రాష్ట్రవ్యాప్తంగా రాఖీ పౌర్ణమి వేడుకలు ఉత్సాహభరితంగా జరుగుతున్నాయి. అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్లు ఆనందంగా ఈ పండుగను జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలుగు ప్రజలందరికీ, ముఖ్యంగా సోదరీమణులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’లో ఆయన పేర్కొంటూ —
"నా తెలుగింటి ఆడపడుచులకు, ప్రియమైన అక్కాచెల్లెళ్లకు రాఖీ పండుగ శుభాకాంక్షలు. అన్నాచెల్లెళ్ల మమకారాన్ని ప్రతిబింబిస్తూ, ‘నీ కోసం నేనున్నాను’ అనే భరోసాను ఇచ్చే శుభదినం రాఖీ పౌర్ణమి. అందుకే ఇది మనందరికీ ప్రత్యేకం. మీ అందరికీ అన్నగా రక్షణ కల్పించి, మీ జీవితాలను వెలుగులతో నింపే బాధ్యత నాది అని ఈ రాఖీ సందర్భంగా మరోసారి చెబుతున్నాను. ఆడబిడ్డల సంక్షేమం కోసం అహర్నిశలూ కృషి చేస్తానని హామీ ఇస్తూ, మరోసారి రాఖీ పండుగ శుభాకాంక్షలు" అని తెలిపారు.