కొత్త ఏడాది సందడి మొదలైన వేళ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు, ప్రభుత్వ ఉద్యోగులకు మరియు అణగారిన వర్గాలకు అదిరిపోయే కానుకలను ప్రకటించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో సామాజిక న్యాయం, పరిపాలన సంస్కరణలు మరియు మౌలిక వసతుల కల్పనే ధ్యేయంగా పలు చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా ఎస్సీ సామాజిక వర్గాలకు ఆర్థిక వెన్నుదన్నుగా నిలిచేలా తీసుకున్న నిర్ణయం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
వడ్డీ మాఫీ ప్రయోజనం ఎవరికీ?
ఎస్సీ సామాజిక వర్గాలకు చెందిన లబ్ధిదారులు
సాంఘిక సంక్షేమ శాఖలో రుణాలు తీసుకున్నవారు
NSFDC / NSKFDC పథకాల ప్రయోజనదారులు
ఈ వడ్డీ మాఫీ వల్ల పాత బకాయిల భారం తగ్గి, లబ్ధిదారులు NSFDC మరియు NSKFDC సంస్థల ద్వారా మళ్లీ కొత్త రుణాలు పొందేందుకు అర్హత సాధిస్తారు. ఇది వారి జీవనోపాధిని మెరుగుపరుచుకోవడానికి గొప్ప అవకాశం.
కేబినెట్ ఆమోదించిన ఆ కీలక నిర్ణయాల పూర్తి వివరాలు మీకోసం..
గ్రామ & వార్డు సచివాలయాలకు కొత్త పేర్లు
స్వర్ణ గ్రామం: ఇకపై గ్రామ సచివాలయాలను 'స్వర్ణ గ్రామం' అని పిలుస్తారు.
స్వర్ణ వార్డు: పట్టణ ప్రాంతాల్లోని వార్డు సచివాలయాలను 'స్వర్ణ వార్డు'గా మారుస్తారు. కేవలం పేర్లు మార్చడమే కాకుండా, సచివాలయాల ద్వారా అందుతున్న సేవలను మరింత వేగవంతం చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
అమరావతికి భారీ మౌలిక వసతుల ప్రాజెక్టులు
జధాని అమరావతిని ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దే పనులను ప్రభుత్వం వేగవంతం చేస్తోంది. రాజధానిలో మౌలిక వసతుల కల్పన కోసం నాబార్డ్ (NABARD) నుంచి రూ. 7,387 కోట్ల రుణాన్ని తీసుకునే ప్రతిపాదనకు కేబినెట్ పచ్చజెండా ఊపింది. ఉండవల్లి వద్ద భారీ 'ఫ్లడ్ పంపింగ్ స్టేషన్' నిర్మాణానికి ఆమోదం తెలిపారు. ఇది అమరావతి ప్రాంతానికి వరద ముప్పు లేకుండా చేస్తుంది.
రోడ్డు భద్రత చర్యలు
లైఫ్ ట్యాక్స్ కింద వాహనాలపై 10% Road Safety Cess
ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త
DA & DR లో 3.64% పెంపు
జనవరి 1, 2024 నుంచి అమలు
మొత్తం శాతం → 37.31%
స్మార్ట్ మీటర్లు & అడ్మిన్ రీఆర్గనైజేషన్
ప్రభుత్వ కార్యాలయాల్లో స్మార్ట్ మీటర్లు అమలు
కొత్త రెవెన్యూ డివిజన్లు & అడ్మిన్ మార్పులు
ముఖ్య ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్
తిరుపతిలో Sports City స్థాపన
విశాఖలో ఆస్పత్రి నిర్మాణానికి భూమి కేటాయింపు
అమరావతిలో Quantum Computing Center ప్రతిపాదన
ఉండవల్లిలో Flood Pumping Station నిర్మాణం
పరిపాలనలో ఆధునీకరణ, అణగారిన వర్గాలకు ఆర్థిక చేయూత మరియు ఉద్యోగుల సంక్షేమం.. ఇలా అన్ని వర్గాలను సంతృప్తి పరిచేలా ఏపీ కేబినెట్ నిర్ణయాలు ఉన్నాయి. ఈ నిర్ణయాలు క్షేత్రస్థాయిలో అమలైతే రాష్ట్ర అభివృద్ధికి సరికొత్త వేగం వస్తుందని ప్రజలు ఆశిస్తున్నారు.