దేశీయంగా బంగారం ధర మళ్లీ పెరిగింది. అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల కారణంగా పసిడి ధరలకు రెక్కలొచ్చాయి. దేశ రాజధాని ఢిల్లీలో బుధవారం ఒక్కరోజే 10 గ్రాముల మేలిమి బంగారం ధర ఏకంగా రూ. 1,910 పెరిగి రూ.98,450కి చేరి, లక్ష రూపాయల దిశగా పయనిస్తోంది. మంగళవారం నాటి ముగింపు ధర రూ.96,540గా ఉంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో కూడా సాయంత్రం ఏడు గంటల సమయానికి పది గ్రాముల పసిడి ధర రూ.98 వేల పైనే నమోదవుతోంది. బంగారం బాటలోనే వెండి కూడా నడిచింది. కిలో వెండి ధర రూ.1,660 పెరిగి రూ.99,160కి చేరుకుంది. మంగళవారం దీని ధర రూ.97,500 వద్ద ముగిసింది. అంతర్జాతీయ స్పాట్ మార్కెట్‌లో ఔన్సు బంగారం ధర 3,311 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. గతంలో అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చితులు తగ్గుముఖం పట్టినప్పుడు 3,400 డాలర్ల పైకి చేరిన బంగారం ధర, ఆ తర్వాత కొంతకాలం 3,200 డాలర్ల కంటే దిగువకు వచ్చింది. తాజాగా మళ్లీ ప్రపంచవ్యాప్తంగా పలు అనిశ్చిత పరిస్థితులు తలెత్తడంతో బంగారం ధర మరోసారి 3,300 డాలర్ల మార్కును దాటింది.
ఇది కూడా చదవండి: ఏపీ ప్రజలకు అదిరిపోయే వార్త.. కొత్తగా కేబుల్ బ్రిడ్జ్! ఈ రూట్ లోనే ఫిక్స్ - ఆ నేషనల్ హైవేకు దగ్గరగా.!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
టీటీడీలో కీలక నియామకాలు! ఏరి కోరి.. వారి మార్గదర్శకంలోనే ఇక!
ఏపీ రైతులకు శుభవార్త.. ఈ కార్డుతో ఎన్నో ప్రయోజనాలు! వెంటనే దరఖాస్తు చేయండి!
ఏపీ ప్రజలకు మరో సూపర్ న్యూస్..! ఏడాదికి రూ.2.5 లక్షలు బెనిఫిట్ ఉచితంగానే!
టీటీడీలో కీలక నియామకాలు! ఏరి కోరి.. వారి మార్గదర్శకంలోనే ఇక!
ఏపీలో ఆ ఉద్యోగులందరికి పండగే పండగ..! కీలక ఉత్తర్వులు జారీ!
నారా రోహిత్‌పై కిడ్నాప్ ఆరోపణలు! సీఎంకు కంప్లైంట్ చేస్తానన్న మంచు మనోజ్!
శ్రీశైలం ఆలయం చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్పై వేటు! ఘటన వెలుగులోకి రావడంతో..
బాంబు పేలుళ్ల కుట్ర భగ్నం..! వెలుగులోకి సంచలన విషయాలు!
ఏపీలో త్వరలోనే నంది అవార్డులు! సినిమాలతో పాటు నాటక రంగానికి..!
అమెరికా ప్రయాణికులకు కీలక హెచ్చరిక! గడువు దాటితే తీవ్ర పరిణామాలు! శాశ్వత నిషేధం కూడా..
హర్భజన్ పై మండిపడుతున్న కోహ్లీ ఫ్యాన్స్.. సోషల్ మీడియాలో దుమారం!
గుల్జార్‌హౌస్ ప్రమాద ఘటనపై స్పందించిన మోదీ, ఏపీ సీఎం! మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటన!
ఏపీలో సీనియర్ సిటిజన్లకు బంపరాఫర్.. సర్కార్ కీలక నిర్ణయం! వాట్సాప్ ద్వారానే - అస్సలు మిస్ కాకండి!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: