Allu Sirish Wedding: అల్లు శిరీష్ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ షురూ! హాజరైన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్! MaheshBabu: హీరో టూ సీఈఓ... టాలీవుడ్ బిజినెస్ మ్యాన్! మహేష్ బాబు బిజినెస్ సీక్రెట్స్! Vijay Rashmika Wedding: విజయ్-రష్మిక పెళ్లి ఫిక్స్... వెడ్డింగ్ కార్డ్ వైరల్! ఫ్యాన్స్ క్రియేషనా లేక నిజమా! Allu Sirish marriage: ఎంగేజ్‌మెంట్ తర్వాత పెళ్లి సందడి.. అల్లు శిరీష్ తొలి ఆహ్వానం చిరంజీవికి! Sharwanand: శర్వానంద్‌కి జంటగా ‘డ్రాగన్’ బ్యూటీ... అంచనాలు పెంచుతున్న కొత్త క్రేజీ కాంబో! Mrunal Thakur Marriage: పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన మృణాల్ ఠాకూర్...! ఏమన్నారంటే...! Surya Jyothika: వాలెంటైన్స్ డే స్పెషల్.. సూర్య-జ్యోతిక ప్రేమకథలో ఆసక్తికర మలుపు! Twin Babies: సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రామ్ చరణ్-ఉపాసన పిల్లల పేర్లు! చాలా పవర్ ఫుల్ గా ఉన్నాయండోయ్... Valentines day Special Movie: రేపు 'కపుల్ ఫ్రెండ్లీ' ప్రీమియర్స్... మీ ఊరిలో థియేటర్ ఏది? టైమింగ్స్ ఇవే.! వాలెంటైన్స్ వీక్ ప్లాన్స్! Ott movies: ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్.. అర్ధరాత్రి ఓటీటీలోకి రెండు హిట్ సినిమాలు! Allu Sirish Wedding: అల్లు శిరీష్ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ షురూ! హాజరైన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్! MaheshBabu: హీరో టూ సీఈఓ... టాలీవుడ్ బిజినెస్ మ్యాన్! మహేష్ బాబు బిజినెస్ సీక్రెట్స్! Vijay Rashmika Wedding: విజయ్-రష్మిక పెళ్లి ఫిక్స్... వెడ్డింగ్ కార్డ్ వైరల్! ఫ్యాన్స్ క్రియేషనా లేక నిజమా! Allu Sirish marriage: ఎంగేజ్‌మెంట్ తర్వాత పెళ్లి సందడి.. అల్లు శిరీష్ తొలి ఆహ్వానం చిరంజీవికి! Sharwanand: శర్వానంద్‌కి జంటగా ‘డ్రాగన్’ బ్యూటీ... అంచనాలు పెంచుతున్న కొత్త క్రేజీ కాంబో! Mrunal Thakur Marriage: పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన మృణాల్ ఠాకూర్...! ఏమన్నారంటే...! Surya Jyothika: వాలెంటైన్స్ డే స్పెషల్.. సూర్య-జ్యోతిక ప్రేమకథలో ఆసక్తికర మలుపు! Twin Babies: సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రామ్ చరణ్-ఉపాసన పిల్లల పేర్లు! చాలా పవర్ ఫుల్ గా ఉన్నాయండోయ్... Valentines day Special Movie: రేపు 'కపుల్ ఫ్రెండ్లీ' ప్రీమియర్స్... మీ ఊరిలో థియేటర్ ఏది? టైమింగ్స్ ఇవే.! వాలెంటైన్స్ వీక్ ప్లాన్స్! Ott movies: ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్.. అర్ధరాత్రి ఓటీటీలోకి రెండు హిట్ సినిమాలు!

Prabhas Comments: కత్తులు పట్టే ప్రభాస్ మనసు దోచిన 'విజయవాడ' స్పెషల్.. ఆ జ్ఞాపకాలు వైరల్!

Prabhas Comments Vijayawada Punugulu: రెబల్ స్టార్ ప్రభాస్ ఆసక్తికరమైన వ్యక్తిగత విషయాలను వెల్లడించారు. తనకు ఇష్టమైన ఫుడ్ నుండి తనకు ఇష్టమైన రొమాంటిక్ జోనర్ వరకు.. ప్రభాస్ మనసులోని మాటలు

Published : 2026-02-23 15:02:00
  • విజయవాడలో బండి మీద.. ప్రభాస్ పునుగుల ఎమోషన్ తెలుసా?
     
  • ప్రభాస్ కు ఇష్టమైన స్నాక్స్ ఇవేనా?

Prabhas Comments Vijayawada Punugulu: ప్రభాస్ అనగానే మనకు బాహుబలి, సలార్ లాంటి భారీ యాక్షన్ సినిమాలే గుర్తొస్తాయి. స్క్రీన్ మీద ఆయన కత్తి పట్టి శత్రువులను వేటాడుతుంటే ఫ్యాన్స్‌కు పూనకాలు వస్తాయి. కానీ, మన 'రెబల్ స్టార్' మనసులో మాత్రం ఒక సున్నితమైన ప్రేమకథా ప్రేమికుడు ఉన్నాడని మీకు తెలుసా? తాజాగా సంతోష్ శోభన్ నటించిన 'కపుల్ ఫ్రెండ్లీ' సినిమా టీమ్‌తో ముచ్చటించిన ప్రభాస్, తన వ్యక్తిగత ఇష్టాల గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.

ప్రస్తుతం ప్రభాస్ చేతిలో ఉన్నవన్నీ భారీ యాక్షన్ చిత్రాలే (సలార్ 2, స్పిరిట్, కల్కి 2). కానీ ఆయనకు రొమాంటిక్ లవ్ స్టోరీస్ అంటేనే చాలా ఇష్టమట. ముఖ్యంగా మణిరత్నం గారు తీసిన 'గీతాంజలి' సినిమా అంటే ప్రభాస్‌కు ప్రాణం. "నేను యాక్షన్ హీరోని అని అందరూ అనుకుంటారు కానీ, నా ఆల్ టైమ్ ఫేవరెట్ మాత్రం గీతాంజలి. నేను మణిరత్నం గారికి వీరాభిమానిని" అని ఆయన మనసులో మాట బయటపెట్టారు.

తన కెరీర్‌లో చేసిన బుజ్జిగాడు, ఏక్ నిరంజన్ సినిమాల గురించి ప్రభాస్ చాలా ఎమోషనల్‌గా మాట్లాడారు. హీరో క్యారెక్టర్‌ని పూరీ జగన్నాథ్ రాసినట్టు  ఇంకెవ్వరూ రాయలేరని ఆయన కొనియాడారు. బుజ్జిగాడు కథ విన్నప్పుడు ఆ పాత్ర నేను చేయగలనా అని భయం వేసింది. ఇక ఏక్ నిరంజన్ లో చోటు క్యారెక్టర్ ఆటిట్యూడ్ నాకు చాలా ఇష్టం. విలన్ల ముందు కూడా హీరో సహజంగా ఏడ్చే సీన్లు పూరీ గారు మాత్రమే అలా రాయగలరు అని ప్రభాస్ చెప్పుకొచ్చారు.

ప్రభాస్ 'డార్లింగ్' సినిమాలో వేసుకున్న లూజ్ షర్ట్స్ అప్పట్లో ఒక పెద్ద ట్రెండ్. దాని వెనుక ఒక కథ ఉందట. ఛత్రపతి లాంటి మాస్ హిట్ తర్వాత లవ్ స్టోరీ చేస్తున్నప్పుడు లుక్ పరంగా ఏదో ఒకటి కొత్తగా ఉండాలని ఆ లూజ్ షర్ట్స్ వేయడం జరిగిందట. ఆ షర్ట్ జారిపోతుంటే దాన్ని సరిచేసుకోవడం, ప్యాంట్ లేపుకోవడం ఇవన్నీ ఒక స్టైల్‌లాగా ఆ పాత్ర కోసం డిజైన్ చేశామని ప్రభాస్ వివరించారు.

ప్రభాస్ విజయవాడ పునుగుల గురించి గుర్తు చేసుకున్నారు. చిన్నప్పుడు తన ఫ్రెండ్ ప్రమోద్ వాళ్ళ నాన్నగారు స్కూటర్ మీద తీసుకెళ్లి పునుగులు తినిపించేవారని, ఆ రుచిని ఇప్పటికీ మర్చిపోలేనని డార్లింగ్ నవ్వుతూ చెప్పారు.  ఆ పునుగులు గుర్తు చేసుకుంటే ఇప్పుడు కూడా నా నోట్లో  నోళ్లూరుతున్నాయని నవ్వుతూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ ఇంటర్వ్యూ సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Spotlight

Read More →