ఇండియన్ ఎలక్ట్రిక్ టూ-వీలర్ మార్కెట్‌లో వేగంగా ఎదుగుతున్న బ్రాండ్‌లలో జెలియో ఎలక్ట్రిక్ (Zelio Electric) ఒకటి. తాజాగా ఈ కంపెనీ అందరినీ ఆశ్చర్యపరుస్తూ, అత్యంత సరసమైన ధరలో కొత్త Knight+ (నైట్+) ఎలక్ట్రిక్ స్కూటర్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే – దీని ధర ఒక ఆపిల్ ఐఫోన్ 15 కంటే కూడా తక్కువ! నగరాలు, చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఈ స్కూటర్‌ను డిజైన్ చేశారు.
ధర & బ్యాటరీ వివరాలు…. కొత్త నైట్+ ఎక్స్-షోరూమ్ ధర కేవలం రూ.59,990 మాత్రమే. 1.8 kWh పోర్టబుల్ LFP బ్యాటరీతో ఇది వస్తుంది. ఒకసారి పూర్తి ఛార్జ్ చేస్తే దాదాపు 100 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. బ్యాటరీ పోర్టబుల్ కావడంతో ఇంట్లోనే సులభంగా ఛార్జ్ చేసుకోవచ్చు.
పర్ఫార్మెన్స్… 1.5 kW మోటార్ గరిష్టంగా గంటకు 55 kmph వేగం అందిస్తుంది. తక్కువ ధర ఉన్నప్పటికీ, ఈ స్కూటర్‌లో అనేక అడ్వాన్స్డ్ ఫీచర్లు ఉన్నాయి.
ప్రత్యేక ఫీచర్లు… హిల్ హోల్డ్ కంట్రోల్ – ఎత్తైన లేదా వాలుగా ఉన్న ప్రదేశాల్లో వెనక్కి జారకుండా సేఫ్‌గా స్టార్ట్ అవుతుంది.
క్రూయిజ్ కంట్రోల్ – పొడవు ప్రయాణాల్లో స్థిరమైన వేగాన్ని కొనసాగించడానికి… ఫాలో-మీ-హోమ్ హెడ్‌ల్యాంప్స్ – పార్క్ చేసిన తర్వాత కూడా కొద్దిసేపు వెలుగుని అందించడంలో సహాయపడతాయి. USB ఛార్జింగ్ పోర్ట్ – మొబైల్ లేదా గాడ్జెట్‌లను ప్రయాణంలోనే ఛార్జ్ చేసుకోవడానికి.
కలర్ ఆప్షన్స్… మొత్తం 6 రంగులలో అందుబాటులో ఉంది: సింగిల్ టోన్ – గ్లోస్ వైట్, గ్లోస్ బ్లాక్
డ్యూయల్ టోన్ – మ్యాట్ బ్లూ & వైట్, మ్యాట్ రెడ్ & వైట్, మ్యాట్ ఎల్లో & వైట్, మ్యాట్ గ్రే & వైట్
బుకింగ్ & డెలివరీ.. ఈ స్కూటర్ ఇప్పటికే అన్ని జెలియో ఎలక్ట్రిక్ డీలర్‌షిప్‌లలో బుకింగ్‌ల కోసం అందుబాటులో ఉంది. ఆగస్టు 20, 2025 నుండి డెలివరీలు ప్రారంభం కానున్నాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం, తక్కువ ధరలో మంచి రేంజ్ మరియు ఫీచర్లతో కూడిన ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం చూస్తున్న వారికి ఇది ఉత్తమ ఎంపిక.