FSSAI: ప్రముఖ ఫుడ్ కంపెనీలపై FSSAI సీరియస్.. 150కి పైగా నోటీసులు!
FSSAI: ఆహార ఉత్పత్తుల ప్రకటనలు, లేబులింగ్ నిబంధనల ఉల్లంఘనలపై ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) కఠిన చర్యలు చేపట్టింది. తప్పుదోవ పట్టించే ప్రకటనలు, తప్పుడు క్లెయిమ్‌లు, లేబులింగ్ నిబంధనలను పాటించకపోవడం వంటి అంశాలపై ఇటీవలి నెలల్లో 150కి పైగా నోటీసులు జారీ చేసినట్లు FSSAI వెల్లడించింది.
తప్పుడు ప్రకటనలు, క్లెయిమ్‌లపై FSSAI సీరియస్.. 150కి పైగా నోటీసులు..
ఫుడ్ కంపెనీలకు FSSAI షాక్.. నిబంధనల ఉల్లంఘనపై భారీ చర్యలు..
న్యూఢిల్లీ: ఆహార ఉత్పత్తుల ప్రకటనలు, లేబులింగ్ నిబంధనల ఉల్లంఘనలపై ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) కఠిన చర్యలు చేపట్టింది. తప్పుదోవ పట్టించే ప్రకటనలు, తప్పుడు క్లెయిమ్‌లు, లేబులింగ్ నిబంధనలను పాటించకపోవడం వంటి అంశాలపై ఇటీవలి నెలల్లో 150కి పైగా నోటీసులు జారీ చేసినట్లు FSSAI వెల్లడించింది.
ఈ మేరకు శనివారం సోషల్ మీడియా ద్వారా తన తాజా ఎన్‌ఫోర్స్‌మెంట్ చర్యలను FSSAI వెల్లడించింది. వినియోగదారులను తప్పుదోవ పట్టించే ప్రకటనలు, తప్పుడు వాదనలు, ఆహార ఉత్పత్తుల లేబులింగ్‌లో నిబంధనల ఉల్లంఘనలను తీవ్రంగా పరిగణిస్తున్నట్లు స్పష్టం చేసింది.
ప్రముఖ కంపెనీలకూ నోటీసులు
FSSAI చర్యలు తీసుకున్న సంస్థల్లో పలు ప్రముఖ బ్రాండ్లు ఉన్నాయి. నెస్లె ఇండియా, పెప్సీ, Abbott ఇండియా, రెడ్ బుల్ ఇండియా, Danone ఇండియా, మాన్స్టర్ ఎనర్జీ ఇండియా, హెల్ ఎనర్జీ ఇండియా, Mondelez ఇండియా, Coca-Cola ఇండియా, Diageo, Pernod Ricard, ఫెరేరో ఇండియా, Kenvue Inc వంటి సంస్థలకు నోటీసులు జారీ చేసినట్లు నియంత్రణ సంస్థ తెలిపింది. ఆహార భద్రతా చట్టాలు, నిబంధనలను ఉల్లంఘించిన పలు ఫుడ్ బిజినెస్ ఆపరేటర్లపై గత కొన్ని నెలలుగా చర్యలు కొనసాగుతున్నాయని FSSAI పేర్కొంది.
ఎనర్జీ డ్రింక్స్, ఆల్కహాల్ సంస్థలపైనా చర్యలు
ముఖ్యంగా ఎనర్జీ డ్రింక్స్, ఆల్కహాలిక్ బెవరేజెస్ తయారీ సంస్థల విషయంలోనూ FSSAI తనిఖీలు, చర్యలను ముమ్మరం చేసింది. నిబంధనలను ఉల్లంఘించిన పలు కంపెనీల ఉత్పత్తులను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించింది.
Amazon, Flipkartకు కూడా నోటీసులు
ఆన్‌లైన్ మార్కెట్‌ప్లేస్‌లపైనా FSSAI దృష్టి సారించింది. Amazon, Flipkart వంటి ఈ-కామర్స్ సంస్థలకు 12 నోటీసులు జారీ చేసినట్లు తెలిపింది. అంతేకాకుండా Amazonకు చెందిన ఒక గోదాం లైసెన్స్‌ను కూడా రద్దు చేసినట్లు వెల్లడించింది. ఆన్‌లైన్‌లో విక్రయించే ఆహార ఉత్పత్తుల విషయంలో కూడా నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకుంటున్నామని FSSAI చర్యలు స్పష్టం చేస్తున్నాయి.
KFC, McDonald's సహా ప్రముఖ ఫుడ్ చైన్లపై నిఘా
ఫుడ్ సర్వీస్ రంగంలోనూ తనిఖీలు కొనసాగుతున్నాయి. KFC, మెక్ డొనాల్డ్స్, పిజ్జా హట్, డొమినోస్, కోస్టా కాఫీ వంటి సంస్థలకు సంబంధించి 30కి పైగా నోటీసులు జారీ చేసినట్లు FSSAI తెలిపింది. Domino'sకు చెందిన ఐదు లైసెన్సులను సస్పెండ్ చేసినట్లు కూడా వెల్లడించింది. గత ఏడాది పలు ఫైవ్‌స్టార్ హోటళ్లకు సైతం నోటీసులు జారీ చేసినట్లు FSSAI గుర్తుచేసింది.
నోటీసులతో మార్పులు మొదలు
నిబంధనల ఉల్లంఘనలపై నోటీసులు అందుకున్న తర్వాత పలు కంపెనీలు ఇప్పటికే సరిదిద్దుకునే చర్యలు ప్రారంభించినట్లు FSSAI తెలిపింది. వినియోగదారులకు అందించే ఉత్పత్తుల విషయంలో సరైన సమాచారం ఇవ్వడం, ప్రకటనల్లో వాస్తవాలను మాత్రమే పేర్కొనడం, లేబులింగ్ నిబంధనలను పాటించడం తప్పనిసరని తాజా చర్యలు స్పష్టం చేస్తున్నాయి.
ఆహార భద్రత, వినియోగదారుల ప్రయోజనాల పరిరక్షణలో భాగంగా నిబంధనలు ఉల్లంఘించే సంస్థలపై చర్యలు కొనసాగుతాయని FSSAI తాజా ఎన్‌ఫోర్స్‌మెంట్ చర్యలు సూచిస్తున్నాయి.
Tags
Be the first to react