కోయంబత్తూరు, నీలగిరి జిల్లాలకు ఆదివారం నుంచి రెండు రోజుల పాటు రెడ్ అలెర్ట్ ప్రకటించారు. ఆయా జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ ప్రకటించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సహాయ చర్యల్లో భాగంగా ఎన్‌డీఆర్‌ఎ్‌ఫ బలగాలను రంగంలోకి దింపింది. తూర్పు మధ్య అరేబియా సముద్రంలో గురువారం ఏర్పడిన అల్పపీడనం, మరింత బలపడి ఉత్తర దిశగా పయనించి వాయుగుండంగా మారనుంది. దీని ప్రభావంతో 25, 26 తేదీల్లో కోయంబత్తూర్ జిల్లాలోని కొండ ప్రాంతాలు, నీలగిరి జిల్లాలోని ఒకటి, రెండు ప్రాంతాల్లో అతి భారీవర్షాలు కురిసే అవకాశముంది. దిండుగల్, తేని, తెన్‌కాశి జిల్లాల్లో ఒకట్రెండు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీవర్షాలు కురవనున్నాయి. అదేవిధంగా తిరుప్పూర్, తిరునల్వేలి, కన్నియాకుమారి జిల్లాల్లో భారీవర్షాలు కురిసే అవకాశముంది. వాయుగుండం ప్రభావంతో నైరుతి రుతుపవనాలు మరో రెండు రోజుల్లో రాష్ట్రంలోకి ప్రవేశించే అవకాశముంది. అతి భారీవర్ష సూచన నేపథ్యంలో, కోవై, నీలగిరి జిల్లాలకు రాష్ట్ర జాతీయ విపత్తు నిర్వహణకు చెందిన మూడు బృందాలు వెళ్లాయి. ఊటీ, వాల్పారై ప్రాంతాలకు తలా ఒక బృందం, కోవైలో మరో బృందం మకాం వేసి పరిస్థితులను పర్యవేక్షించనుంది. అలాగే, సీనియర్ అధికారులు రెండు జిల్లాలకు వెళ్లి పరిశీలించాలని, అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి ఎలాంటి నష్టం జరగకుండా పర్యవేక్షించాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ తెలియజేసింది.
ఇది కూడా చదవండి: విజయవాడ విమానాశ్రయానికి మహర్దశ! ఇక నుండి అక్కడికి డైరెక్ట్ సర్వీసులు!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
విజయవాడలో హైఅలర్ట్.. బాంబు బెదిరింపులతో నగరంలో కలకలం!
ఢిల్లీ పర్యటనలో ఏపీ సీఎం.. కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషితో చంద్రబాబు భేటీ!
హార్వర్డ్‌కు ట్రంప్ సర్కార్ షాక్! అంతర్జాతీయ విద్యార్థుల ప్రవేశంపై నిషేధం!
గోల్డ్ లవర్స్ ఇక కొనేసేయండి..! బంగారం ధర తగ్గిందోచ్.. ఎంతంటే.?
వైసీపీ మాజీ మంత్రికి అష్టదిగ్బంధన! లుక్ అవుట్ నోటీసులు జారీ!
వామ్మో.. భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. దెబ్బకు మళ్లీ లక్షకు చేరువలో!
స్కూల్ బస్సుపై సూసైడ్ బాంబ్! నలుగురు చిన్నారులు స్పాట్.. 38 మందికి సీరియస్!
జగన్‌ను కోర్టుకు రప్పిస్తా! అప్పటి వరకు నిద్రపోను!
విజయవాడలో మరో ఇంటిగ్రేటెడ్ బస్ టెర్మినల్..! పీఎన్‌బీఎస్‌పై తగ్గనున్న ఒత్తిడి!
ఢిల్లీ పర్యటనకు చంద్రబాబు.. నెల రోజుల్లో రెండోసారి! ఈసారి ఎందుకు వెళుతున్నారంటే?
ఖరీఫ్ సాగు లక్ష్యంగా మంత్రి అచ్చెన్న కీలక మార్గదర్శనం! రైతు సంక్షేమమే టార్గెట్!
టీటీడీలో కీలక నియామకాలు! ఏరి కోరి.. వారి మార్గదర్శకంలోనే ఇక!
ఏపీ రైతులకు శుభవార్త.. ఈ కార్డుతో ఎన్నో ప్రయోజనాలు! వెంటనే దరఖాస్తు చేయండి!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: