ రంగా, స్విట్జర్లాండ్- అమర్ కవి, అమెరికా- రఘువీర్ బండార్, హర్షిత, అమరనాథ్, డెన్మార్క్- రామ్ దాస్, మారిషష్, శ్రీలంక- విక్కీ తురాయ్జా, దుబాయ్- విక్రమ్ ఇందులో పాల్గొన్నారు. టీటీడీ అదనపు ఈఓ సీహెచ్ వెంకయ్య చౌదరి ఇందులో పాల్గొన్నారు.

 

ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ- కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శింకోవడానికి దేశం నలుమూలల నుంచి వచ్చే భక్తులకు కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు పలు రాష్ట్రాల నుంచి శ్రీవారి సేవకులు స్వచ్ఛందంగా తిరుమలకు వచ్చి చక్కటి సేవలు అందిస్తున్నారని అన్నారు.

 

త్వరలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ రంగాలలో నిపుణులైన ఎన్నారైలు కూడా తిరుమలకు వచ్చే భక్తులకు స్వచ్ఛందంగా సేవలు అందించడానికి ముందుకు వస్తున్నారని శ్యామలరావు చెప్పారు. టీటీడీలోని వివిధ విభాగాల్లో దేశవ్యాప్తంగా శ్రీవారి సేవకులు సేవలు అందిస్తున్నారని, వారి సేవలను విస్తరించేందుకు ప్రణాళికలు రూపొందిస్తోన్నామని అన్నారు.

 

ఇప్పటికే అమెరికా తదితర దేశాల్లో శ్రీనివాస కల్యాణాలు విరివిగా నిర్వహించేందుకు వారు సహకరి.స్తున్నారని, తాజాగా శ్రీవారి సేవలో తీసుకువస్తున్న సంస్కరణల మూలంగా వైద్యం, ఐటీ, ఇంజినీరింగ్, ప్లానింగ్, వాటర్ మేనేజ్మెంట్, ఫుడ్ టెక్నాలజీ, ఆర్కిటెక్చర్, టౌన్ ప్లానింగ్ తదితర విభాగాలలో సేవలు అందించడానికి ఎన్నారైలు ముందుకు వస్తున్నారని చెప్పారు.

 

ఎన్నారైల నైపుణ్యం ఆధారంగా వారి సేవలను టీటీడీలో వినియోగించుకోవడానికి ప్రణాళికలు తయారు చేయాలని శ్యామలరావు అధికారులను ఆదేశించారు. శ్రీవారి సేవల్లో తమకు అవకాశం కల్పించాలని టీటీడీ నిర్ణయించడం పట్ల ఎన్నారైలు.. ఈ సందర్భంగా హర్షం వ్యక్తం చేశారు.

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

కారు ప్రమాదంలో మాజీమంత్రి మనవరాలి మృతి! మరో ఇద్దరు మహిళలు తీవ్రంగా..

 

రెండు జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌.. రేపు, ఎల్లుండి పొంచివున్న ముప్పు! భారీ నుంచి అతి భారీవర్షాలు!

 

విజయవాడలో హైఅలర్ట్.. బాంబు బెదిరింపులతో నగరంలో కలకలం!

 

ఢిల్లీ పర్యటనలో ఏపీ సీఎం.. కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషితో చంద్రబాబు భేటీ!

 

హార్వర్డ్‌కు ట్రంప్ సర్కార్ షాక్! అంతర్జాతీయ విద్యార్థుల ప్రవేశంపై నిషేధం!

 

గోల్డ్ లవర్స్ ఇక కొనేసేయండి..! బంగారం ధర తగ్గిందోచ్.. ఎంతంటే.?

 

వైసీపీ మాజీ మంత్రికి అష్టదిగ్బంధన! లుక్ అవుట్ నోటీసులు జారీ!

 

వామ్మో.. భారీగా పెరిగిన బంగారంవెండి ధరలు.. దెబ్బకు మళ్లీ లక్షకు చేరువలో!

 

స్కూల్ బస్సుపై సూసైడ్ బాంబ్! నలుగురు చిన్నారులు స్పాట్.. 38 మందికి సీరియస్!

 

జగన్‌ను కోర్టుకు రప్పిస్తా! అప్పటి వరకు నిద్రపోను!

 

విజయవాడలో మరో ఇంటిగ్రేటెడ్‌ బస్​ టెర్మినల్‌..! పీఎన్‌బీఎస్‌పై తగ్గనున్న ఒత్తిడి!

 

ఢిల్లీ పర్యటనకు చంద్రబాబు.. నెల రోజుల్లో రెండోసారి! ఈసారి ఎందుకు వెళుతున్నారంటే?

 

ఖరీఫ్ సాగు లక్ష్యంగా మంత్రి అచ్చెన్న కీలక మార్గదర్శనం! రైతు సంక్షేమమే టార్గెట్!

 

టీటీడీలో కీలక నియామకాలు! ఏరి కోరి.. వారి మార్గదర్శకంలోనే ఇక!

 

ఏపీ రైతులకు శుభవార్త.. ఈ కార్డుతో ఎన్నో ప్రయోజనాలు! వెంటనే దరఖాస్తు చేయండి!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 

 


   #andhrapravasi #Tirumala #TTDUpdates #SrivariSeva #NRISeva #TirupatiDarshan #BalajiTemple #TirumalaNews