నగరంలో బాంబు కలకలం రేగింది. బీసెంట్ రోడ్‌కు (Besant Road) బాంబ్ బెదిరింపు కాల్ వచ్చింది. కంట్రోల్ రూంకు గుర్తుతెలియని వ్యక్తి ఫోన్ చేసి బాంబ్ ఉన్నట్లు బెదిరించాడు. దీంతో వెంటనే పోలీసులు అప్రమత్తమయ్యారు. పోలీసులు, బాంబు స్క్వాడ్ బీసెంట్ రోడ్‌లో ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. బీసెంట్ రోడ్‌లోని షాపులు, తోపుడు బండ్లను బాంబ్ స్క్వాడ్ తనిఖీలు చేసింది. అయితే ఎక్కడా బాంబ్ ఉన్న ఆనవాళ్లు లేక పోవడంతో ప్రజలు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఎలాంటి బాంబు లేకపోవడంతో నేటి మధ్యాహ్నం నుంచి యధావిధిగా బీసెంట్ రోడ్‌లో వ్యాపారాలకు అనుమతి ఇచ్చారు పోలీసులు. అలాగే కంట్రోల్ రూమ్‌కు వచ్చిన ఫోన్‌కాల్‌పై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఫోన్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు చేశారు అనేదానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. అయితే విజయవాడలో ప్రముఖ వ్యాపార కేంద్రంగా ఉన్న బీసెంట్ రోడ్‌లో నిత్యం వేలాది మంది జనసంచారం ఉంటుంది. వందలాది షాపులు ఉదయం 10 గంటల నుంచి అందుబాటులో ఉంటాయి. అయితే ఈరోజు 9:30 గంటల ప్రాంతంలో విజయవాడ పోలీస్ కంట్రోల్ రూంకు ఫోన్ కాల్ వచ్చింది. ఫోన్ చేసిన ఓ అజ్ఞాత వ్యక్తి..
ఇది కూడా చదవండి: శ్రీవారి భక్తులకు తిరుపతిలో క్యూలైన్ షెడ్లు! నేడు కూటమి ప్రభుత్వంలో..
విజయవాడ బీసెంట్ రోడ్డులో బాంబులు పెట్టామని, మరికాసేపట్లో అవి పేలే అవకాశం ఉందని చెప్పి ఫోన్ కట్ చేశాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు వెంటనే బాంబ్ స్క్వాడ్‌ను రంగంలోకి దించారు. మొత్తం నాలుగు బృందాలుగా ఏర్పడి బందర్ రోడ్డు నుంచి ఏలూరు రోడ్డు వరకు కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. బీసెంట్ రోడ్డులు షాపులతో పాటు, తోపుడ బండ్లు కూడా ఎక్కువగా ఉంటాయి. దీంతో ప్రతీ బండిని బాంబ్ స్క్వాడ్ తనిఖీలు చేసింది. అయితే బాంబు ఉన్నట్టు ఎటువంటి ఆనవాళ్లు కనిపించడం లేదని పోలీసులు చెబుతున్నారు. తనిఖీలు ఇంకా కొనసాగుతున్నాయి. మరో రెండు గంటల పాటు బాంబు స్క్వాడ్ తనిఖీలు చేసే అవకాశం ఉంది. బాంబు కాల్ నేపథ్యంలో బీసెంట్ రోడ్డులో అన్ని షాపులను మూసి వేయించడంతో పాటు ఈ రోడ్డులో సామాన్య ప్రజలు, వ్యాపారులను ఎవరినీ కూడా రానీయకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు. బీసెంట్ రోడ్డులో భారీగా బందోబస్తును కల్పించారు. తనిఖీలు ముగిసే వరకు ఎటువంటి కార్యకలాపాలు నిర్వహించకూడదని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. తనిఖీలు ముగిసిన తర్వాత బాంబు కాల్‌పై పోలీసులు అధికారికంగా ప్రకటన చేసే అవకాశం ఉంది.
ఇది కూడా చదవండి: విజయవాడ విమానాశ్రయానికి మహర్దశ! ఇక నుండి అక్కడికి డైరెక్ట్ సర్వీసులు!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ఢిల్లీ పర్యటనలో ఏపీ సీఎం.. కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషితో చంద్రబాబు భేటీ!
హార్వర్డ్‌కు ట్రంప్ సర్కార్ షాక్! అంతర్జాతీయ విద్యార్థుల ప్రవేశంపై నిషేధం!
గోల్డ్ లవర్స్ ఇక కొనేసేయండి..! బంగారం ధర తగ్గిందోచ్.. ఎంతంటే.?
వైసీపీ మాజీ మంత్రికి అష్టదిగ్బంధన! లుక్ అవుట్ నోటీసులు జారీ!
వామ్మో.. భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. దెబ్బకు మళ్లీ లక్షకు చేరువలో!
స్కూల్ బస్సుపై సూసైడ్ బాంబ్! నలుగురు చిన్నారులు స్పాట్.. 38 మందికి సీరియస్!
జగన్‌ను కోర్టుకు రప్పిస్తా! అప్పటి వరకు నిద్రపోను!
విజయవాడలో మరో ఇంటిగ్రేటెడ్ బస్ టెర్మినల్..! పీఎన్‌బీఎస్‌పై తగ్గనున్న ఒత్తిడి!
ఢిల్లీ పర్యటనకు చంద్రబాబు.. నెల రోజుల్లో రెండోసారి! ఈసారి ఎందుకు వెళుతున్నారంటే?
ఖరీఫ్ సాగు లక్ష్యంగా మంత్రి అచ్చెన్న కీలక మార్గదర్శనం! రైతు సంక్షేమమే టార్గెట్!
టీటీడీలో కీలక నియామకాలు! ఏరి కోరి.. వారి మార్గదర్శకంలోనే ఇక!
ఏపీ రైతులకు శుభవార్త.. ఈ కార్డుతో ఎన్నో ప్రయోజనాలు! వెంటనే దరఖాస్తు చేయండి!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: