గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీకి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఆశించిన ఉపశమనం లభించలేదు. ఆయన దాఖలు చేసిన హౌస్ మోషన్ పిటిషన్‌పై తక్షణమే విచారణ చేపట్టేందుకు హైకోర్టు నిరాకరించింది. ఈ పిటిషన్‌పై వచ్చే గురువారం విచారణ జరుపుతామని న్యాయస్థానం స్పష్టం చేసింది.
అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నందున తనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసి, వైద్య చికిత్స పొందేందుకు అవకాశం కల్పించాలని కోరుతూ వల్లభనేని వంశీ దాఖలు చేసిన మరో పిటిషన్‌పై కూడా హైకోర్టు వెకేషన్ బెంచ్ ఇదే వైఖరిని అవలంబించింది. ఈ మధ్యంతర బెయిల్ పిటిషన్‌ను కూడా గురువారమే విచారిస్తామని పేర్కొంది.
మరోవైపు, నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీకి సంబంధించిన కేసులో వల్లభనేని వంశీని రెండోసారి తమ కస్టడీకి అప్పగించాలని కోరుతూ పోలీసులు నూజివీడు కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ కస్టడీ పిటిషన్‌పై విచారణను నూజివీడు కోర్టు రేపటికి వాయిదా వేసింది.
ఇది కూడా చదవండి: ఏపీ పోలీసు బాస్‌గా అయన నియమకం! ఇక పూర్తిస్థాయి డీజీపీ!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
లోకేశ్‌కు పార్టీలో ఆ పదవి.. జోరుగా చర్చ! జీవీ, ఆనం కీలక వ్యాఖ్యలు!
ప్రపంచంలో టాప్-10 వైమానిక దళాలు ఇవే! భారత్ స్థానం ఎక్కడంటే?
కేసీఆర్ కు కవితకు మధ్య గ్యాప్ వెనుక కారణం ఇదే! చేసింది అంతా ఆయనే!
ప్రధాని మోదీ అధ్యక్షతన ఎన్డీయే సీఎంలు, డిప్యూటీ సీఎంల భేటీ.. చేసిన తీర్మానాలు ఇవే!
జంట హత్యల కేసులో ఊహించని ట్విస్ట్.. వైసీపీ మాజీ ఎమ్మెల్యే బ్రదర్స్ పై కేసు నమోదు!
రెండు రోజుల పోలీస్ కస్టడీకి పీఎస్ఆర్, మధు! ఆంజనేయులపై ప్రశ్నల వర్షం..
ప్రధానికి కృతజ్ఞతలు తెలియజేసిన ఏపీ సీఎం చంద్రబాబు.. ఇవాళ మన్ కీ బాత్ కార్యక్రమం!
వైసీపీకి మరో భారీ షాక్! ఏపీ పోలీసుల అదుపులో మాజీ మంత్రి!
ఇలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదు.. ఆస్తి అడిగామా?
నిరూపించండి.. మనోజ్ ఎమోషనల్!
నిరుద్యోగులకు గుడ్ న్యూస్! నెలకు 2 లక్షల జీతంతో.. భారీ నోటిఫికేషన్!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: