విజయవాడ శివారులో సరికొత్త బస్ టెర్మినల్ నిర్మాణానికి ఆర్టీసీ కసరత్తు చేస్తోంది. ప్రయాణికులు పండిట్ నెహ్రూ బస్ స్టేషన్‌కు రావాల్సిన అవసరం లేకుండానే శివారు నుంచే సులువుగా రాకపోకలు సాగించేలా పీపీపీ విధానంలో నిర్మాణ ప్రణాళికలు వేసింది. తద్వారా ప్రయాణికులకు ఆధునిక సౌకర్యాలు, ఆర్టీసీకి ఆదాయం సమకూరనుంది.
విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ ఎప్పుడూ రద్దీగానే ఉంటుంది. ఇక పండగలు, ప్రత్యేక రోజుల్లోనైతే ప్లాట్‌ఫాంలపై కూర్చోడం కాదుకదా కనీసం నిల్చునే స్థలం లేక ప్రయాణికులు పడిగాపులు కాస్తుంటారు. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా అదనపు బస్సులు నడుపుదామని చూసినా సరిపడా ప్లాట్ ఫాంలు లేకపోవడం సమస్యగా మారింది. ఈ క్రమంలో కొందరు వేచిచూడలేక ప్రైవేటు వాహనాల్ని ఆశ్రయిస్తున్నారు. ఆర్టీసీ రాబడికీ గండిపడుతోంది. ఈ పరిస్థితిని మార్చాలని చూస్తోంది ఆర్టీసీ. ఆటోనగర్‌లో భారీ ఇంటిగ్రేడెడ్ బస్ టెర్మినల్ నిర్మించాలని నిర్ణయించింది.
ప్రస్తుతం ఆటోనగర్‌లో బస్ డిపోతో పాటు చిన్నపాటి బస్టాండ్ ఉంది. ఇక్కడి నుంచి మచిలీపట్నం, అవనిగడ్డ, గుడివాడ వైపు బస్సులు వెళ్తున్నాయి. ఈ సర్వీసుల్ని సమీప బస్ డిపోలకు సర్దుబాటు చేసి, ప్రస్తుత భవనాన్ని పూర్తిగా నేలమట్టం చేయనున్నారు. బీవోటీ విధానంలో కాకుండా పీపీపీ విధానంలో ఆటోనగర్ టెర్మినల్ నిర్మించాలని నిర్ణయించింది. దాదాపు రెండకరాల స్థలంలో ప్రైవేటు సంస్థలు పెట్టుబడి పెట్టి వాణిజ్య దుకాణాలు, సినిమా థియేటర్లు, మాల్స్, విశ్రాంతి గదులు, డార్మిటరీలు నిర్మిస్తారు. వచ్చిన ఆదాయంలో ఆర్టీసీకి వాటా చెల్లించేలా ఒప్పందం కుదుర్చుకుంటారు. త్వరలోనే టెండర్లు పిలిచి నిర్మాణ బాధ్యతలు అప్పగించనున్నట్లు అధికారులు తెలిపారు.
ఆటోనగర్‌లో ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ పూర్తైతే పండిట్ నెహ్రూ బస్టేషన్‌పై ఒత్తిడి తగ్గనుంది. అదే విధంగా ప్రయాణికుల ట్రాపిక్ అవస్థలు తప్పడం సహా సకాలంలో గమ్య స్థానాలకూ చేరుతారని అధికారులు చెబుతున్నారు. కొత్తగా నిర్మించనున్న ఆటోనగర్ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అదనపు సర్వీసులు నడపనున్నారు. రద్దీ వేళల్లో అవసరమైన కొన్ని బస్సులను మాత్రమే పండిట్ నెహ్రూ బస్టేషన్ నుంచి నడుపుతారు. తద్వారా పీఎన్‌బీఎస్‌పై ఒత్తిడి తగ్గుతుంది. డెవలపర్లు ముందుకొస్తే రాష్ట్రంలోని మరికొన్ని బస్టాండ్లనూ పీపీపీ విధానంలో అభివృద్ధి చేయాలని అధికారులు చూస్తున్నారు.
ఇది కూడా చదవండి: ఏపీలో ఆర్టీసీ ప్రయాణికులకు ఇకపై నో టెన్షన్..! విమానాల తరహాలో బస్సుల్లో కూడా..!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ఏపీలో ఆ ఉద్యోగులందరికి పండగే పండగ..! కీలక ఉత్తర్వులు జారీ!
ఏపీలో రేషన్ కార్డులు ఉన్నవారికి గుడ్‌న్యూస్..! వచ్చే నెల నుంచి ఆ రూల్ రద్దు?
ఎన్నారైలకు షాక్! యూఎస్ నుంచి సొమ్ము పంపితే అదనపు భారం!
వైసీపీకి దిమ్మతిరిగే షాక్.. వల్లభనేని వంశీపై మరో కేసు! ఇక పర్మినెంట్ గా జైల్లోనేనా.?
ఈ-పాస్‌పోర్ట్ వచ్చేసింది! విదేశాంగ శాఖ కీలక నిర్ణయం!
లోకేశ్ తాజాగా కీలక సూచనలు.. అందరూ అలా చేయండి! అమ్మ లాంటి పార్టీని మరచిపోవద్దు!
మెగా డీఎస్సీ గడువు పొడగింపుపై మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు..! అభ్యర్థులకు ఊహించని..!
ఎవ్వరూ మాట్లాడొద్దు..! లిక్కర్ స్కాంపై సీఎం ఆర్డర్స్!
ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. అతి తక్కువ ధరకే ఫైబర్ నెట్.. ఆ వివరాలు మీకోసం!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: