వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు ఊరట.. ఖాతాల్లోకి పరిహారం నిధుల జమ!
వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితుల ఎన్నో ఏళ్ల నిరీక్షణకు తెరపడింది. ప్రాజెక్టు కారణంగా ఇళ్లను, భూములను కోల్పోయిన నిర్వాసిత కుటుంబాలకు పరిహారం ప్యాకేజీ నిధులు వారి బ్యాంకు ఖాతాల్లో జమ అవుతున్నాయి.
2,351 నిర్వాసిత కుటుంబాలకు రూ.300 కోట్ల పరిహారం..
ఒక్కొక్కరి ఖాతాలో రూ.12.5 లక్షల నుంచి రూ.12.76 లక్షల వరకు..
అమరావతి: వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితుల ఎన్నో ఏళ్ల నిరీక్షణకు తెరపడింది. ప్రాజెక్టు కారణంగా ఇళ్లను, భూములను కోల్పోయిన నిర్వాసిత కుటుంబాలకు పరిహారం ప్యాకేజీ నిధులు వారి బ్యాంకు ఖాతాల్లో జమ అవుతున్నాయి.
వెలిగొండ ప్రాజెక్టు పరిధిలోని నిర్వాసితుల కోసం ప్రభుత్వం విడుదల చేసిన పరిహారం నిధులు సోమవారం ఉదయం నుంచి వారి ఖాతాల్లోకి చేరుతున్నాయి. ఒక్కో నిర్వాసితుడి ఖాతాలో సుమారు రూ.12.5 లక్షల నుంచి రూ.12.76 లక్షల వరకు పరిహారం మొత్తం జమ అవుతోంది.
ఇటీవల ఈనెల 27న నిర్వాసితులకు ముఖ్యమంత్రి రూ.300 కోట్ల చెక్కును అందించారు. ఈ నిధులతో మొత్తం 2,351 నిర్వాసిత కుటుంబాలకు పరిహారం అందించే ప్రక్రియ ప్రారంభమైంది.
దశాబ్దాలుగా పరిహారం కోసం ఎదురుచూస్తున్న వెలిగొండ నిర్వాసిత గ్రామాల ప్రజలకు ఈ నిధుల జమతో ఉపశమనం లభించింది. తమకు ఇచ్చిన హామీ ప్రకారం ప్రభుత్వం పరిహారం అందించడంపై నిర్వాసితులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా ప్రభావితమైన కుటుంబాల పునరావాసం, ఆర్థిక భద్రత కోసం ఈ పరిహారం కీలకంగా మారనుంది. ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకుందని నిర్వాసిత గ్రామాల ప్రజలు పేర్కొన్నారు.