ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్ పెట్టింది – పవర్ బ్యాంక్ తీసుకెళ్లొచ్చు కానీ ఫ్లైట్‌లో ఛార్జ్ చేయడం, లేదా దాంతో ఫోన్ ఛార్జ్ పెట్టుకోవడం కుదరదు.
ఎందుకు ఇలా? … పవర్ బ్యాంక్‌లో లిథియం-అయాన్ బ్యాటరీ ఉంటుంది. అది ఎక్కువ వేడి అయితే మంటలు, పొగ, లేదా పేలుడు కూడా జరగొచ్చు. విమానంలో ప్రెజర్, టెంపరేచర్ మార్పులు వలన ఈ రిస్క్ మరింత పెరుగుతుంది. FAA రిపోర్ట్ ప్రకారం 2024లో ప్రతి రెండు వారాలకు 3 బ్యాటరీ ఓవర్‌హీట్ ఘటనలు జరిగాయి, 2018లో అయితే వారానికి ఒకదానికంటే తక్కువే ఉండేవి.
ఓవర్‌హీట్ అవడానికి కారణాలు: సూర్యకాంతి నేరుగా పడటం, గాలి రాకపోవడం (పూర్ వెంచిలేషన్), ఓవర్ చార్జింగ్, డామేజ్ అవ్వడం.
ఈ పరిస్థితుల్లో థర్మల్ రన్‌వే అనే రియాక్షన్ మొదలై ఒక్క బ్యాటరీ సెల్ వేడెక్కి మిగతావి కూడా వరుసగా దెబ్బతింటాయి. దీని వలన 1000°C వరకు వేడి, మంటలు, టాక్సిక్ పొగ వస్తాయి.
కొన్ని లో క్వాలిటీ పవర్ బ్యాంక్‌లలో లోపల సేఫ్టీ మెకానిజంలు ఉండవు. అందుకే మంచి బ్రాండ్, సర్టిఫికేషన్ ఉన్న పవర్ బ్యాంక్‌లే వాడాలి.
సేఫ్టీ టిప్స్: ఓవర్‌హెడ్ బిన్‌లో బాగా నొక్కి పెట్టొద్దు. ఛార్జ్ పెట్టేటప్పుడు గాలి రాని ప్రదేశంలో పెట్టొద్దు.. గీతలు, వాసన, లేదా ఎక్కువ వేడి ఉంటే వెంటనే వాడడం ఆపేయండి. ఫిజికల్ డ్యామేజ్ అయితే వెంటనే రీప్లేస్ చేయండి.
ఇప్పుడు కొత్త టెక్నాలజీతో లిథియం-అయాన్ లేకుండా కూడా పవర్ బ్యాంక్‌లు వస్తున్నాయి — వీటిలో నికెల్-మెటల్ హైడ్రైడ్, అల్కలైన్ బ్యాటరీలు, క్యాపాసిటర్లను వాడుతున్నారు. ఇవి రిస్క్ తక్కువ.