AICTE ప్రగతి స్కాలర్‌షిప్ స్కీమ్ అనేది ఇంజనీరింగ్ లేదా డిప్లొమా చదవాలనుకునే బాలికలకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఓ అద్భుతమైన ఆర్థిక సహాయ పథకం. AICTE (All India Council for Technical Education) ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ స్కీమ్ ద్వారా ప్రతి సంవత్సరం రూ.50,000 స్కాలర్షిప్ అందుతుంది. దీని కోసం కుటుంబ వార్షిక ఆదాయం రూ.8 లక్షల లోపు ఉండాలి. ఒక కుటుంబానికి గరిష్టంగా ఇద్దరు బాలికలు మాత్రమే ఈ పథకానికి అర్హులు. ఈ స్కాలర్షిప్‌ను కళాశాల ఫీజు, స్టేషనరీ, పుస్తకాలు, కంప్యూటర్ కొనుగోలు వంటి విద్యా అవసరాలకు ఉపయోగించవచ్చు. అయితే హాస్టల్ ఖర్చులకు మాత్రం దీనిని వాడలేరు. విద్యార్థిని మొదటి సంవత్సరం నుంచి నాలుగు సంవత్సరాల పాటు (లేదా లాటరల్ ఎంట్రీ అయితే 3 ఏళ్లు) ఈ సహాయం అందించబడుతుంది.
ఇది కూడా చదవండి: భారతీయ విద్యార్థులపై అమెరికా మరో బాంబ్! అలా చేసినా వీసా రద్దు!
ఈ స్కాలర్షిప్ కోసం దరఖాస్తు చేయాలంటే 10వ తరగతి, 12వ తరగతి మార్కుల షీట్లు, ఆధార్ కార్డు, కుటుంబ ఆదాయ ధృవీకరణ పత్రం, బ్యాంక్ ఖాతా వివరాలు వంటి కీలక డాక్యుమెంట్లు అవసరం. ఈ పథకం వెనుక ఉద్దేశం దేశంలోని బాలికలు టెక్నికల్ విద్యను కొనసాగించడంలో ఆర్థికంగా వెనుకబడకుండా ఉండడం. రూ. 2 లక్షల వరకూ స్కాలర్షిప్ ప్రయోజనం పొందే అవకాశం ఉన్న ఈ స్కీమ్ మీ చదువు భారం తగ్గించి, కెరీర్‌ను మెరుగుపరిచే మార్గాన్ని చూపుతుంది. కనుక అర్హత ఉన్న ప్రతి విద్యార్థిని దీన్ని నిర్లక్ష్యం చేయకుండా తప్పకుండా దరఖాస్తు చేయాలి. ఇది మీ భవిష్యత్‌ను మలిచే టర్నింగ్ పాయింట్ కావచ్చు.
ఇది కూడా చదవండి: విజయవాడ విమానాశ్రయానికి మహర్దశ! ఇక నుండి అక్కడికి డైరెక్ట్ సర్వీసులు!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ఏపీ పోలీసు బాస్‌గా అయన నియమకం! ఇక పూర్తిస్థాయి డీజీపీ!
సిరిసిల్లలో ముదిరిన ప్రోటోకాల్ వివాదం..! నేతల అరెస్టుతో ఉద్రిక్తత!
అవును ఆ ఇంటికి వెళ్లాను..! వైసీపీ వీడియోపై విజయసాయి రెడ్డి సంచలన ట్వీట్!
లోకేశ్‌కు పార్టీలో ఆ పదవి.. జోరుగా చర్చ! జీవీ, ఆనం కీలక వ్యాఖ్యలు!
ప్రపంచంలో టాప్-10 వైమానిక దళాలు ఇవే! భారత్ స్థానం ఎక్కడంటే?
కేసీఆర్ కు కవితకు మధ్య గ్యాప్ వెనుక కారణం ఇదే! చేసింది అంతా ఆయనే!
ప్రధాని మోదీ అధ్యక్షతన ఎన్డీయే సీఎంలు, డిప్యూటీ సీఎంల భేటీ.. చేసిన తీర్మానాలు ఇవే!
జంట హత్యల కేసులో ఊహించని ట్విస్ట్.. వైసీపీ మాజీ ఎమ్మెల్యే బ్రదర్స్ పై కేసు నమోదు!
రెండు రోజుల పోలీస్ కస్టడీకి పీఎస్ఆర్, మధు! ఆంజనేయులపై ప్రశ్నల వర్షం..
ప్రధానికి కృతజ్ఞతలు తెలియజేసిన ఏపీ సీఎం చంద్రబాబు.. ఇవాళ మన్ కీ బాత్ కార్యక్రమం!
వైసీపీకి మరో భారీ షాక్! ఏపీ పోలీసుల అదుపులో మాజీ మంత్రి!
నిరుద్యోగులకు గుడ్ న్యూస్! నెలకు 2 లక్షల జీతంతో.. భారీ నోటిఫికేషన్!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: