ప్రపంచ యాత్రలు చేస్తూ, తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా తెలుగు ప్రజలకు సుపరిచితుడైన యూట్యూబర్ అన్వేష్‌పై సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు కేసు నమోదు చేశారు. రాష్ట్ర ప్రభుత్వంలోని ఉన్నతాధికారులపై తీవ్ర ఆరోపణలు చేస్తూ, అవాస్తవ సమాచారంతో కూడిన వీడియోను ప్రచారం చేశారనే అభియోగంపై పోలీసులు సుమోటోగా ఈ కేసును స్వీకరించారు. తెలంగాణ డీజీపీ జితేందర్, హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, సీనియర్ ఐఏఎస్ అధికారులు శాంతికుమారి, దానకిశోర్, వికాస్‌రాజ్ తదితరులు హైదరాబాద్ మెట్రోలో బెట్టింగ్ యాప్‌ల ప్రచారానికి అనుమతులు ఇచ్చే నెపంతో రూ.300 కోట్లు అక్రమంగా ఆర్జించారని ఆరోపిస్తూ అన్వేష్ తన యూట్యూబ్ చానెల్‌లో ఓ వీడియోను పోస్ట్ చేశాడు.
ఇది కూడా చదవండి: ఏపీ ప్రజలకు శుభవార్త! రూ.3,716 కోట్లతో.. ఆ రూట్లో ఆరు లైన్లుగా నేషనల్ హైవే!
ఈ వీడియోలో చేసిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని, తప్పుడు సమాచారంతో కూడినవని సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. సైబర్ క్రైం పోలీస్ స్టేషన్‌కు చెందిన ఓ కానిస్టేబుల్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఈ ఎఫ్‌ఐఆర్ నమోదైంది. సదరు వీడియో ప్రజల్లో గందరగోళం సృష్టించే ఉద్దేశంతో ఉందని, ప్రభుత్వ అధికారులు, చట్టబద్ధమైన సంస్థల ప్రతిష్ఠను దెబ్బతీసేలా, వారి పరువుకు భంగం కలిగించేలా ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. అధికారుల విశ్వసనీయతను ప్రశ్నించేలా, ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత, ద్వేష భావాలను రెచ్చగొట్టేలా ఆ వీడియో ఉందని పోలీసులు అభిప్రాయపడ్డారు. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తిచేసిన కంటెంట్ క్రియేటర్ అన్వేష్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు. అన్వేష్ ప్రపంచంలోని పలు దేశాలు పర్యటిస్తూ, అక్కడి సంస్కృతి, సంప్రదాయాలు, జీవన విధానం వంటి విశేషాలను తన వీడియోల ద్వారా వివరిస్తూ యూట్యూబ్‌లో గణనీయమైన ఆదరణ పొందాడు.
ఇది కూడా చదవండి: పలు నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసిన సీఎం చంద్రబాబు! లిస్ట్ ఇదుగోండి..
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
సంచలన నిర్ణయం తీసుకున్న OYO హోటల్స్.. మరో కొత్త కాన్సెప్ట్‌తో - ఇక వారికి పండగే..
నిరుద్యోగులకు శుభవార్త.. నెలకు రూ.60 వేల జీతం.. దరఖాస్తుకు మే 13 చివరి తేదీ!
ఇక బతకలేను.. నా చావుకు కారణం వాళ్లే! ఢీ ఫేమ్ జాను కన్నీటి వీడియోతో కలకలం!
కూటమి ప్రభుత్వ రాకతో అమరావతి బంగారు బాట! ఇకపై ప్రతి ఆంధ్రుడు..
షాకింగ్ న్యూస్.. తెలుగు యూట్యూబర్ అనుమానాస్పద మృతి.. అతనే కారణమా?
గుడ్ న్యూస్! ఏపీలోనూ మెట్రోకు గ్రీన్ సిగ్నల్! ఎక్కడంటే?
గన్నవరం ఎయిర్‌పోర్టులో మరోసారి కలకలం.. ఈసారి ఏం జరిగిందంటే!
ప్రయాణించేవారికి శుభవార్త.. అమరావతికి సూపర్ ఫాస్ట్ కనెక్టివిటీ.. సిద్ధమైన కృష్ణా నదిపై వారధి!
అకౌంట్లలో డబ్బు జమ.. 1 లక్ష రుణమాఫీ. ప్రభుత్వం ఆదేశాలు.! గైడ్‌లైన్స్ విడుదల!
రూ.500 నోట్లకు ఏమైంది.. ఇక ఎటిఎంలలో 100, 200 నోట్లు.. RBI కీలక నిర్ణయం..!
మాజీ మంత్రి బిగ్ షాక్.. విచారణ ప్రారంభం! వెలుగులోకి కీలక ఆధారాలు..
ఏపీ యువతకు గుడ్ న్యూస్.. యునిసెఫ్‌తో ప్రభుత్వం ఒప్పందం.. 2 లక్షల మందికి లబ్ధి..
అద్భుతమైన స్కీం.. మీ భార్య మిమల్ని లక్షాధికారిని చేయొచ్చు.. ఈ చిన్న పని తో..
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: