ఆస్ట్రేలియా వెళ్లే వారికి కష్టాలు తప్పినట్టే! మెడికల్ టెస్ట్ ఇకపై విజయవాడ లోనే!

విజయవాడ: ఆస్ట్రేలియా వీసా కోసం దరఖాస్తు చేసుకునే వారికి ఆంధ్రప్రదేశ్‌లోనే ఇమ్మిగ్రేషన్ మెడికల్ పరీక్షలు చేయించుకునే అవకాశం అందుబాటులోకి రానుంది. విజయవాడలోని మణిపాల్ ఆస్పత్రి ఆస్ట్రేలియా వీసా దరఖాస్తుదారుల ఇమ్మిగ్రేషన్ మెడికల్ ఎగ్జామినేషన్స్ (IMEs) నిర్వహించేందుకు అధికారిక గుర్తింపు పొందినట్లు తెలుగుదేశం ఆస్ట్రేలియా ప్రకటించింది. ఈ సేవలు 2026 అక్టోబర్ 26, సోమవారం నుంచి ప్రారంభం కానున్నట్లు వెల్లడించింది.

Australian Visa Medical Examination in manipal Hospital Vijayawada
Australian Visa Medical Examination in manipal Hospital Vijayawada
  • విజయవాడ మణిపాల్ ఆస్పత్రిలో ఆస్ట్రేలియా వీసా మెడికల్ పరీక్షలు అక్టోబర్ 26 నుంచి ప్రారంభం.
  • 11 నెలల కృషి తర్వాత ఈ గుర్తింపు లభించినట్లు తెలుగుదేశం ఆస్ట్రేలియా ప్రకటన.

విజయవాడ: ఆస్ట్రేలియా వీసా కోసం దరఖాస్తు చేసుకునే వారికి ఆంధ్రప్రదేశ్‌లోనే ఇమ్మిగ్రేషన్ మెడికల్ పరీక్షలు చేయించుకునే అవకాశం అందుబాటులోకి రానుంది. విజయవాడలోని మణిపాల్ ఆస్పత్రి ఆస్ట్రేలియా వీసా దరఖాస్తుదారుల ఇమ్మిగ్రేషన్ మెడికల్ ఎగ్జామినేషన్స్ (IMEs) నిర్వహించేందుకు అధికారిక గుర్తింపు పొందినట్లు తెలుగుదేశం ఆస్ట్రేలియా ప్రకటించింది. ఈ సేవలు 2026 అక్టోబర్ 26, సోమవారం నుంచి ప్రారంభం కానున్నట్లు వెల్లడించింది.

తెలుగుదేశం ఆస్ట్రేలియా తెలిపిన వివరాల ప్రకారం.. ఈ గుర్తింపు కోసం సుమారు 11 నెలల పాటు ప్రయత్నాలు చేశారు. సాంకేతిక, క్లినికల్ అంచనాలకు సంబంధించిన 70 ఈమెయిల్స్‌, 35 పత్రాలతో ప్రక్రియను ముందుకు తీసుకెళ్లారు. బృందం చేసిన నిరంతర కృషి ఫలితంగా ఈ గుర్తింపు లభించిందని సంస్థ పేర్కొంది.

11 నెలల ప్రయత్నంతో గుర్తింపు

ఈ కార్యక్రమం సాధ్యమయ్యేందుకు డాక్టర్ ఫణీందర్ తాటినేని, విజయ్ చెన్నుపాటి, సతీష్ గడ్డె, నెహ్రూ అథోటా కీలకంగా కృషి చేసినట్లు తెలుగుదేశం ఆస్ట్రేలియా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌లోని ఆస్ట్రేలియా వీసా దరఖాస్తుదారులకు ఈ సేవలు అందుబాటులోకి రావడం ముఖ్యమైన ముందడుగుగా పేర్కొంది.

వీసా ప్రక్రియలో వైద్య పరీక్షలు కీలకం

ఆస్ట్రేలియా వీసా పొందాలనుకునే దరఖాస్తుదారులు వీసా నిబంధనలకు అనుగుణంగా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తుదారుల ఆరోగ్య పరిస్థితిని అంచనా వేసేందుకు ఆస్ట్రేలియా హోం అఫైర్స్ విభాగం నిర్దేశించిన గుర్తింపు పొందిన వైద్యులు, వైద్య కేంద్రాల్లోనే ఈ పరీక్షలు నిర్వహిస్తారు. పరీక్షల అనంతరం వైద్య నివేదికలను 'eMedical' వ్యవస్థ ద్వారా ఆస్ట్రేలియా అధికారులకు ఆన్‌లైన్‌లో పంపిస్తారు.

అపాయింట్‌మెంట్‌, ఇతర వివరాల కోసం

ఆస్ట్రేలియా వీసా మెడికల్ పరీక్షలు, అపాయింట్‌మెంట్‌, సేవలకు సంబంధించిన మరిన్ని వివరాలను విజయవాడ మణిపాల్ ఆస్పత్రి అధికారిక వెబ్‌పేజీలో తెలుసుకోవచ్చు.

అధికారిక వెబ్‌సైట్:   https://www.manipalhospitals.com/campaign/hospitals/vijayawada/australia/

Tags

Be the first to react

Latest