నేడు రక్షణ రంగ పురస్కారాల ప్రదానం.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా వీరులకు గౌరవం!
దేశ రక్షణలో అసాధారణ ధైర్యసాహసాలు ప్రదర్శించిన సైనికులు, భద్రతా సిబ్బందికి నేడు ప్రతిష్ఠాత్మక రక్షణ రంగ పురస్కారాలు అందజేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జరిగే 2026 రెండో డిఫెన్స్ ఇన్వెస్టిచర్ వేడుకలో వీరులకు పురస్కారాలు ప్రదానం చేయనున్నారు.
దేశ రక్షణలో ధైర్యానికి గుర్తింపు.. సైనికులకు గ్యాలంట్రీ అవార్డులు..
రాష్ట్రపతి భవన్లో డిఫెన్స్ ఇన్వెస్టిచర్ వేడుక.. వీర సైనికులకు సత్కారం..
న్యూఢిల్లీ: దేశ రక్షణలో అసాధారణ ధైర్యసాహసాలు ప్రదర్శించిన సైనికులు, భద్రతా సిబ్బందికి నేడు ప్రతిష్ఠాత్మక రక్షణ రంగ పురస్కారాలు అందజేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జరిగే 2026 రెండో డిఫెన్స్ ఇన్వెస్టిచర్ వేడుకలో వీరులకు పురస్కారాలు ప్రదానం చేశారు.
సాయంత్రం 5 గంటలకు జరిగిన ఈ కార్యక్రమంలో రక్షణ దళాలు, కేంద్ర సాయుధ పోలీసు బలగాలు, రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల పోలీసు సిబ్బందికి గ్యాలంట్రీ అవార్డులను రాష్ట్రపతి అందజేశారు.
దేశ భద్రత కోసం అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో పనిచేస్తూ శౌర్యం ప్రదర్శించిన సిబ్బందిని గుర్తిస్తూ ఈ పురస్కారాలను అందిస్తారు. ఉగ్రవాదం, తిరుగుబాటు కార్యకలాపాలు, సరిహద్దు సవాళ్లను ఎదుర్కొంటూ చేసిన సేవలకు ఈ అవార్డులు గౌరవ సూచకంగా నిలుస్తాయి.
ప్రత్యేకంగా జమ్మూ కశ్మీర్, ఈశాన్య రాష్ట్రాలు, దేశ సరిహద్దు ప్రాంతాల్లో భద్రతా సిబ్బంది చూపిన ధైర్యానికి గుర్తింపుగా ఈ పురస్కారాలు ప్రధానం చేశారు. అలాగే విమానయానం, సముద్ర కార్యకలాపాలు, విపత్తుల సమయంలో మానవతా సేవల్లో ప్రదర్శించిన అసాధారణ సాహసాలకు కూడా గౌరవం లభిస్తుంది.
ఇప్పటికే ఈ నెల 8న జరిగిన డిఫెన్స్ ఇన్వెస్టిచర్ వేడుక మొదటి దశలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పలువురు సిబ్బందికి గ్యాలంట్రీ అవార్డులు అందజేశారు. దేశ రక్షణ కోసం తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా సేవలందిస్తున్న వీరుల త్యాగాలకు ఈ పురస్కారాలు ప్రత్యేక గుర్తింపుగా నిలుస్తున్నాయి.