ఇంటెలిజెన్స్ బ్యూరో (IB) ఆధ్వర్యంలో సెక్యూరిటీ అసిస్టెంట్ (మోటార్ ట్రాన్స్‌పోర్ట్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 455 ఖాళీలను ఈ ప్రకటనలో భర్తీ చేయనున్నారు. ఇందులో ఆంధ్రప్రదేశ్‌కి 9, తెలంగాణకు 7 పోస్టులు కేటాయించారు. ఎంపికైన అభ్యర్థులు దేశవ్యాప్తంగా ఉన్న వివిధ సబ్సిడరీ ఇంటెలిజెన్స్ బ్యూరోలు (SIBs)లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు 10వ తరగతి (మెట్రిక్యూలేషన్) ఉత్తీర్ణతతో పాటు చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్, కనీసం ఏడాది డ్రైవింగ్ అనుభవం, మోటార్ మెకానిజం పరిజ్ఞానం కలిగి ఉండాలి. అదనంగా అభ్యర్థులు సంబంధిత రాష్ట్రానికి చెందిన డొమిసైల్ సర్టిఫికేట్ తప్పనిసరిగా సమర్పించాలి.
అభ్యర్థుల వయసు సెప్టెంబర్ 28, 2025 నాటికి 18 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాల వయోపరిమితి సడలింపు లభిస్తుంది. దరఖాస్తు ఫీజు కింద యూఆర్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ పురుష అభ్యర్థులు రూ.650, ఎస్సీ, ఎస్టీ, మహిళలు, ఎక్స్‌సర్వీస్‌మెన్ అభ్యర్థులు రూ.550 చొప్పున చెల్లించాలి. ఎంపిక ప్రక్రియలో టైర్–1, టైర్–2 రాతపరీక్షలు, డ్రైవింగ్ టెస్ట్, ఇంటర్వ్యూ, మెడికల్ పరీక్ష ఉంటాయి. ఎంపికైన వారికి నెలకు రూ.21,700 నుంచి రూ.69,100 వరకు జీతం లభిస్తుంది.
రాతపరీక్షలో టైర్–1 పరీక్ష 100 మార్కులకు జరగనుంది. ఇందులో జనరల్ అవేర్‌నెస్, ట్రాన్స్‌పోర్ట్/డ్రైవింగ్ రూల్స్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, రీజనింగ్ వంటి విభాగాలకు 20 మార్కులు చొప్పున ఉంటాయి. నెగటివ్ మార్కింగ్ విధానం ఉంటుంది. టైర్–2 పరీక్ష 50 మార్కులకు జరుగుతుంది. ముఖ్యమైన తేదీలు: ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభం సెప్టెంబర్ 6, 2025, చివరి తేదీ సెప్టెంబర్ 28, 2025. ఫీజు చెల్లింపుకు సెప్టెంబర్ 30, 2025 వరకు గడువు ఉంది. రాతపరీక్ష తేదీలు త్వరలో ప్రకటించనున్నారు.