ఇది కూడా చదవండి: Rain Alert: వచ్చే రెండు రోజులూ భారీ వర్షాలే! ఈ జిల్లాలకు బిగ్ అలర్ట్!
అనంతపురం(Anantapur) జిల్లాలో వరుస హత్యలతో జిల్లా ప్రజలు ఉలిక్కిపడుతున్నారు. నిన్నటికి నిన్న అనంతపురం నగర శివారులో ఒక యువకుడి దారుణ హత్య ఘటన మరువక ముందే, నేడు మరో వ్యక్తి హత్యకు గురికావడం కలకలం రేపుతోంది. అనంతపురం రూరల్ మండలం, అక్కంపల్లి గ్రామ సమీపంలో కుమ్మరి సురేష్ అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తుతెలియని వ్యక్తులు సురేష్ తలపై బండరాయితో అత్యంత పాశవికంగా మోది హత్య చేశారు. కంబదూరు ప్రాంతానికి చెందిన సురేష్, గత ఆరేళ్లుగా అనంతపురం రూరల్ పరిధిలోని రాచానపల్లి వద్ద గల సదాశివ కాలనీలో నివాసం ఉంటున్నాడు. మృతుడు సురేష్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అక్కంపల్లి సమీపంలో ఒక హోటల్ నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు.
ఇది కూడా చదవండి: Amazon Prime Day Sale: వచ్చే నెలలో అమెజాన్ ప్రైమ్ డే సేల్.. తేదీలు ఇవే! వారికి మాత్రమే అవకాశం..
పోలీసుల ప్రాథమిక అంచనా ప్రకారం, సురేష్ మంగళవారం అర్ధరాత్రి సమయంలో హోటల్ వ్యాపారం ముగించుకుని ఇంటికి తిరిగి వెళుతుండగా ఈ దారుణం జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు. మార్గమధ్యంలో గుర్తుతెలియని దుండగులు అతడిని అడ్డగించి, తలపై బండరాయితో కొట్టి చంపినట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో సురేష్ కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. వారి రోదనలు మిన్నంటాయి. ఈ హత్య ఘటనపై సమాచారం అందుకున్న అనంతపురం రూరల్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పరిశీలించి, కేసు నమోదు చేసుకున్నారు. హత్యకు గల కారణాలు, హంతకుల ఆచూకీ కోసం పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా, నిన్న అనంతపురం నగర శివారులోని బళ్లారి రోడ్డు సమీపంలో శివానంద అనే యువకుడు దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ ఘటన జరిగిన 24 గంటలు గడవక ముందే మరో హత్య జరగడం జిల్లాలో తీవ్ర భయాందోళనలకు దారితీస్తోంది. వరుస ఘటనలతో ప్రజలు భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు ఈ హత్యలపై ప్రత్యేక దృష్టి సారించి, నిందితులను త్వరితగతిన పట్టుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: AP New Airports: ఏపీలో కొత్తగా నాలుగు ఎయిర్‌పోర్టులు.. ఈ జిల్లాలకు మహర్దశ - ఆ విమానాశ్రయానికి రూ.8వేల కోట్లు!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
Vande Bharat Express: ఎంత ఘోరం.. ఎమ్మెల్యే కోసం సీటు ఇవ్వలేదని.. వందే భారత్‌లో ప్రయాణికుడిపై దాడి!
SIT notices: జగన్ కి షాక్.. చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి సిట్ నోటీసులు! విజయవాడ జైలులో..
Niharika Marriage: నిహారిక రెండో పెళ్లి పై క్లారిటీ ఇచ్చిన నాగబాబు.. వాళ్లిద్దరి మధ్య!
Pulivendula Police: జగన్ కి దిమ్మతిరిగే షాక్.. వైకాపా ఎంపీ అనుచరులపై కేసు! మధ్యాహ్నం లోపు..!
Journalist Case: మురికి వ్యాఖ్యల కేసు.. 'నేను చేసింది తప్పే'.. పోలీసుల విచారణలో కృష్ణంరాజు వెల్లడి!
Singayya Case: జగన్ కు చంద్రబాబు సర్కార్ బిగ్ షాక్! ఆ కేసులో ఏ2గా - డ్రైవర్ అరెస్ట్.?
security Lapses: నలుపురంగు కారులో వచ్చి.. జగన్ ఇంటిపై విసిరేసి వెళ్లాడు! సీసీటీవీ ఫుటేజీలో.!
Sajjala Criminal Case: సజ్జల రామకృష్ణారెడ్డికి బిగ్ షాక్.. క్రిమినల్ కేసు నమోదు.. వివరాలు ఇవే.!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: