ఇది కూడా చదవండి: highway: ఏపీలో ఆ హైవేను ఆరు లైన్లుగా.. ఈ రూట్‌లోనే, కేంద్రానికి చంద్రబాబు లేఖ..! ఆ ప్రాంతం దశ తిరిగినట్లే..!

ఆంధ్రప్రదేశ్(AndhraPradesh) ప్రభుత్వం తల్లికి వందనం(Talliki vandanam) పథకాన్ని సీరియస్‌గా అమలు చేసింది. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగానే.. అర్హులైన కుటుంబంలో ఎంత మంది పిల్లలు ఉంటే.. అంతమందికీ డబ్బు అకౌంట్లలో జమ చేసింది. ఇలా రాష్ట్రవ్యాప్తంగా తల్లుల డబ్బు జమ చేసే ప్రక్రియ పూర్తైంది. ఐతే.. ఎవరికైనా డబ్బు జమ కాకపోతే, గ్రామ లేదా వార్డు సచివాలయానికి వచ్చి కంప్లైంట్ ఇవ్వొచ్చని విద్యా శాఖ మంత్రి నారా లోకేష్(Nara Lokesh) చెప్పారు. ఆ గడువు ఇవాళ్టితో ముగుస్తుంది. జూన్ 26 వరకు గడువు ఉందని మంత్రి తెలిపారు.

ఇవాళ్టితో గడువు ముగిశాక.. రేపటి నుంచి కంప్లైంట్ల పరిశీలన మొదలవుతుంది. ఈ పథకాన్ని జూన్ 12న ప్రారంభించారు. జూన్ 14 వరకూ.. అకౌంట్లలో డబ్బు జమ చేశారు. జూన్ 16 నుంచి కంప్లైంట్ల స్వీకరణ ప్రారంభించారు. డబ్బు జమ కానివారు, కొత్తగా స్కూల్లో పిల్లల్ని చేర్పించిన వారు, కొత్తగా ఇంటర్‌లో చేర్పించిన వారూ.. ఈ పథకంలో తమ పేర్లు చేర్చాలని కోరుతూ.. సచివాలయాల్లో కోరారు. ఇలా కోరేందుకు గురువారం (జూన్ 26) వరకే అవకాశం ఉంది. వచ్చిన ఫిర్యాదులను పరిశీలించిన తర్వాత.. అర్హులు అని తేలితే, జూన్ 30 నుంచి అకౌంట్లలో డబ్బు జమ చేస్తారు.

ఇది కూడా చదవండి: Paytm UPI: పేటీఎంలో కొత్త ఫీచర్స్! వెంటనే తెలుసుకోండి.. లేకపోతే అంతే!

తద్వారా జులై మొదటి వారం నాటికి ఈ ప్రక్రియ మొత్తం పూర్తవుతుందని అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా కొత్తగా స్కూళ్లలో, ఇంటర్‌లో చేరేవారికి డబ్బు జమ చేసే విషయంలో కొంత ఆలస్యం కావచ్చు. ఎందుకంటే వారికి సంబంధించిన డాక్యుమెంట్ల(Documents)ను ఇప్పుడు కొత్తగా పరిశీలించాల్సి ఉంటుంది. సంవత్సర కాలంగా.. ఈ పథకం అమలు కావట్లేదని తల్లులు ఎదురుచూస్తూ వచ్చారు. ప్రతిపక్ష వైసీపీ కూడా ఇది అమలు కావట్లేదని విమర్శలు చేసింది. ఇది సూపర్ సిక్స్ పథకాల్లో ఒకటి కావడంతో.. దీనిపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

పైగా ఎంతమంది పిల్లలు ఉంటే, అంతమందికీ ఇస్తారా అని ప్రజలు ఎదురుచూశారు. అందరు పిల్లలకూ ఇవ్వడంతో.. ప్రతిపక్షానికి ఇది షాక్‌లా మారింది. ఇదివరకు సీఎంగా వైఎస్ జగన్.. ప్రజలను మోసం చేశారు. అమ్మఒడి పథకంలో ఎంత మంది పిల్లలు ఉంటే, అంతమందికీ ఇస్తామన్న ఆయన.. అధికారంలోకి వచ్చాక, ఇంటికి ఒక విద్యార్థికే డబ్బు ఇచ్చి, ప్రజలను నిరాశ పరిచారు. ఈ కారణంగా చాలా ఇళ్లలో ఇద్దరు పిల్లలు ఉంటే.. ఒకరికే మనీ వచ్చి, మరొకరికి నిరాశ కలిగేది. ఆ పిల్లల మనసుపై అది చెడు ప్రభావం చూపేది. విద్యాశాఖ మంత్రిగా ఇది నారా లోకేష్‌(Nara Lokesh)కి కీలకమైన ప్లస్ పాయింట్ అయ్యింది.

ఇది కూడా చదవండి: Real Estate Fraud: వైసీపీ నేత కుమారుడి నయా దందా.. రూ.8 కోట్లతో పరార్! అరెస్టు చేసిన పోలీసులు!

ఈ పథకం బాగా అమలైందనే టాక్ వస్తోందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. తాజాగా.. లోకేష్.. ఉత్తమ కార్యకర్తలు, నియోజకవర్గ సమన్వయ సమావేశంలో పాల్గొనేందుకు మచిలీపట్నం చేరుకోగా.. మూడు స్థంబాల సెంటర్‌లో మంత్రి కొల్లు రవీంద్ర అధ్వర్యంలో తల్లికి వందనం (Talliki vandanam) లబ్ధిదారులైన మహిళలు ఘనస్వాగతం పలికారు. తల్లికి వందనం పథకం అమలు చేసినందుకు తల్లులు మంత్రి లోకేష్‌కి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో నారా లోకేష్ ప్రసంగించారు.

రాష్ట్రంలో మహిళల గౌరవం పెరిగేలా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందనీ, పిల్లలను చదివించేందుకు ఏ తల్లీ ఇబ్బంది పడకూడదనే తల్లికి వందనం పథకం అమలుచేశామని తెలిపారు. "గతంలో మహిళలను కించపరిచేలా వ్యవహరించారు. కూటమి ప్రభుత్వం(Coalition government)లో మహిళలను, తల్లులను గౌరవించాలని నిర్ణయించాము. మహిళల త్యాగాలతోనే మేము ఈ స్థాయిలో ఉన్నాం" అని లోకేష్ అన్నారు.

ఇది కూడా చదవండి: Trump Tweet: ఇండియా పాక్ యుద్ధాన్ని అణిచిన వ్యక్తిని నేను... ట్రంప్ సంచలన వ్యాఖ్యలు!

ఇవాళ గురువారం కాబట్టి.. సచివాలయాలు తెరిచే ఉంటాయి. ఇంకా ఎవరికైనా డబ్బు జమ కాకపోతే, సమస్యలు సచివాలయాలలో వివరించవచ్చు. తద్వారా అక్కడి ఉద్యోగులు.. విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తారు. ప్రభుత్వం లబ్దిదారులైన అందరికీ కచ్చితంగా డబ్బు చేరాలని అధికారులను ఆదేశించింది. అందువల్ల అర్హులెవరూ మిస్సవకుండా మనీ తీసుకోవాలి. ప్రభుత్వం కోరుకుంటున్నది ఇదే.

ఇది కూడా చదవండి: AP New Airports: ఏపీలో కొత్తగా నాలుగు ఎయిర్‌పోర్టులు.. ఈ జిల్లాలకు మహర్దశ - ఆ విమానాశ్రయానికి రూ.8వేల కోట్లు!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు: 

New Project : గోదావరి వాసులకు శుభవార్త! 26న కీలక ప్రాజెక్ట్‌కి శంకుస్థాపన!

Aadhaar New Rules: ఆధార్ కార్డ్ రూల్స్ మార్చిన UIDAI! కొత్త రూల్స్ ఇవే!

Building Rules: ఏపీలో పేదలకు గుడ్ న్యూస్! జస్ట్ రూపాయి కడితే చాలు.. వాటికి గ్రీన్ సిగ్నల్!

Praja Vedika: నేడు (25/6) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

Amazon Prime Day Sale: వచ్చే నెలలో అమెజాన్ ప్రైమ్ డే సేల్.. తేదీలు ఇవే! వారికి మాత్రమే అవకాశం..

Rain Alert: వచ్చే రెండు రోజులూ భారీ వర్షాలే! ఈ జిల్లాలకు బిగ్ అలర్ట్!

Crime News: అనంతపురంలో మరో వ్యక్తి దారుణహత్య.. బండరాయితో కొట్టి చంపిన దుండగులు!

Government Key Announcement: కరువు జిల్లాకు రూ.1,200 కోట్ల మరో ప్రాజెక్ట్.. 6,500 మందికి పైగా ఉద్యోగాలు!

Vande Bharat Express: ఎంత ఘోరం.. ఎమ్మెల్యే కోసం సీటు ఇవ్వలేదని.. వందే భారత్‌లో ప్రయాణికుడిపై దాడి!

AP New Ration Cards: కొత్త రేషన్‌ కార్డు దరఖాస్తులకు చివరి గడువు ఎప్పుడు? ఈ కీలక అప్‌డేట్ వెంటనే తెలుసుకోండి!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group