మాజీ మంత్రి కొడాలి నానిపై లుక్ అవుట్ సర్క్యులర్ జారీ అయింది. దేశంలోని అన్ని విమానాశ్రయాలు, పోర్టులకు సర్క్యులర్ పంపించారు. నానిపై ఇప్పటికే పలు కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ఆయన దేశం విడిచి వెళ్లకుండా ఏపీ పోలీసులు ఆయనకు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు.
మాజీ మంత్రి కొడాలి నాని ఇటీవల ముంబైలో గుండెకు ఆపరేషన్ చేయించుకున్నారు. ఆయన అమెరికా వెళ్తారని ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో ఆయనకు లుక్ ఔట్ సర్క్యులర్ జారీచేయాలని పోలీసులు నిర్ణయించారు. ఇప్పటికే ఆన్‌లైన్ ద్వారా LOC జారీ చేశారు. తాజాగా కొడాలి నానికి లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. ఈ మేరకు దేశంలోని అన్ని విమానాశ్రయాలు, పోర్టులకు సర్క్యులర్ పంపించారు. ఈ నోటీసులు ఆన్‌లైన్ విధానం ద్వారా అన్ని ఎయిర్ పోర్టులు, ఓడరేవులకు అందాయి. కొడాలి నానిపై ఇప్పటికే పలు కేసులు నమోదయ్యాయి. దీంతో ఆయన దేశం విడిచి వెళ్లకుండా లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు ఏపీ పోలీసులు.
ఇది కూడా చదవండి: ఏపీలో ఎంట్రీ ఇచ్చిన కరోనా.. తొలి కేసు నమోదు! ఎక్కడంటే!
కొడాలి నానిపై నమోదైన కేసుల విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఆయన కదలికపై నిఘా పెట్టాలని డీజీపీకి టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కె. శ్రీనివాస్ ఫిర్యాదు చేశారు. కొడాలి నాని అమెరికా వెళ్లకుండా ఆయన పాస్ పోర్టు సీజ్ చేయాలని కోరారు. దీనిపై కృష్ణా జిల్లా ఎస్పీ ఆర్. గంగాధరరావు ప్రస్తుతం పరిశీలన చేస్తున్నట్లు సమాచారం.
కొడాలి నానికి రాష్ట్రంలో పాస్‌పోర్టు లేనట్లు సమాచారం. అయితే హైదరాబాద్ చిరునామాతో పాస్‌పోర్టును పొంది ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆయన అమెరికా వెళ్తారని జోరుగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో తాజాగా కొడాలి నానికి ఏపీ పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు.
ఇది కూడా చదవండి: ఏపీలో కొత్త నేషనల్ హైవే నాలుగు లైన్లుగా.. ఈ రూట్‌లో భూసేకరణ! ఇక 8 గంటల్లో విశాఖ!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
అది నిజం కాకపోతే జగన్ రాజీనామా చేస్తారా? టీడీపీ నేత సవాల్!
దివ్యాంగులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు..! ఇళ్ల కేటాయింపులో రిజర్వేషన్!
తెలుగు రాష్ట్రాలకు కృష్ణా జలాలు! కేఆర్ఎంబీ కీలక ఉత్తర్వులు!
ఏపీలో ఆ ఉద్యోగులందరికి పండగే పండగ..! కీలక ఉత్తర్వులు జారీ!
హైదరాబాద్‌లో మయన్మార్ వాసుల కలకలం..! నకిలీ పత్రాలతో ఆధార్, పాన్!
ఏపీ రైతులకు శుభవార్త.. ఈ కార్డుతో ఎన్నో ప్రయోజనాలు! వెంటనే దరఖాస్తు చేయండి!
ఏపీ ప్రజలకు మరో సూపర్ న్యూస్..! ఏడాదికి రూ.2.5 లక్షలు బెనిఫిట్ ఉచితంగానే!
టీటీడీలో కీలక నియామకాలు! ఏరి కోరి.. వారి మార్గదర్శకంలోనే ఇక!
అసైన్డ్ భూముల ఫ్రీహోల్డ్ పై మంత్రివర్గ కీలక నిర్ణయాలు! ఇక నుండి ఇలా...!
పాఠశాలల్లో రోజూ ఒక గంట యోగా తప్పనిసరి! సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం!
విమానానికి త్రుటిలో తప్పిన ఘోర ప్రమాదం! 160 మంది ప్రయాణికులతో..
అన్నదాత సుఖీభవ' నిధులు జమ అప్పుడే..! తాజా నిర్ణయంతో..!
ఢిల్లీ పర్యటనకు చంద్రబాబు.. నెల రోజుల్లో రెండోసారి! ఈసారి ఎందుకు వెళుతున్నారంటే?
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: