ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనకు వెళుతున్నారు. ఈ నెల 22 (గురువారం)న హస్తిన చేరుకుంటారు. ఈ నెల 23న ముఖ్యమంత్రి కేంద్ర మంత్రులతో సమావేశమవుతారు. రాష్ట్రంలో పెట్టుబడుల గురించి పారిశ్రామికవేత్తలతో కూడా చర్చిస్తారు. చంద్రబాబు 24న నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశంలో పాల్గొంటారు. రాష్ట్రానికి కేంద్రం నుంచి సహాయం కోరనున్నారు. నెల గ్యాప్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు రెండుసార్లు వెళ్లడం ఆసక్తికరంగా మారింది. చంద్రబాబు నాయుడు గురువారం ఢిల్లీ పర్యటనలో ఒకే రోజు ఏడుగురు కేంద్ర మంత్రులతో సమావేశం కానున్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రం సహాయం కోరనున్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం రాత్రికి ఢిల్లీ చేరుకుంటారు. శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు కేంద్ర మంత్రులతో సమావేశాలు జరుగుతాయి. ఏపీకి పెట్టుబడుల అంశంపై అదే రోజు రాత్రి పలువురు పారిశ్రామికవేత్తలతో కూడా సీఎం సమావేశం అవుతారు. 24వ తేదీన నీతి ఆయోగ్ 10వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో సీఎం చంద్రబాబు పాల్గొంటారు. ఈ పర్యటనలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ను చంద్రబాబు కలుస్తారని తెలుస్తోంది. గోదావరి - బనకచర్ల ఎత్తిపోతల పథకానికి సంబంధించిన ప్రీ-ఫీజుబిలిటీ రిపోర్టును ఆర్థికమంత్రికి అందజేస్తారు. బనకచర్ల పథకానికి అనుమతి ఇవ్వాలని కోరనున్నరు. ఈ ప్రాజెక్టుకు సంబధించి ఆర్థిక సహాయం కోసం ఇప్పటికే చంద్రబాబు రెండుసార్లు ఆర్థికమంత్రి నిర్మలను కలిశారు. అప్పుడు ఆమె డీపీఆర్ ఇవ్వాలని కోరారు. డీపీఆర్ తయారీకి సమయం పడుతుంది.. అందుకే ప్రీ-ఫీజుబిలిటీ రిపోర్టును (పీఎస్ఆర్) సిద్ధం చేయాలని చంద్రబాబు జలవనరుల శాఖను ఆదేశించారు. జలవనరుల శాఖ ఆ రిపోర్టును చేసింది.
చంద్రబాబు కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ, వినియోగదారుల వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషిని కలుస్తారు. ఆ తర్వాత కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్, కేంద్ర శాస్త్ర సాంకేతిక, సిబ్బంది వ్యవహారాల సహాయ మంత్రి జితేంద్రసింగ్‌తో సమావేశమవుతారు. సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సమావేశం కానున్నారు. ఆ తర్వాత కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో సీఎం చంద్రబాబు భేటీ అవుతారని చెబుతున్నారు. మరోవైపు చంద్రబాబు ఇవాళ చిత్తూరు జిల్లా కుప్పంలో పర్యటించనున్నారు. ప్రసన్న తిరుపతి గంగమ్మ జాతర సందర్భంగా మధ్యాహ్నం ఆయన కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకుంటారు. సాయంత్రం తిరిగి అమరావతి చేరుకుంటారు. మొత్తానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ పర్యటన ఆసక్తికరంగా మారింది. మంత్రి లోకేష్ కూడా ఇటీవల కుటుంబసమేతంగా ఢిల్లి వెళ్లి ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన సంగతి తెలిసిందే.
ఇది కూడా చదవండి: ఏపీలో ఆర్టీసీ ప్రయాణికులకు ఇకపై నో టెన్షన్..! విమానాల తరహాలో బస్సుల్లో కూడా..!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ఏపీలో ఆ ఉద్యోగులందరికి పండగే పండగ..! కీలక ఉత్తర్వులు జారీ!
ఏపీలో రేషన్ కార్డులు ఉన్నవారికి గుడ్‌న్యూస్..! వచ్చే నెల నుంచి ఆ రూల్ రద్దు?
ఎన్నారైలకు షాక్! యూఎస్ నుంచి సొమ్ము పంపితే అదనపు భారం!
వైసీపీకి దిమ్మతిరిగే షాక్.. వల్లభనేని వంశీపై మరో కేసు! ఇక పర్మినెంట్ గా జైల్లోనేనా.?
ఈ-పాస్‌పోర్ట్ వచ్చేసింది! విదేశాంగ శాఖ కీలక నిర్ణయం!
లోకేశ్ తాజాగా కీలక సూచనలు.. అందరూ అలా చేయండి! అమ్మ లాంటి పార్టీని మరచిపోవద్దు!
మెగా డీఎస్సీ గడువు పొడగింపుపై మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు..! అభ్యర్థులకు ఊహించని..!
ఎవ్వరూ మాట్లాడొద్దు..! లిక్కర్ స్కాంపై సీఎం ఆర్డర్స్!
ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. అతి తక్కువ ధరకే ఫైబర్ నెట్.. ఆ వివరాలు మీకోసం!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: