వర్షాకాలంలో బట్టలు సకాలంలో ఆరడం చాలామందికి కష్టసాధ్యమే. గాలిలో తేమ ఎక్కువగా ఉండటం వల్ల రోజంతా ఆరబెట్టినా, బట్టలు ఇంకా తడి తడిగానే ఉంటాయి. ఆ తేమ వల్ల కొంతసేపటికి దుర్వాసన కూడా వస్తుంది. ఈ సమయంలో వాషింగ్ మెషీన్ డ్రైయర్ ఉపయోగించాలని అనిపించినా, అది అందరికీ సాధ్యం కాని విషయం. అలాంటి పరిస్థితుల్లో ఇంట్లోనే సులభంగా అమలు చేయగల కొన్ని చిట్కాలు మీకు సహాయపడతాయి.
స్మార్ట్‌గా వేలాడదీయడం.. బట్టలను ఒకదానికొకటి కూర్చి ఉంచే బదులుగా, వాటి మధ్య తగినంత దూరం ఉంచి వేలాడదీయండి. ఇలా చేస్తే గాలి సులభంగా చొరబడి, బట్టలు త్వరగా ఆరిపోతాయి. ఒకే లైన్‌లో గట్టిగా వేలాడదీయడం కంటే హ్యాంగర్‌లు లేదా ప్రత్యేక స్టాండ్‌లను ఉపయోగించడం మంచిది.
హెయిర్ డ్రైయర్ వాడకం… పూర్తిగా తడిగా లేని దుస్తులను తక్కువ సమయంలో ఆరబెట్టడానికి హెయిర్ డ్రైయర్ చాలా ఉపయోగకరం. ముఖ్యంగా కాలర్లు, స్లీవ్‌లు లేదా కొన్ని ప్రత్యేక భాగాలను వేగంగా ఆరబెట్టడానికి ఇది బెస్ట్ ఆప్షన్. వేడి గాలి కారణంగా బట్టలు తక్షణమే పొడుస్తాయి.
టవల్ ట్రిక్… తడి బట్ట కింద ఒక పొడి టవల్ ఉంచి, దానిపై మరో టవల్‌తో కప్పి ఇస్త్రీ చేయండి. టవల్ అదనపు తేమను పీల్చుకుంటుంది, ఇస్త్రీ వేడి వల్ల వస్త్రం త్వరగా ఆరుతుంది.
ఫ్యాన్ కింద ఆరబెట్టడం… ఇంట్లో గాలి సరిగా రానప్పుడు, బట్టలను నేరుగా ఫ్యాన్ కింద ఉంచండి. స్టాండ్ లేదా హ్యాంగర్ సాయంతో బట్టలు అన్ని వైపుల నుంచి గాలికి తగిలేలా ఉంచండి. వీలైతే ఎగ్జాస్ట్ ఫ్యాన్ లేదా డీహ్యూమిడిఫైయర్ ఉపయోగించడం మరింత వేగంగా ఆరడానికి సహాయపడుతుంది.
ఈ చిట్కాలను పాటిస్తే వర్షాకాలంలో బట్టలు ఆరబెట్టడం పెద్ద సమస్య కాకుండా మారుతుంది. సులభంగా, తక్కువ సమయంలో, ఖర్చు లేకుండా దుస్తులు పొడవచ్చు. దుర్వాసన రాకుండా ఉంచవచ్చు.
(గమనిక: ఈ సమాచారం ఇంటర్నెట్‌లో లభ్యమైన వివరాల ఆధారంగా మీకు అందించబడింది. ఇవి కేవలం అవగాహన కోసం మాత్రమే. వాటి ఉపయోగం వల్ల కలిగే ఫలితాలకు andhrapravasi బాధ్యత వహించదు.)