Kajal Aggarwal: నాకు ఎలాంటి యాక్సిడెంట్ జరగలేదు.. కాజల్ అగర్వాల్ క్లారిఫికేషన్!

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం పెద్ద ఎత్తున సిద్ధమవుతోంది. ఇప్పటికే ఈ ఎన్నికలపై ప్రభుత్వం దృష్టి సారించాలని లేఖ రాసిన ఎస్ఈసీ, మంగళవారం కీలక సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా రాష్ట్ర పంచాయతీరాజ్‌, మున్సిపల్ శాఖల సెక్రటరీలతో ఎస్ఈసీ నీలం సాహ్ని చర్చలు జరిపారు. ఎన్నికల నిర్వహణ, ఈవీఎంల కొనుగోలు వంటి అంశాలపై విస్తృతంగా చర్చ జరిగింది.

Buy products: 22 తర్వాతే కొనుగోలు చేయాలా.. వినియోగదారులకు ఊరట, మార్కెట్‌కు ఊపిరి!

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు నాలుగు దశల్లో నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని ప్రకటించారు. ఈవీఎంల వాడకంపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు కొనసాగుతున్నాయని ఆమె చెప్పారు. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్ రాష్ట్రాల్లో స్థానిక ఎన్నికలు ఈవీఎంల ద్వారా విజయవంతంగా నిర్వహించారని గుర్తు చేశారు. ఎన్నికల కోసం కావాల్సిన యూనిట్ల కొనుగోలు, వినియోగంపై త్వరలో తుది నిర్ణయం తీసుకోనున్నట్లు వెల్లడించారు.

AP Housing scheme: ఏపీలో వారందరికీ గుడ్ న్యూస్! ఒక్కొక్కరికి రూ.2.50 లక్షల సాయం! ఎన్నో ఏళ్ల కల!

ఎన్నికలను ముందస్తుగానే అంటే 2026 జనవరిలో నిర్వహించేందుకు ఎన్నికల సంఘం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా 1,37,671 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు. ఎన్నికలకు 41,301 కంట్రోల్ యూనిట్లు, 82,602 బ్యాలెట్ యూనిట్లు అవసరమవుతాయని ఎస్ఈసీ తెలిపారు. ఒక కంట్రోల్ యూనిట్‌కు రెండు బ్యాలెట్ యూనిట్లు అనుసంధానం చేయవచ్చని వివరించారు.

AP Investments: ఏపీకి పెట్టుబడుల వెల్లువ! రూ.6 వేల కోట్లతో మెగా పరిశ్రమ! ఎక్కడంటే?

స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ కూడా ఖరారు చేశారు. అక్టోబర్ 15లోగా వార్డుల పునర్విభజన, రిజర్వేషన్లు పూర్తి చేయాలి. అక్టోబర్ 16 నుంచి నవంబర్ 15లోపు ఓటర్ల జాబితా సిద్ధం చేసి ప్రచురించాలి. నవంబర్ 1 నుంచి 15లో ఎన్నికల అధికారుల నియామకం జరుగుతుంది. నవంబర్ 16 నుంచి 30 మధ్య పోలింగ్ కేంద్రాల ఖరారు, ఈవీఎంల సేకరణ పూర్తిచేయాలి. డిసెంబర్ 15లోపు రిజర్వేషన్లు ఖరారవుతాయి. డిసెంబర్ చివరి వారంలో రాజకీయ పార్టీలతో భేటీలు జరగనుండగా, 2026 జనవరిలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసి అదే నెలలో ఫలితాలు ప్రకటిస్తారు.

New Cars: కొత్త కారు కొనాలనుకునేవారికి శుభవార్త.. కియా కార్లపై ధరలు భారీగా తగ్గాయి! ఏ మోడల్‌పై ఎంతంటే?
New Brain Cells: కొత్త మెదడు కణాలు పెరగాలంటే ఏ వ్యాయామం చేయాలి? శాస్త్రవేత్తల సెన్సేషనల్ ఫైండింగ్స్!
Nara Lokesh Post: ఆ బాధ ఇప్పటికీ ఉంది.. సంకల్పం మరింత బలపడింది! రెండేళ్ల క్రితం - ఇదే రోజున.!
Gold prices hit: బంగారం ధరల కొత్త రికార్డు.. తొలిసారి లక్ష దాటిన!
Mallareddy: తిరుమల దర్శనంలో మల్లారెడ్డి.. ఏపీ అభివృద్ధిపై ప్రశంసలు!
AP Govt: 5 వేల మంది పోలీసులు.. త్వరలో సోషల్ మీడియాపై.! హోంమంత్రి సంచలన వ్యాఖ్యలు!