LIVE
Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  •  Vishaka: ప్రభుత్వ స్కూల్‌గా మారిన విశాఖ విమల విద్యాలయం.. కలెక్టర్, ఎమ్మెల్యే పల్లా చేతుల మీదుగా ప్రారంభం!  •  6G Network: భారత్‌లో 6G సంచలనం.. టెలికాం రంగం రూపురేఖలు మార్చబోతున్న కేంద్ర ప్రభుత్వ మాస్టర్ ప్లాన్!  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Health

Apple Benefits: బరువు తగ్గాలా? గ్రీన్ ఆపిల్ లేదా రెడ్ ఆపిల్ – ఏది మంచిది?

Apple Benefits: గ్రీన్ ఆపిల్ రెడ్ ఆపిల్ మధ్య ఉన్న తేడాలు, పోషక విలువలు, ఆరోగ్య ప్రయోజనాలు ఏవి? ఏది మంచిదో తెలుసుకోండి.

AndhraPravasi News Desk 1 min read
Apple Benefits: బరువు తగ్గాలా? గ్రీన్ ఆపిల్ లేదా రెడ్ ఆపిల్ – ఏది మంచిది?

Apple Benefits: ఆరోగ్యకరమైన ఆహారాల్లో యాపిల్‌కు ప్రత్యేక స్థానం ఉంది. రోజుకు ఒక యాపిల్ తింటే డాక్టర్ అవసరం లేదు అనే మాటకు కారణం దీనిలో పోషక విలువలే. అయితే గ్రీన్ ఆపిల్  రెడ్ ఆపిల్  మధ్య తేడాలు ఏమిటి? ఏది మంచిది? అనే ప్రశ్నలు చాలామందికి ఉంటాయి. ఈ రెండు పండ్ల మధ్య ఉన్న వ్యత్యాసాలను, పోషక విలువలను  ఆరోగ్య ప్రయోజనాలను ఇప్పుడు  చూద్దాం.

 గ్రీన్ ఆపిల్ సాధారణంగా పులుపు రుచితో ఉంటుంది. ఇది తిన్నప్పుడు కొంచెం టార్ట్ ఫీలింగ్ ఇస్తుంది. మరోవైపు రెడ్ ఆపిల్ తియ్యగా ఉండి తేలికగా తినడానికి అనువుగా ఉంటుంది. అందుకే పిల్లలు ఎక్కువగా రెడ్ ఆపిల్‌ను ఇష్టపడతారు. పోషక విలువల విషయానికి వస్తే, ఈ రెండు యాపిల్స్‌లో కూడా విటమిన్లు, ఫైబర్  యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. గ్రీన్ ఆపిల్‌లో షుగర్ కంటెంట్ తక్కువగా ఉండగా, ఫైబర్  విటమిన్ C ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరంలో జీర్ణక్రియను మెరుగుపరచడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. రెడ్ ఆపిల్‌లో నేచురల్ షుగర్ కొంచెం ఎక్కువగా ఉంటుంది, ఇది శరీరానికి త్వరగా శక్తిని అందిస్తుంది. అలాగే ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు గుండె ఆరోగ్యాన్ని కాపాడటానికి సహాయపడతాయి.

ఆరోగ్య ప్రయోజనాల పరంగా గ్రీన్ ఆపిల్ బరువు తగ్గాలనుకునే వారికి చాలా ఉపయోగకరం. తక్కువ క్యాలరీలు  ఎక్కువ ఫైబర్ ఉండటం వల్ల ఎక్కువసేపు ఆకలి అనిపించకుండా చేస్తుంది. డయాబెటిస్ ఉన్నవారికి కూడా ఇది మంచి ఎంపికగా భావిస్తారు. ఇక రెడ్ ఆపిల్ శరీరానికి త్వరగా ఎనర్జీ ఇవ్వడంతో పాటు రక్తంలో హీమోగ్లోబిన్ స్థాయిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అలాగే చర్మ కాంతిని పెంచడంలో కూడా ఇది సహాయపడుతుంది.

 గ్రీన్ ఆపిల్  రెడ్ ఆపిల్ రెండింటికీ ప్రత్యేకమైన ప్రయోజనాలు ఉన్నాయి. మీ ఆరోగ్య పరిస్థితి, అవసరాల ప్రకారం వీటిని ఎంపిక చేసుకోవడం ఉత్తమం. ఆరోగ్యకరమైన జీవనశైలిలో ఈ రెండు పండ్లను సమతుల్యంగా తీసుకోవడం ద్వారా మరింత ప్రయోజనం పొందవచ్చు. ఈ సమాచారం కేవలం మీ అవగాహనకు మాత్రమే మీ ఆరోగ్యరీత్యా ముందుగా మీ డాక్టర్ ని సంప్రదించి తీసుకోవడం ఉత్తమం.

Be the first to react

More Coverage