Summer Drinks: వేసవిలో శరీరాన్ని చల్లబరిచే ఉత్తమ పానీయం.. అన్నం గంజి తయారీ ఇలా! Lime Facts: పసుపు నిమ్మకాయ గొప్పదా? ఆకుపచ్చ నిమ్మకాయ గొప్పదా? షాకింగ్ నిజాలు... Chia Seeds: బరువు తగ్గాలనుకుంటున్నారా... గుండె ఆరోగ్యం నుంచి ఎముకల బలం వరకు.. చియా విత్తనాల అద్భుత ప్రయోజనాలివే!! Health Tips: వీరు ఈ పండు అస్సలు తినకూడదు... తింటే బాడీ లో ఆ పార్ట్ పనిచేయదట! Pumpkin Seeds: రోజుకు గుప్పెడు గింజలు తింటే చాలు... ఆ సమస్యలు దరిచేరవు! Healthy Pregnancy Tips: గర్భిణీ స్త్రీలు ఏం తినాలి? తల్లీబిడ్డల ఆరోగ్యానికి మేలైన ఆహార సూత్రాలివే! Healthy Lifestyle Tips: రాగి సంగటి నుంచి చద్దన్నం వరకు.. ఆరోగ్య ప్రయోజనాలు మీకోసం..! Dehydration: వేసవి తాపం నుండి రక్షణ... మీ డైట్‌లో ఇవి ఉంటే ఎండ దెబ్బకు సమస్యలుండవు! Kidney Stones Prevention: కిడ్నీలో రాళ్లు రాకూడదంటే..మీ డైట్‌లో ఈ డ్రింక్ ఉంటే రాళ్ల సమస్య మర్చిపోవచ్చు! Fatty Liver: చిన్నారుల్లో పెరుగుతున్న ఫ్యాటీ లివర్‌ సమస్య! అసలు కారణం ఇదేనా? Summer Drinks: వేసవిలో శరీరాన్ని చల్లబరిచే ఉత్తమ పానీయం.. అన్నం గంజి తయారీ ఇలా! Lime Facts: పసుపు నిమ్మకాయ గొప్పదా? ఆకుపచ్చ నిమ్మకాయ గొప్పదా? షాకింగ్ నిజాలు... Chia Seeds: బరువు తగ్గాలనుకుంటున్నారా... గుండె ఆరోగ్యం నుంచి ఎముకల బలం వరకు.. చియా విత్తనాల అద్భుత ప్రయోజనాలివే!! Health Tips: వీరు ఈ పండు అస్సలు తినకూడదు... తింటే బాడీ లో ఆ పార్ట్ పనిచేయదట! Pumpkin Seeds: రోజుకు గుప్పెడు గింజలు తింటే చాలు... ఆ సమస్యలు దరిచేరవు! Healthy Pregnancy Tips: గర్భిణీ స్త్రీలు ఏం తినాలి? తల్లీబిడ్డల ఆరోగ్యానికి మేలైన ఆహార సూత్రాలివే! Healthy Lifestyle Tips: రాగి సంగటి నుంచి చద్దన్నం వరకు.. ఆరోగ్య ప్రయోజనాలు మీకోసం..! Dehydration: వేసవి తాపం నుండి రక్షణ... మీ డైట్‌లో ఇవి ఉంటే ఎండ దెబ్బకు సమస్యలుండవు! Kidney Stones Prevention: కిడ్నీలో రాళ్లు రాకూడదంటే..మీ డైట్‌లో ఈ డ్రింక్ ఉంటే రాళ్ల సమస్య మర్చిపోవచ్చు! Fatty Liver: చిన్నారుల్లో పెరుగుతున్న ఫ్యాటీ లివర్‌ సమస్య! అసలు కారణం ఇదేనా?

Goat blood benefits: రక్తహీనత ఉన్నవారు మేక రక్తం తినొచ్చా? తింటే ఏమవుతుందో తెలిస్తే షాక్ అవుతారు!

Goat blood benefits: మేక రక్తం తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు దుష్ప్రభావాల గురించి.. రక్తహీనత ఉన్నవారికి ఇది ఎలా సహాయపడుతుంది? గుండె జబ్బులు, బీపీ ఉన్నవారు ఎందుకు దూరంగా ఉండాలి? వండేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటో తెలుసుకోండి..

Published : 2026-03-15 09:46:00

Goat blood benefits: ఆదివారం అంటే మాంసాహార ప్రియులకు పండగే. చికెన్, మటన్ ముక్క లేనిదే ముద్ద దిగదు. అయితే మటన్ షాపుల్లో దొరికే 'మేక రక్తం'  వండుకుని తినడం మన దగ్గర చాలా పాత అలవాటు. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి వేయించిన ఈ రక్తం కూరను చాలా మంది ఇష్టంగా తింటారు. కానీ, ఇది అసలు ఆరోగ్యానికి మంచిదేనా? దీనివల్ల లాభాలున్నాయా లేక సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా? అనే అనుమానాలు చాలా మందిలో ఉన్నాయి. దీనిపై ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారో  తెలుసుకుందాం.

మేక రక్తంలో ఐరన్  చాలా ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా 'హీమ్ ఐరన్' అనే రకం ఇందులో ఉంటుంది, ఇది మన శరీరంలో త్వరగా కలిసిపోతుంది. ఎవరైతే రక్తహీనత  సమస్యతో బాధపడుతుంటారో, వారికి ఇది ఒక మంచి ఆహారం అని చెప్పొచ్చు. దీంతో పాటు ఇందులో విటమిన్ B12, జింక్, సెలీనియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన కండరాల పెరుగుదలకు, రోగనిరోధక శక్తిని పెంచడానికి ఎంతగానో తోడ్పడతాయి. ఎటువంటి దీర్ఘకాలిక రోగాలు లేని వారు నెలకు ఒకటి లేదా రెండు సార్లు దీనిని మితంగా తీసుకోవచ్చని పరిశోధనలు చెబుతున్నాయి.

ఏదైనా సరే అతిగా తింటే ప్రమాదమే. మేక రక్తంలో ఐరన్ ఎక్కువగా ఉండటం వల్ల, దీనిని పదే పదే తినడం వల్ల శరీరంలో ఐరన్ స్థాయిలు ఉండాల్సిన దానికంటే పెరిగిపోతాయి. దీనిని వైద్య పరిభాషలో 'హిమోక్రోమాటోసిస్' అంటారు. ఇలా జరిగితే కాలేయం  గుండె పనితీరుపై తీవ్ర ప్రభావం పడుతుంది. అలాగే, దీనిని అరగించుకోవడం కొంచెం కష్టం కాబట్టి, జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశం కూడా ఉంది. అందుకే రుచిగా ఉందని చెప్పి ఎక్కువ మొత్తంలో లాగించేయడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు.

కొంతమంది ఆరోగ్య పరిస్థితిని బట్టి మేక రక్తం తినకపోవడమే ఉత్తమం. ముఖ్యంగా శరీరంలో 'యూరిక్ యాసిడ్' సమస్య ఉన్నవారు దీనికి దూరంగా ఉండాలి. ఎందుకంటే ఇందులో ప్యూరిన్లు ఎక్కువగా ఉంటాయి, ఇవి కీళ్ల నొప్పులను  మరింత పెంచుతాయి. అలాగే హై బీపీ, గుండె జబ్బులు ఉన్నవారు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఈ వంటకంలో ఉప్పు ఎక్కువగా వాడటం వల్ల రక్తపోటు పెరిగే ప్రమాదం ఉంటుంది. అధిక కొలెస్ట్రాల్ ఉన్నవారు, గర్భిణీలు  చిన్న పిల్లలకు దీనిని పెట్టకపోవడమే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.

చాలా మంది మేక రక్తాన్ని సరిగ్గా ఉడికించకుండా తింటుంటారు, ఇది చాలా ప్రమాదకరం. రక్తాన్ని నేరుగా తింటే ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం వంద శాతం ఉంటుంది. అందుకే దీనిని వండే ముందు చాలా ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద, ఉప్పు వేసి బాగా ఉడికించాలి. ఇలా చేయడం వల్ల అందులో ఉండే బ్యాక్టీరియా, వైరస్‌లు చనిపోతాయి. ఒకవేళ సరిగ్గా ఉడకకపోతే వైరల్ జ్వరాలు, వాంతులు, విరేచనాలు వంటి సమస్యలు వస్తాయి. శుభ్రంగా కడిగి, పద్ధతిగా వండుకుంటేనే దానివల్ల ప్రయోజనం ఉంటుంది.  ఈ సమాచారం కేవలం మీ అవగాహనకు మాత్రమే మీ ఆరోగ్య రీత్యా ముందుగా మీ డాక్టర్ ని సంప్రదించి తీసుకోవడం మంచిది సుమీ..

Spotlight

Read More →