ప్రియమైన ఆంధ్రప్రవాసి పాఠక భక్తులారా,
సాక్షాత్తు వ్యాస భగవానుని కృపా ప్రసాదంతో, గీతామాత ఆరాధనకు మనకు లభించిన ఈ పవిత్ర అవకాశాన్ని మీతో పంచుకోవడం ఆనందకరమైన కర్తవ్యంగా భావిస్తున్నాం..
సాక్షాత్తు భగవంతుని వ్యక్తస్వరూపము, మూర్తి స్వరూపమైన శ్రీమద్భగవద్గీత మానవాళికి అందిన రోజు గీతా జయంతి రోజు. డిసెంబర్ ఒకటవ తేదీకి గీతా జయంతి వస్తుంది. ఈ గీతా జయంతి సందర్భంగా, పూజ్య శ్రీ గురుదేవుల ఆశీస్సులతో శ్రీమద్భగవద్గీత అష్టోత్తర శతనామావళిలోని ఈరోజు 47వ రోజు నామాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాము.
ప్రతి నామం వెనుక ఉన్న అర్థం, ఆధ్యాత్మికత, భక్తి సారాన్ని తెలుసుకొని మనం గీతామాతను మరింతగా ఆరాధించుకుందాం. ఈ పవిత్ర ప్రయత్నంలో భాగంగా, ఆంధ్రప్రవాసి Devotional విభాగంలో ప్రతి రోజు ఒక నామాన్ని మీకు అందజేస్తూ, మన గీతామాత కరుణకు అంజలి ఘటిస్తున్నాము.
ఓం వ్యాసదేవాయ నమః
పూజ్యశ్రీ భవఘ్నీ గురుదేవుల వారి అనుగ్రహం తో
శ్రీమద్భగవద్గీత అష్టోత్తరశత నామావళి
47. ఓం స్మృతి ప్రదాయై నమః
అర్థం: స్మృతి - విస్మృతి అనే రెండు మాటలున్నాయి. స్మరణ - విస్మరణ అన్నా అవే. ఏది స్మృతి? ఏది విస్మృతి? వాస్తవ స్వరూపాన్ని మరచిపోవటమే విస్మృతి. మరిచిపోయిన దానిని జ్ఞాపకానికి తెచ్చుకోవటమే స్మృతి. అదే స్మరణ.
ధ్యాయతో విషయాన్ పుంసః
సంగస్తేషూపజాయతే
సంగాత్ సంజాయతే కామః
కామాత్ క్రోధో-భిజాయతే ॥ 2.62
క్రోధాత్ భవతి సమ్మోహః
సమ్మోహాత్ స్మృతి విభ్రమః ।
స్మృతిభ్రంశాత్ బుద్ధి
నాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి ॥ ౨.౬౩
అర్థం: నిరంతర విషయచింతన వలన మనిషికి వాటిపట్ల ఆసక్తి జన్మిస్తుంది. అట్టి ఆసక్తిచే కోరిక జన్మిస్తున్నది. ఆ కోరిక తీరనందువలన క్రోధం పుడుతున్నది. క్రోధం వలన అవివేకం కలుగుతున్నది. అవివేకం వలన స్మృతి విభ్రమ (మరపు) కలుగుతున్నది. స్మృతి భ్రంశం వలన బుద్ధి నశిస్తున్నది. బుద్ధినాశనంతో పూర్తిగా నశిస్తున్నాడు. నేను దేహమాత్రుడనని అనుకోవటమే అవివేకం. అందుచేత మరపు కలుగుతుంది. దేహభ్రమలో ఓలలాడుతుంటాం. నేను దేహమాత్రుడను కాను. దేహంలో ఉన్న దేహిని, నేను ఆత్మస్వరూపాన్ని అని తెలుసుకోవటమే జ్ఞానం. ఈ జ్ఞానామృతంతో మనలోని విభ్రమం / భ్రాంతి తొలగిపోతుంది. స్వస్వరూప జ్ఞానం - అనగా స్మృతి కలుగుతుంది.
అట్టి జ్ఞానామృతంతో నాలోని మోహాన్ని నశింపజేసి, నేను ఆత్మస్వరూపాన్ని అనే ఎరుక కలిగించిన గీతామాతకు జ్ఞానదృష్టితో వందనం చేస్తున్నాను.
ఈక్రింది telegram channel లింకు ద్వారా మనం పూజ్య శ్రీ భవఘ్ని గురుదేవుల వారి సత్సంగాలు శ్రవణం చేయవచ్చు
లింకు లో జాయిన్ అవండి
ఇంతటి మహత్తరమైన అవకాశాన్ని మనకందించిన గురుదేవుల వారికి అమ్మకు కృతజ్ఞతలు తెలియజేస్తూ
జై గురుదేవ్
నామం 44: Bhagavad Gita: హితకరమైన కోరికలతో జీవిస్తే ఫలితం తప్పదు.. గీతా సందేశం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -44!
నామం 41 : Bhagavad Gita: జననం మరణం అనివార్యం.. ఇది తెలిసినవాడు శోకించడు... కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -41!
నామం 40 : Bhagavad Gita: అహం బ్రహ్మాస్మి.. మనిషి నుంచి పరమాత్మ వైపు ఆత్మయాత్ర.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా - 40!
నామం 36 : Bhagavad Gita :సుఖం ఉన్నంత మాత్రాన శాంతి ఉండదు.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -36!
నామం 29 : Bhagavad Gita: భయంలేని జీవితం దైవసంపదతోనే సాధ్యం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -29!
నామం 28 : Bhagavad Gita: మోక్షానికి మూలం ధ్యానం, ధ్యానానికి మూలం దివ్యశక్తి.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -28!
నామం 26 : Bhagavad Gita: జన్మ మరణాలను జయించేది సమస్థితి అదే మోక్షమార్గం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -26!
నామం 24 : జీవాత్మ నుండి పరమాత్మ వరకు గీతా ప్రబోధం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -24!