Header Banner

కొన్ని గంటల్లోనే టీడీపీ అకౌంట్లోకి వచ్చి పడిన రూ.17 కోట్లు! అసలు విషయం ఏమిటంటే?

  Tue May 27, 2025 20:48        Politics

ఏపీలో అధికార కూటమి ఏడాది పాలన పూర్తి చేసుకుంటోంది. కూటమికి నేతృత్వం వహిస్తున్న తెలుగు దేశం పార్టీ రాష్ట్రంలో అత్యంత పటిష్టంగా కనిపిస్తోంది. పార్టీ నిర్మాణం పరంగానే కాకుండా ఆర్ధికంగానూ బలపడే ప్రయత్నాలు చేస్తోంది. తద్వారా రాబోయే రోజుల్లో రాష్ట్రంలో తమ అధికారాన్ని సుస్థిరం చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది. దీనికి ఇవాళ కడపలో ప్రారంభమైన మహానాడు వేదికగా మారుతోంది.



తెలుగు తమ్ముళ్లకు పసుపు పండుగ అయిన టీడీపీ మహానాడును వైఎస్ కుటుంబ అడ్డాగా చెప్పుకునే కడప జిల్లాలో నిర్వహిస్తున్నారు. గత ఎన్నికల్లో ఈ జిల్లాలో వైసీపీ కంచుకోటల్ని కుప్పకూల్చిన ఉత్సాహంతో టీడీపీ శ్రేణులు మహానాడుకు భారీ ఎత్తున తరలివెళ్లాయి. అదే సమయంలో టీడీపీ ఖాతాల్లోకి ఏకంగా రూ.17 కోట్లు వచ్చిపడ్డాయి. మహానాడు సందర్భంగా పార్టీకి కార్యకర్తలు, నాయకులు, అభిమానులు భారీ ఎత్తున విరాళాలు సమర్పిస్తున్నారు.



ఇది కూడా చదవండి: ఏపీలో మరో గ్రీన్‌ఫీల్డ్ నేషనల్ హైవే.. రూ.1400 కోట్లతో..! ఆ రూట్లోనే, కేంద్రం గ్రీన్ సిగ్నల్!

 

ఈ నేపథ్యంలో కడప మహానాడులో టీడీపీకి భారీ విరాళాలు అందుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా మహానాడు వేళ కొన్ని గంటల వ్యవధిలోనే ఇలా రూ.17 కోట్ల విరాళాలు అందినట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఇలా విరాళాలు అందించిన వారిలో నేతలు, అభిమానులు, కార్యకర్తలు ఉన్నారు. ఈ విరాళాన్ని పార్టీ కార్యకర్తల సంక్షేమం కోసం ఖర్చు చేస్తామని సీఎం చంద్రబాబు మహానాడు వేదికగానే ప్రకటించారు. ఇప్పటికే 45 రోజుల వ్యవధిలోనే కోటి మంది సభ్యత్వాలు నమోదు చేసి రికార్డు సృష్టించిన టీడీపీ వారి సంక్షేమం కోసం 5 లక్షల బీమా సౌకర్యాన్ని కూడా కల్పించింది.


ఇది కూడా చదవండి: విజయవాడ విమానాశ్రయానికి మహర్దశ! ఇక నుండి అక్కడికి డైరెక్ట్ సర్వీసులు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

విశాఖ నుంచి ఈ మూడు మార్గాల్లో ప్రత్యేక రైళ్లు! హాల్ట్ స్టేషన్లు..!

 

వల్లభనేని వంశీకి హైకోర్టులో ఎదురుదెబ్బ...! అత్యవసర విచారణకు నిరాకరణ!

 

BSNL సూపర్ ప్లాన్! ఒకే రీఛార్జ్ లో అన్నీ బెనిఫిట్స్! కేవలం రూ.1198 కే 365 రోజులు!

 

తీపి క‌బురు చెప్పిన ఫ్లిప్‌కార్ట్..! ఈ ఏడాది 5 వేల ఉద్యోగాల భ‌ర్తీ!

 

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం.. ఇద్దరి మృతి! మరో ఎనిమిది మందికి..

 

మాజీ ఎమ్మెల్యే పై సీఐడీ కేసు నమోదు! కార్యాలయంపై దాడి తర్వాత...

 

కేంద్రం నుండి భారీ గిఫ్ట్! రూ.50 వేల స్కాలర్షిప్.. వారికి మాత్రమే!

 

ఏపీ పోలీసు బాస్‌గా అయన నియమకం! ఇక పూర్తిస్థాయి డీజీపీ!

 

సిరిసిల్లలో ముదిరిన ప్రోటోకాల్ వివాదం..! నేతల అరెస్టుతో ఉద్రిక్తత!

 

అవును ఆ ఇంటికి వెళ్లాను..! వైసీపీ వీడియోపై విజయసాయి రెడ్డి సంచలన ట్వీట్!

 


లోకేశ్​కు పార్టీలో ఆ పదవి.. జోరుగా చర్చ! జీవీ, ఆనం కీలక వ్యాఖ్యలు!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 


   #Andhrapravasi #TDP #Mahanadu2025 #PoliticalFunding #₹17Crores #TenaliIncident #LathiCharge