మరో కొన్ని గంటల్లో 2025కి వీడ్కోలు చెప్పి, సరికొత్త ఆశలతో 2026 నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాం. ఈ కొత్త ఏడాదిని మరింత గుర్తుండిపోయేలా చేసుకోవాలని చాలా మంది రకరకాల ప్లాన్స్ వేస్తుంటారు. కొందరు కొత్త నిర్ణయాలు (Resolutions) తీసుకుంటే, మరికొందరు తమ కుటుంబంతో లేదా స్నేహితులతో కలిసి ఎక్కడికైనా విహారయాత్రకు వెళ్లాలని కోరుకుంటారు. మీరు కూడా అలాంటి ప్లాన్‌లో ఉన్నారా? అయితే మీకోసం ఐఆర్‌సీటీసీ (IRCTC) ఒక అద్భుతమైన గిఫ్ట్ ప్యాకేజీని సిద్ధం చేసింది.
పర్యాటకుల స్వర్గధామం 'గోవా'ను సందర్శించేందుకు ఐఆర్‌సీటీసీ 'గోవా డిలైట్' పేరుతో ప్రత్యేక విమాన ప్యాకేజీని ప్రకటించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం.. ఈ ప్రయాణం జనవరి నెల చివరలో ప్లాన్ చేయబడింది. పండుగ హడావుడి తగ్గాక, ప్రశాంతంగా వెళ్లాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్.
టూర్ తేదీలు: 2026, జనవరి 24 నుండి జనవరి 27 వరకు (3 రాత్రులు, 4 పగళ్లు).
ప్రారంభం: ఉత్తరప్రదేశ్‌లోని లక్నో నుండి ఈ విమాన ప్రయాణం మొదలవుతుంది.
IRCTC గోవా డిలైట్ ప్యాకేజీ - ముఖ్య వివరాలు
ఫ్లైట్ ఛార్జీలు: లక్నో టూ గోవా, అలాగే రిటర్న్ ఫ్లైట్ ఛార్జీలు
ఒక వ్యక్తికి రూ. 53,700
డబుల్ ఆక్యుపెన్సీ: వ్యక్తికి రూ. 40,500
ట్రిపుల్ ఆక్యుపెన్సీ: ఒక్కొక్కరికి రూ. 38,000
పిల్లల కోసం అదనపు బెడ్: రూ 31,800
అదనపు బెడ్ లేని వారి కోసం: రూ 30,100
వసతి: ఫోర్ స్టార్ హోటల్
ప్రయాణం: ఉత్తర గోవా, దక్షిణ గోవాలో ముఖ్యమైన స్థలాలు సందర్శించవచ్చు
ప్రత్యేక ఆకర్షణలు: మాండోవి నదిలో బీచ్‌లు, చర్చిలు, కోటలు, పడవ ప్రయాణాలు
రుచికరమైన ఆహారం, సౌకర్యవంతమైన ట్రాన్స్‌పోర్ట్
బుక్ చేసుకునే విధానం: IRCTC కార్యాలయం లేదా irctctourism.com వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చు.
నూతన సంవత్సరం కొత్త ఆశలతో ప్రారంభం కావడానికి ఒక మంచి అవకాశం.. కొంతమంది న్యూ ఇయర్ రెసొల్యూషన్స్ చేసుకుంటారు. ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితి, విద్య లేదా వ్యక్తిగత అభివృద్ధిపై తీర్మానాలు చేస్తారు. అలాగే, మరికొందరూ నూతన సంవత్సరం సందర్భంగా తమ కుటుంబంతో లేదా ప్రియమైనవారితో ఏదైన ట్రిప్ ప్లాన్ చేయాలని ఇష్టపడతారు. మీరు కూడా ఒక అందమైన ప్రయాణం ప్లాన్ చేస్తుంటే, IRCTC అందిస్తున్న ఈ స్పెషల్ ఆఫర్ మీకు బెస్ట్ ఆప్షన్. ఇక ఆలస్యం ఎందుకు వెంటనే టికెట్స్ బుక్ చేసుకోండి.