Header Banner

విశాఖ నుంచి ఈ మూడు మార్గాల్లో ప్రత్యేక రైళ్లు! హాల్ట్ స్టేషన్లు..!

  Tue May 27, 2025 17:26        Politics

వేసవి సెలవుల్లో రైల్వేకు ప్రయాణికుల తాకిడి అధికంగా ఉంటుంది. వివిధ పుణ్యక్షేత్రాలు, పలు పర్యాటక ప్రాంతాలను సందర్శించడానికి, దూర ప్రాంతాలకు రాకపోకలు సాగించాలనుకునే వాళ్ల రద్దీ ఎక్కువగా కనిపిస్తుంటుందీ సీజన్‌లో. వాళ్లంతా కూడా రైళ్ల మీదే ఎక్కువగా ఆధారపడుతుంటారు.
ఈ రద్దీని దృష్టిలో ఉంచుకుని రైల్వే అధికారులు పలు ప్రత్యేక రైళ్లను ప్రవేశపెట్టడం ఆనవాయితీగా వస్తోంది. సికింద్రాబాద్ ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలను నిర్వహిస్తోన్న దక్షిణ మధ్య రైల్వే అధికారులు- పలు ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకుని రానున్నట్లు ఇదివరకే ప్రకటించారు.

తాజాగా మరిన్ని ఎక్స్‌ప్రెస్ సర్వీసులను ప్రకటించారు. జూన్ 1వ తేదీ నుంచి విశాఖపట్నం- బెంగళూరు, విశాఖపట్నం- తిరుపతి, విశాఖపట్నం- చర్లపల్లి స్టేషన్ల మధ్య ఈ రైళ్లు రాకపోకలు సాగిస్తాయి. ఆయా మార్గాల్లో ఈ నెల పొడవునా ఈ ప్రత్యేక రైళ్లు ప్రయాణికులకు అందుబాటులో ఉండనున్నాయి. జూన్ 1 నుంచి 29వ తేదీ వరకు ప్రతి ఆదివారం విశాఖపట్నం నుంచి బయలుదేరే నంబర్ 08581 నంబర్ ప్రత్యేక రైలు మరుసటి రోజు బెంగళూరుకు చేరుకుంటుంది. 2 నుంచి 30వ తేదీ వరకు ప్రతి సోమవారం బెంగళూరు నుంచి బయలుదేరే నంబర్ 08582 ప్రత్యేక రైలు మరుసటి రోజు విశాఖపట్నానికి చేరుకుంటుంది. విశాఖపట్నం, దువ్వాడ, అనకాపల్లి, సామర్లకోట, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, గుంటూరు, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, శ్రీకాళహస్తి, రేణిగుంట, కాట్పాడి, జోలార్ పేట, కుప్పం, కేఆర్ పురం మీదుగా ఈ రైళ్లు రాకపోకలు సాగిస్తాయి.

4 నుంచి 30వ తేదీ వరకు ప్రతి బుధవారం విశాఖపట్నం నుంచి బయలుదేరే నంబర్ 08547 నంబర్ ప్రత్యేక రైలు మరుసటి రోజు తిరుపతికి చేరుకుంటుంది. 5 నుంచి 30వ తేదీ వరకు ప్రతి శుక్రవారం తిరుపతి నుంచి బయలుదేరే నంబర్ 08548 ప్రత్యేక రైలు మరుసటి రోజు విశాఖపట్నానికి చేరుకుంటుంది. విశాఖపట్నం, దువ్వాడ, అనకాపల్లి, సామర్లకోట, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, గుంటూరు, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, శ్రీకాళహస్తి, రేణిగుంట మీదుగా ఈ రైళ్లు రాకపోకలు సాగిస్తాయి. 6 నుంచి 25వ తేదీ వరకు ప్రతి శుక్రవారం విశాఖపట్నం నుంచి బయలుదేరే నంబర్ 08579 నంబర్ ప్రత్యేక రైలు మరుసటి రోజు చర్లపల్లికి చేరుకుంటుంది. 7 నుంచి 26వ తేదీ వరకు ప్రతి శనివారం చర్లపల్లి నుంచి బయలుదేరే నంబర్ 08580 ప్రత్యేక రైలు మరుసటి రోజు విశాఖపట్నానికి చేరుకుంటుంది.

జూన్ 1 నుంచి 27 వరకు ప్రతి ఆదివారం రాత్రి 10: 20 నిమిషాలకు తిరుపతి నుంచి బయలుదేరే నంబర్ 07131 ప్రత్యేక రైలు మరుసటి రోజు నర్సాపూర్నికి చేరుకుంటుంది. 2 నుంచి ప్రతి సోమవారం మధ్యాహ్నం నర్సాపూర్ నుంచి బయలుదేరే నంబర్ 07132 ప్రత్యేక రైలు మరుసటి రోజు తిరుపతికి చేరుకుంటుంది.


ఇది కూడా చదవండి: ఏపీ పోలీసు బాస్‌గా అయన నియమకం! ఇక పూర్తిస్థాయి డీజీపీ!



అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:


లోకేశ్​కు పార్టీలో ఆ పదవి.. జోరుగా చర్చ! జీవీ, ఆనం కీలక వ్యాఖ్యలు!


ప్రపంచంలో టాప్-10 వైమానిక దళాలు ఇవే! భారత్ స్థానం ఎక్కడంటే?


కేసీఆర్ కు కవితకు మధ్య గ్యాప్ వెనుక కారణం ఇదే! చేసింది అంతా ఆయనే!


ప్రధాని మోదీ అధ్యక్షతన ఎన్డీయే సీఎంలు, డిప్యూటీ సీఎంల భేటీ.. చేసిన తీర్మానాలు ఇవే!


జంట హత్యల కేసులో ఊహించని ట్విస్ట్.. వైసీపీ మాజీ ఎమ్మెల్యే బ్రదర్స్ పై కేసు నమోదు!


రెండు రోజుల పోలీస్‌ కస్టడీకి పీఎస్ఆర్‌, మధు! ఆంజనేయులపై ప్రశ్నల వర్షం..


ప్రధానికి కృతజ్ఞతలు తెలియజేసిన ఏపీ సీఎం చంద్రబాబు.. ఇవాళ మన్ కీ బాత్ కార్యక్రమం!


వైసీపీకి మరో భారీ షాక్! ఏపీ పోలీసుల అదుపులో మాజీ మంత్రి!

ఇలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదు.. ఆస్తి అడిగామా?
నిరూపించండి.. మనోజ్ ఎమోషనల్!


నిరుద్యోగులకు గుడ్ న్యూస్! నెలకు 2 లక్షల జీతంతో.. భారీ నోటిఫికేషన్!


ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #Visakhapatnam #SpecialTrains #IndianRailways #TrainAlert #RailwayUpdate #APNews #TravelUpdate